Mar 23 2013

||నమ్ముతావో నమ్మవో…||

నమ్ముతావో నమ్మవో నీ ముందు జరిగేది
నమ్ముతావో నమ్మవో నీవు చూసేవి
నమ్ముతావో నమ్మవో మండే సూరీడ్ని
నమ్ముతావో నమ్మవో రాత్రి తారల్ని

నమ్ముతావా ఎగిరే పిట్టల్ని
నమ్ముతావా కదిలే మేఘాల్ని
నమ్ముతావా గాలి కెరటాల్ని
నమ్ముతావా కాంతికిరణాల్ని

నమ్ముతావో నమ్మవో అన్న మాటల్ని
నమ్ముతావో నమ్మవో నీవు విన్న వాటిల్ని
నమ్ముతావో నమ్మవో చివరి వాక్యాల్ని
నమ్ముతావో నమ్మవో తిరిగే నాట్యాన్ని

నమ్ముతావా కాంతిని దృశ్యాన్ని
నమ్ముతావా వెలుగే కాలాన్ని
నమ్ముతావా స్పర్శ ని రుచిని
నమ్ముతావా అంతా.

నమ్ముతావో నమ్మవో అంతరాత్మని
నమ్ముతావో నమ్మవో సంతోషపు తన్మయత్వాన్ని
నమ్ముతావో నమ్మవో కీర్తిని పరంధాముడ్ని
నమ్ముతావో నమ్మవో ఆ ఆలోచనల్ని

నమ్ముతావా పైనున్న ఆకాశాన్ని
నమ్ముతావా ప్రేమ పాశాన్ని
నమ్ముతావా దివిని భువినీ
నమ్ముతావా చావుపుట్టుకల్ని
నమ్ముతావా జీవితాన్ని

నిజమైన నమ్మకం తో కళ్ళు తెరిచి చూడు
ద్వారాల్నీ తెరిచివుంచు కాంతిని నింపుకో
నమ్ము నమ్మకం నిను నిలబెడుతుంది

RTS Perm Link

3 responses so far

3 Responses to “||నమ్ముతావో నమ్మవో…||”

  1. మద్దిరాల శ్రీనివాసులుon 24 Mar 2013 at 6:26 AM

    సహజ సుందరముగ సాగించుచున్నారు
    కవిత సేద్యములను కమ్మగాను
    చిత్ర భావములను చిరు కవితలఁ కూర్చి
    అలర జేయుచుండె అధ్బుతముగ

  2. కనిష్టon 27 Mar 2013 at 7:55 PM

    నమ్ముతా నీ ఆలోచనా పరిధిని
    నమ్ముతా జీవితమే నమ్మకమని
    నమ్ముతా నువ్ కవివని
    నమ్ముతా కావ్య సాగరంలో నీవే గరమ్ అని

  3. రాంon 28 Mar 2013 at 12:51 PM

    నమ్మకానికే నమ్మకం కలిగిస్తూ ఎంతో నమ్మకంగా రాసిన ఈ కవితను మరింత నమ్మకంగా నమ్ముతున్నా అనే సంగతిని మీరూ నమ్మకంగా నమ్మాలి సుమా…….

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa