Archive for May, 2016

May 23 2016

యశస్వి|| బిడ్దలాంటి ఆమ్మ గురించి..||

Published by under my social views

251687_2263458708277_7916498_n

మా చిలకమ్మకు ఈ రోజు 64 ఏళ్ళు వచ్చాయని
ఉదయాన్నే పలుకరించి
ఏం చేస్తున్నావే పిల్లా! అంటే
రోజూ లానే తోట్లోకెళ్ళాను తండ్రీ!! అంది.

మట్టిని తడిపి మొక్కను తడిమే రైతుబిడ్డ మా చిలకమ్మ
ఆ చేతలకి జల ఎక్కువ, అంతకన్నా పచ్చదనం మక్కువ
జంటపక్షిని శతపోరి కట్టించుకున్న గూట్లో కుదురుగా కూర్చోక
మొక్కలకి పాలిస్తూ.. పళ్ళూ కాయలూ పండిస్తూ ఉంటుంది

చేతిలో పలుగు చిత్రంగా మాయలఫకీరు మంత్రదండమైనట్టు
ఒక్కోమొక్కా వందల కాయలు కాస్తుంది; వేలపూలు పూస్తుంది
పంచిపెట్టాలన్న కోరిక ఈ అమ్మకు తనకన్నా ముందే పుట్టింది

వృక్షాల్లా ఎదగమని పిల్లల్ని మొక్కల్లా పెంచింది
పొదుగులో ఒదిగినప్పుడే,
అక్షరాలు నేర్పక ముందే ధర్మాన్ని ఒప్పచెప్పింది

నేర్పిన పాఠాలు మర్చిపోమని మాటపుచ్చుకున్నాకే ఎగరనిచ్చింది
అమ్మని వదలలేక ఎదగడానికి వెనుకాడే ఈ బిడ్దని
పొడిచి మరీ ఎగరడం నేర్పింది

తనని అంటిపెట్టుకు ఉండమని ఏనాడు అడగని ఆ తల్లి..
కోరుకున్నది..తన పెంపకానికి మచ్చరాకుండా ఎదగమనే

నెర్రలుతీసే ఎండ నా నేలన పడకుండా
ఎదగని నాకు ఇప్పటికీ
పాదులు చేసి నారు పోసినట్టే నీరుపోస్తుంది

**
నా జీవిత చరిత్ర రాసుకోవాలంటే
నేను ఇక్కడ్నించే మొదలెట్టాలనుకుంటా

ఆ చిలకమ్మే..
పదేళ్ళ పాపగా అరవై ఏళ్ళ తండ్రికి
అన్నం వండి వడ్దించిన అమ్మ కధ లో
కడుపు నిండిన ఆ రైతు కళ్ళనూ నింపుకుని
చిన్న కూతురికి చేసిన దీవెన..
“నీ చిన్నకొడుకునై పుడతానమ్మా!”

అందుకేనేమో ఆ దీవెన వరమయినట్టు..
ఇంటికెళ్ళిన ప్రతి పట్టూ
నలభై వసంతాలు దాటిన బిడ్డకి ఇప్పటికీ,
మనసారా ముద్దల్నితినిపిస్తుంది

అమ్మలాంటి బిడ్దగా, బిడ్డలాంటీ అమ్మగా
నను నిత్యం తండ్రిని చేసుకుని మురుస్తుంది
=18.5.2016=

RTS Perm Link

No responses yet

May 16 2016

యశస్వి|| ఆ డాక్టరు బొమ్మకే.. ఈ లేఖ||

Published by under my social views

1_n

యువరాణిశ్రీ డాక్టరమ్మ గారికి … ( మూడు చుక్కలు)

ఇంతకాలం మబ్బుల్లో ఉన్న జాబిల్లిలా…
వంటగదిలో పాలు తాగే పిల్లిలా…
వేసవిలో విరిసే మల్లిలా…

చడీ చప్పుడు కాకుండా
వెన్నెల కురిసీ కురిపించక,
సంతోషాల పాలు ఉంచీ ఉంచక,
మోము చూపించక అక్షరాలతోనే అలరిస్తున్న మీరు…మా బొమ్మగారూ!!

ఇలా హటాత్తుగా
వేసవిలో పూసే మల్లిలా జాబిల్లిలో కనిపించే చెవుల పిల్లిలా
చుట్టూరా వెన్నెలకట్టుతో వర్షం రాకకై ఎదురుచూస్తున్న
ఏ భూసురుడి పాలిటో వరంలా
నిజరూపంతో ముందుకు రావడాన్ని
తీవ్రంగా ఖండిస్తున్నాను

గుట్టుగా నా రెండుమాటలకూ
మీ పసి మెరుపులను అద్దుదామనుకున్న ఒప్పందం..
కావేరీ నది కనికట్టు వరదల్లో కొట్టుకుపోయింది.

వికీపత్రాల మాదిరి నిప్పులాంటి నిజాలు
వెన్నెలలాంటి లావణ్యాలుగా బట్టబయలైనందుకు
ఒకింత బాధ కలిగింది…

మృదు భావాల కూనిరాగాలతో
కవ్వడిలా ఆంగ్లేయాంధ్ర కవనాన్ని
ఓ పువ్వు బొమ్మ వెనుక చిలుకుతున్నప్పుడు
ఆ లేరాతల సౌందర్యం…
ఈ జింకపిల్లని అక్షరాలలో చూపించినా
జనం గమనించకపోవడం ఎంతటి వైపరిత్యం!
అందుకు ఈ లోకాన్ని మన్నించాలి మీరు

నిత్యం పిల్లలతో, రోగాలతో
రోగాల పిల్లలతో, పిల్లరోగాలతో
కేరింతలతో, బాలింతలతో ఆసుపత్రి గదుల్లో వేగే మీలో

రాగాలతో కూడిన ఓ భావుకత ఉంటుందని
దానికవతల మీదైన సొంత జీవితముంటుందని
తెలిసీ తెలియక మీ రూపు చూసి
పెళ్ళి సంబంధాలను కదిపే పెద్దల(!) వరుసలో
నన్నూ కలిపేసుకుని ఈ అభ్యర్ధన పత్రాన్ని రాస్తున్నాను

మీరు మమ్మలని మళ్ళీ మన్నించాలి
అసలే అమ్మాయిలు కరువైన లోకంలో
మీరొక మలయసమీరంలా ఆనిపించారు
అసలు బొమ్మ చూపించేసి ఎంతపని చేశారు! 🙂

అబ్బాయిలంతా అమెరికాలకు ఎగిరిపోయి
“నాన్నా! నా పెళ్ళిక్కడో సీమదొరసానితో
అయిపోయిందని” ఎక్కడ చెబుతారో నని
తొందరపడి ఆ మల్లెపువ్వేదో
ఈ తోటలోదైతే చాలు అనుకునే
దేశభక్తులం మేం. ఇందులో మా స్వార్ధం లేశం

అయినా హరికౌస్తుభం లాంటి అమ్మాయి
నెట్టింట పరిచయమైనప్పుడు
నట్టింట తిరగాలని ఎవరు కోరుకోరు!

అందుకనే వేడుకుంటున్నా
నా పదకొండేళ్ళ పిల్లాడు పెళ్ళిడుకొచ్చేవరకూ
మిమ్మల్ని కాస్త ఆగమంటున్నా
ఎవరెన్ని సంబంధాలు తెచ్చినా మీకు వద్దంటున్నా

ఆడపిల్లలంటే అసలు పడనోడికి
రవీంద్ర నారాయణ్ లాంటి జులాయోడికి
వాడు వయోలెంట్ గా మారకుండా
మిమ్మల్నీ, పూలనీ కలిపి చూపిద్దామనుకుంటున్నా
మరి.. కొద్దికాలం..
ఓ పదేళ్ళు
ఓపిక పడతారా! డాక్టరమ్మా!!

= 14.5.2016=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa