Jun 11 2013

|| U bend..||

కొండవాలు దారి మలుపు లో
ఎదురెదురు ప్రయాణాల్లో
తలతిప్పి చూసా..

బ్రతుకు బండి బయటేకదా!
నీ చూపులు నన్ను..
చివరిసారిగా.. మెలేసాయి.

విడివిడిగానైతేనేం
ఒక్కదిక్కుకే
పోతున్నామనుకున్నా..

నువ్వు పైకి.. నేకిందకీ
అని గుర్తించేలోగా
కనుమరుగయ్యావు..

చేతుల్లో మిగిలిందల్లా..
గుప్పిట నిండిన..
గుండె సలపరమే

ఇక ఆలోచనంతా
తిరుగుప్రయాణం మీదే..
ఒక్క క్షణమైనా..మళ్ళీ కలుస్తామా!!

నే పైకి.. నువ్వు కిందకీ..
కంటిచూపులకందకుండా..
ఏమిటీ రాకపోకలు..

మలుపులే తప్ప
మజిలీలు లేవు..
తట్టుకోవడమెలా!!

ఎక్కడ ఆగాలో..
ఎంతకాలం ఇలా సాగాలో!
తెలిసేదెలా!!

==11.06.2013==

RTS Perm Link

2 responses so far

2 Responses to “|| U bend..||”

  1. sateeshon 12 Jun 2013 at 11:25 AM

    John Hyde Kanumuri: as Learning in Process …..ఒక ఫార్‌మేట్‌ను ఇంకో ఫార్‌మేట్‌లోకి మార్చడమెలా అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది.

    మీ కవిత చదవగానే అందులో ఉన్న ఒక లయ నన్ను Gazal ఇలా రాసేటట్టు చేసింది
    నచ్చుతుందని అనుకుంటాను U can check with your lines….
    —–

    http://telugugazal.blogspot.in/2013/06/blog-post_11.html

  2. VBon 18 Jun 2013 at 6:52 PM

    అక్షరాలు సంగమించి అర్ధాన్ని ప్రసవిస్తున్నాయి. మీ కవితల పల్లకిలో ప్రయాణిస్తుంటే మలుపులు ఎప్పుడొస్తున్నాయో..ఎలా వెళ్లిపోతున్నాయో అర్ధంకావడం లేదు. ఒక్కోసారి మనసు బరువెక్కుతోంది…మరోసారి తేలికపడుతోంది.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa