Jun 22 2013

||బతికుండగా వినిపించుకుంటామా?||

ఒడిలో పిల్లల్లారా!..
దైవదర్శనం కోరి వచ్చిన మిమ్మల్ని
శాశ్వత నిద్రపుచ్చానని..
మీవాళ్ళు నిందిస్తున్నారు..

ఎడబాటుని జీర్ణించుకోలేక
రోదిస్తున్నారు..
అర్థం చేసుకోలేని మూర్ఖత్వంలో
నెపాన్ని.. పాపాన్ని..
తల్లి ప్రకృతిని
నాకు అంటిస్తున్నారు..

లయకారుడి సన్నిధిలో ఈ సహయోగం
మీరుకోరని.. ఈ దైవదర్శనం తర్వాత
బతికున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోని మాటలు
మీకు.. ఇప్పుడు చెబుతున్నా

నా గుండెలు, బద్దలుకొట్టి..
గర్భాన్ని కొల్లగొట్టి..
కొండచెరియల్నీ, నేలబొరియల్నీ
వదలకుండా నన్ను తిరగబెట్టి..
పచ్చదనాల ఆఛ్ఛాదనను
కర్కశంగా చీరేసారు.

ఎంత తల్లినైనా ఇంత కుమ్ముడు
ఎలాగో తట్టుకుందామనుకున్నా..

నా తండ్రి ఆకాశరాజు కన్నీరు చూసి-చూసి
చెల్లి గంగమ్మ శివయ్యను కడిగేసి నట్టుంది..
కేదార శిఖపాయ సడలినట్టైంది

చెరబారీ సరస్సు చినుకు చుక్కలతో చిందేసింది
మిమ్మల్నిలా నా ఒళ్ళో.. పడుకోబెట్టింది.

మీ నిష్క్రమణంతోనైనా
ఈ లోకానికి కనువిప్పు కలిగేనో లేదో..

నా మాట కాస్త ..ఆలకిస్తారా!!

పాపం పండటమంటూ ఏదైనా ఉందంటే..
అది నన్ను పిండడమే.నని
బ్రతికున్న మీ వాళ్ళకు బోధ పడని ఈ మాట..
మీ మరుజన్మ లోనైన గుర్తించుకుంటారా!!

ఇట్లు.. పుత్రశోకంతో.. మీ తల్లి.; పేరుకి.. రత్న గర్భ.

(హిమాలయ సునామి.. జూన్ 15, 2013 న వేల మంది చనిపోయారని నిర్థారణకు వచ్చాక…)

RTS Perm Link

One response so far

One Response to “||బతికుండగా వినిపించుకుంటామా?||”

  1. క‌నిష్ఠon 27 Jun 2013 at 12:14 PM

    గ‌ర్భకోశాన్నీ పెళ్ళగిస్తుంటే
    ర‌త్నగ‌ర్భకైనా గ‌ర్భశోక‌మే

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa