Jun 13 2013

||నగు మోము గన లేని నా జాలిఁ దెలిసీ..||

మబ్బులెనక జాబిలమ్మలెన్నో..
ముక్కలు-ముక్కలు గా కదిలొస్తున్నట్టు..
ఆకాశంలో సగభాగాన్ని కప్పేసి
చందమామ కొంటెగా చూస్తున్నట్టు..

ఘోషా సౌందర్యానికి
జవనాశ్వాల వేగాన్ని అద్ది..
రాజధాని నగరంలో
రయ్యన దూసుకు పోతున్నాయి
రెండు చక్రాల రథాలు

మేలిముసుగుల పరదాకి
కాలుష్యం .. మిష
మరి కారణాలు
వెనక్కిపోయే పొగలో కానరావు

విషయం ఏదైనా కానీ..
దాగి ఉన్నదెప్పుడూ
మేలిమి అందమేగా!!
అలా అనుకోవడంలోనే ఉంది
హమేషానిషా

ఇదే ఒకందుకు మంచిదేమో..
నా దుశ్శాసన మనసు కేవలం
ముసుగులోన ముఖాన్ని మాత్రమే
చూడాలని కోరుతుందిప్పుడు..

సిగ్నల్ దగ్గర ఒక పరదా పరిందా*
ఆగి ఆగకుండా.. చూపులు గుచ్చి
తుర్రుమన్నప్పుడు..
గుండె మెటికలు విరుచుకున్న చప్పుడు…..

RTS Perm Link

3 responses so far

3 Responses to “||నగు మోము గన లేని నా జాలిఁ దెలిసీ..||”

  1. VBon 18 Jun 2013 at 6:22 PM

    అంతర్జాలంలో పరిభ్రమిస్తున్నప్పుడు….మీదో మజీలి తప్పనిసరి చేశారుగా..అక్షరాల మాయలో పడేసి వెంటాడి…వేటాడి మరీ చదివిస్తున్నారుగా. చిలిపి ఊహల్ని తట్టిలేపే పాతరోజుల్ని గుర్తుచేస్తున్నారుగా…దాహం తీరని కవిత్వం..వాహ్..వా వాహ్..వా

  2. Yasaswion 19 Jun 2013 at 10:49 AM

    నిండైన మాటన్నారు. ఈ మాట ఎన్నో రోజులకి సరిపడా టానిక్. ohomyfriend!!

  3. రమon 03 Jul 2013 at 2:44 PM

    ముసుగేసుకునే అమ్మాయిలంతా మీపై జాలిపడేలా రాశారు.
    మీ అభివ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినదేమీ లేదు…..మీ కవిత మొత్తం చదవకుండానే మొత్తం చెప్పేస్తోంది టైటిల్. నాకు చాలా చాలా చాలా చాలా నచ్చిన పాటలోని పదం ఇది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa