Archive for April, 2016

Apr 28 2016

యశస్వి ||నిరతాన్నదాత్రి నిష్క్రమణరోజున..||

Published by under my social views

egnpex2015spc01

“…..ఎన్నోపాఠాలు చదివుంటాంరా…
పరీక్షలయ్యాక ఏదైనా గుర్తుందా!
ఎక్కాలు గుర్తుంచుకుని లెక్కలు మర్చిపోవడమే
పాఠాలు మరచి గుణపాఠాలు నేర్వడమే జీవితమంటే..”
వక్కాడించాడు బాల్య మిత్రుడు

నవ్వుకుని నేనన్నాను!
-నీకుందో లేదో జ్ఞాపకం
ఎనిమిదో క్లాసులో డొక్కా సీతమ్మ పాఠం
నే చచ్చినా మర్చిపోలేను..

ఆమె చనిపోయాకా ఇంటి పైకప్పు నుంచి
కాంతి పైకి పారడం ఇప్పటికీ
లంకగ్రామాల్లో చెప్పుకుంటారు..
ఈ రోజుకి ఆ సంఘటన జరిగి వందపైన తొమ్మిదేళ్ళూ..-

“ సినిమాటిక్” కొట్టిపడేశాడు వాడు

అప్పుడన్నాను…

*నువ్వెప్పుడన్నాఅన్నంపెట్టే పద్దతిని బట్టి ఓ ధనవంతుడు
ఒక్కపూట ఆకలితీర్చిన ఓ పేద పిల్లని పెళ్ళాడడం విన్నావా!

*ఆ జోగయ్య పంతులే తను వైద్యం చేసే ఊరి పశువులన్నిటినీ
నయమయ్యేదాక తన తోటనే మేపడం అబద్దమా!

*భర్తది మూగ జీవాల ఆకలితేర్చే మనసైనప్పుడు
ఆమె అన్నార్తుడి పట్ల అమ్మ కాలేదా!
బాటసారులంతా భోజనం అయ్యాక
ఆకళ్ళను తీర్చిన ఆప్యాయతకి చేతితోపాటు
కళ్ళనూ కడుక్కోవడం అబద్దమెలా అవుతుంది!!

*మారువేషాల్లో జమీందార్లు
అమ్మ వడ్దిస్తే తిని ఉవ్విళ్ళూరడం అబద్దమా!

*అప్పుచేసి అన్నం పెట్టిన రోజులున్నా..
అగ్రహారాలను ఈనాములుగా అందుకోవడం
తప్పనుకున్న దంపతుల కధ అబద్దమా !

*కడుపు నిండినోడి కబుర్లని కొట్టేయకుండా
ఆనోటా ఈ నోటా కోటలు దాటి బ్రిటిష్ రాజు
చెవినబడ్డందుకు చెలించి తన పట్టాభిషేకానికి
డిల్లీ రమ్మన్నా, ఇల్లు కదిలితే అన్నం పెట్టేదెవరని
తిరస్కరించిన సందర్భం అబద్దమా!

*ఆమె రూపాన్ని నిలువెత్తు కడిగించుకుని
ఆమె కూర్చోవాల్సిన స్థానంలో ఉంచాలన్న రాజు కోరిక
విశాఖ కలెక్టరు తీయించి పంపిన
ఛాయాచిత్రం అబద్దమ్మా!

*దర్బారు హాలులో బొమ్మనే గౌరవించుకోవడం అబద్దమా!
రానందుకు నొచ్చుకోక
పంపిన బంగారుపతకం, ప్రశంశాపత్రం అబద్దమా!

విశ్వస్త వడ్డింపగా ముద్దముట్టని శ్రీనాధులెందరో
ఈమె ఇంటిని అంటకాగిన రోజులెన్నో
ఈ అప్రజాత అక్కున జేర్చుకున్న ఆర్తులెందరో
ఈమెలో అమ్మల గన్నఅమ్మని కన్నారు;
అపర అన్నపూర్ణ అని అన్నారు

అన్నం పెట్టడమంటే ఓ ముద్దపాడేసి
మింగరా అనడమనుకున్నావా!
బిడ్ద కడుపు చూసి తల్లి పాలిచ్చినట్టు
ఎండనబడి వచ్చినొడికి అంబలి తాగించినట్టు

అంత్యకాలంలో కాశీ వెళ్ళే సంకల్పంతో
బండి కట్టించుకుని బయల్దేరిందంట సీతమ్మ

ఆరాత్రి ఆగిన సత్రంలో వినపడ్డ మాటలు
డబ్బుల్లేక అర్ధాకలితో ఓ కుటుంబం
మరునాటి దాకా వోర్చుకోమని
సీతమ్మ ఇంట కడుపార తిందామని
పిల్లాపాపలకి సర్దిచెప్పుకుంటుంటే

కాశీ వెళ్ళాల్సిన సీతమ్మ బండి రాత్రికిరాత్రే వెనక్కుమళ్ళింది
అతిధులు వచ్చేలోగా ఇంటికెళ్ళి వండివార్చిన అమ్మ
యాత్ర లో తనువు చాలించడం కన్నా
ఆకలికడుపుకు అక్షయపాత్ర కావాలనుకున్న అమ్మ

పైవన్నీ మనం చూడని కళ్ళన
లోకం నిజాలుగా నమ్ముతున్నప్పుడు..

కులం మతం అడక్కుండా కడుపు నింపినమ్మ
కోనసీమ అన్నపూర్ణమ్మ
అతిధిని దేవుడ్ని చేసి అన్నాన్ని ప్రసాదం చేసినమ్మ
మా మర్యాదలమూలపుటమ్మ
డొక్కా సీతమ్మ..

ఆ ఆమ్మ..
కాలం చెల్లి; ఆ తల్లి కాంతిగా మారిందంటే
ఆ నిజం నీళ్ళునిండిన కంటికే తప్ప
తర్కానికి అందదురా అన్నా.

అన్నం తినే వాడెవడన్నా
నామాట కాదంటాడా!

=28.4.2016=
(ఈరోజు డొక్కా సీతమ్మ గారి 109 వ వర్ధంతి)

ఉదయం అన్నయ్య Pydikondala Manikyalarao​ update చూసి
ఎంత రాజకీయనాయకుడైనా అన్నం పెట్టే చెయ్యేకదా! గుర్తుంచుకున్నందుకూ, గుర్తుచేసినందుకూ.. ప్రేమతో..

RTS Perm Link

One response so far

Apr 26 2016

యశస్వి|| పులిపిల్లతో.. ప్రో కబడ్డీ||

Published by under my social views

1935219_10208603733873121_621756783200197120_n

పులిపిల్లని పెరట్లో పెంచుతున్నట్టుంది నా పని;
నిండా పన్నెండు లేవు బిడ్డకి
గుండెలమీద ఆడుకునే దశ దాటిపోయాక
ఈ లోకంలో నా భయాల్ని ఎలా చూపాలి!

ఏ రోహిత్ శర్మో నిన్ను ఆవహించినంత మాత్రాన
ఈ మండుటెండల్లో ఏ శిక్షణా శిబిరానికి పంపను !
దశరధుడి ప్రేమ టన్నుల లెక్కన ఉన్నా
ఏవిశ్వా’మిత్రుడో వచ్చి నిను పట్టుకుపోతాడని బెంగైతే లేదు..

తోడు పంపుదామంటే తమ్ముళ్ళెవరూ లేరు
సొంత దర్బారు జీవితానికి నేను నోచుకోలేదు
ఏ కైక కోరిక రాముడే కోరినట్టు
నువ్వడిగినంత మాత్రాన కోచింగ్ కి ఎట్లా పంపను

అమ్మా, పిన్నీమన ప్లాను విన్నారా
ఈ రామాయణాన్ని భాగవతం చేస్తారు
మా చిన్ని కృష్ణుడ్నిఎండలపాలు చేస్తావా అంటూ
నన్ను జంటగా ఇంటి మడుగులో ముంచేస్తారు
అప్పుడు ఏ విష్ణుముర్తి నన్ను రక్షిస్తాడు?

పరిగెడితే పాదాలు కందుతాయనుకున్న కాలం
నిన్నో మొన్నో గడిచినట్టే ఉంది
రబ్బరు బంతీ చెక్కబ్యాటు రోజులు
అట్లెట్టా గడిచిపోయాయి!

ఐపీఎల్ సీజన్లు చిన్నతెరకి ఎక్కి
నీకింత కిక్కెక్కిస్తున్నాయని
నాకు ఆలస్యంగా నైనా ఎరుకలోకి వచ్చింది
ఇప్పుడో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి

పద గుండెల్ని గోదా చేసి
ప్రస్తుతానికి ప్రో కబడ్డి ఆదుకుందాం దా.
ఒరే ఉంగా.. ఉంగా
లే పంగా !
=25.4.2016=

RTS Perm Link

No responses yet

Apr 26 2016

యశస్వి || ఆ నోటిమాట..||

Published by under my social views

13000173_10208846052930946_5925070870646725054_n

పుష్కరం కిందట ఆ గోదారిగట్టునే
నాతోకలిసి పరిగెలు ఏరుకున్న తోటి పక్షి
ఈ ఉదయాన్నే వలసపోయిన దేశాంతరాల నుంచి
వాట్స్ యాప్ లో జంటగా పలకరించింది

“బావా చల్లగా ఉన్నావా!
నీ పెళ్ళిరోజు నీకు నిన్నైపోయినా
మాకు ఇంకా తేదీమారనందున
నిన్నిలా పలకరిస్తున్నా” అంది

నన్ను అన్నను చేసుకున్న ఆ ఇంటి లక్ష్మి
అల్లుడికి ఆశ్శీస్సులు; వదినకి ఆప్యాయతా
అందించమని చెప్పి; పెనిమిటికే ఫోన్ అప్పజెప్పి
మా మాటల మధ్యనుంచి తప్పుకుంది

ఎవరు ఎవరికి ఏమవుతారో అడిగించుకోకుండా
మా గురించి పిల్లలకి వీలైనప్పుడు చెప్పాలి

వరదగాలుల రోజుల్లో
ఒకరికొకరం చెల్లాచెదురవ్వకుండా
ఒకరిగుండెలో మరొకరం మారుగూడు కట్టుకుని
బ్రతికినకాలంలో మేం ఒక్కటిగా ఉన్నామని

నేను ఏటికి ఎదురీదుతున్నప్పుడు
ఒడ్డునపడాలని తపించిన ఆ జంట
నాకై కన్నీటి రాత్రుల్ని కన్న ఆ జంట
అందరితో మనసారా చెప్పేమాట..

నాతోటకొచ్చి అమ్మదీవెనలు అందుకున్నాకే
కడుపుపంటని పండించుకున్నామని
ఇప్పుడింతకాలం గడిచాక
బావపక్షి మాటల్లో ఏం చెప్పడంటే!.

“పుస్తకాలు చదవడం,
చెస్ ఆడడం మర్చిపోయినా
నీనుంచి దూరంగా వెళ్ళిపోయినా
మందుకొట్టడం మానక
అప్పుడప్పుడు పరిగెడుతున్నా
ఓ గూడు కట్టుకున్నాక, మా జంట
తోడుకి తోడుని కనిపెట్టుకున్నాక
అమ్మ నాతో అన్న మాట గుర్తుపెట్టుకున్నా

“తోట భలే పెంచారమ్మా
ఇంత ఓపిక ఎలా వస్తుంది మీకూ!” అంటే
“పిల్లలెదిగిపోయారుగా
ఇక మొక్కల్నే పెంచాలి కదా” అంది అమ్మ

ఆ మాట పట్టుకునే
పరాయిదేశంలోనూ
పట్టుబట్టి ఇంటిచుట్టూ
మొక్కలు పెంచుతున్నా” అన్నాడు

అమ్మమాటకు పట్టంగట్టాడని
ఓ పక్కఆనందంగా ఉన్నా,..
ఎంతమాట అనేసింది అమ్మ!!
నిజంగా నేనెదిగానా? అనుకున్నా.
=23.4.2016=
with love Samavedam Sastry & Lakshmi Samavedam

RTS Perm Link

No responses yet

Apr 25 2016

యశస్వి ||చూపులు కలవని వేళల్లో||

Published by under my social views

IMG_20150717_164151

ఒక్కొక్కసారి అంతే
కళ్ళల్లోకి చూడలేం; చూడబడం
కారణాలు ఇదమిత్థంగా తెలియవ్
ఒక్కొక్కసారి అంతే

చూపులు మెచ్చిన అమ్మాయి చూపుల్ని
పద్దతైన పెంపకాలు కిందకి దింపేసినప్పుడు
ఎదురుచూసే కుర్రమనసుకి ఉసూరుమనిపిస్తుంది
అవే చూపులు తడబడి తడిమినప్పుడు
గుండె తీగెలో అనురాగం పెల్లుబికి వీణల్ని మీటుతుంది

అవసరానికి అప్పుచేసి ఇవ్వలేనప్పుడో
తెలిసో తెలియకో తప్పుచేసి దొరికినప్పుడో
అవతలి వైపుచూడడం అంటే
గగనంలో సూర్యుడ్ని చూడడమే కదా!

పక్కన ఉన్నవారెవరైనా కనిపెడితే
గ్రహణం పట్టినట్టే
గడ్డం బయటినుంచే గొంతుకని అతుక్కుపోతుంది
తలదాచుకోవడానికి చూపు మరో చీకటిని వెతుక్కుంటుంది

చూపులు ఎప్పుడూ కిందకే వేలాడవు
ఆలోచనల లోతుల్నిండా గాయాలు నిండినప్పుడు
ఊరడించే గాలులకోసం
ఆ చూపులే నిశ్శబ్దంగా గగన విహారం చేస్తాయి
ఆ ప్రయాణంలో..
గాయం బాధని బట్టి దూరం;
దొరికే సమాధానాన్ని బట్టి వెనక్కు వచ్చే కాలం..నిర్ధారింపబడి ఉంటాయి

లేదా మరో అత్మీయ స్పర్శ ఏదో మాయ చేసి
ఆ చూపుని మళ్ళించాల్సి ఉంటుంది

ఒక చూపు మరో చూపుని వెతకడం
ఆదిమకాలం నుంచి అమలౌతున్నదే
కొన్ని చూపులు ..
పైకి పలుకరిస్తున్నట్టే ఉంటాయి కానీ
వాటి అంతరంగాల్ని కనుక్కోవడం కష్టం
కొన్ని చూపులు..
దారి దివ్వెలాంటి మరో లోకాన్ని
ఈ లోకంలో వెతుకుతూనే ఉంటాయి
కొన్ని చూపులు..
తనని కలుపుకుని వెళ్ళే కాలం కోసం
లోపలి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి

ఒక చూపు మరలితే మరణం
ఒకచూపు తరలితే జీవనం

ఈ లోకంలో మనగలగాలంటే
మన చూపు ఒక కొసన్నా మనతోనే ఉండాలి
గోడక్కొట్టిన బంతిలా వెనక్కి రాగలగాలి
శూన్యానికో, సౌందర్యానికో చూపుని పారేసుకోవడం కన్న
పుస్తకాలలో అక్షరాలకి వేలాడదీసుకోవడం మిన్న
అప్పుడు ఆ చూపులే కాలాతీతంగా ప్రవహిస్తాయి
మనల్ని మనలోపలికి ప్రయాణం చేయనిస్తాయి

ఏ చూపులైతే మననీడల్ని ఎక్కువ చేసి చూపుతాయో
ఆ చూపుల్ని తుడిచేసుకుని నడిచిపోవడం మంచిది
ఏ చూపులైతే మనలోపలికి బయటకి ప్రయాణిస్తాయో
ఆ చూపుల్ని మనలో నింపుకుని దీపమై వెలిగిపోవడం మంచిది

అప్పుడు..
జీవితం అతిశీతల దృవాగ్రాన మనిషిని నిలబెట్టినా
సూర్యకాంతి ప్రతిఫలనాలను కన్నులు తెరిచి ఉంచినంతకాలం
మైమరచి చూస్తూనే ఉండిపోగలం
లేదా..చూపులు కలవని వేళల్లో
వాసనల్ని వెత్తుక్కుంటున్న కస్తూరీ మృగమై
గమ్యం దొరకని దారుల్లో ఇరుక్కుపోగలం
=19.4.2016=

RTS Perm Link

No responses yet

Apr 18 2016

యశస్వి ||పురసెయ్య పురాణం||

Published by under my social views

_83718810_easterngreykangaroo

cool-quote-left-handed-activist-Ferroni
ఒబామా, మోడీ,అమితాబ్, సచిన్
ప్రఖ్యాతులతో ఓ పోలిక గొప్పేం కాదు గానీ
ఆ సెయ్యి అలవాటు పుట్టినకాడ్నుంచీ ఇబ్బంది పెట్టేస్తోంది

ఎలా పుడుతుందో ఎడమ అలవాటు
జనం మనల్ని వేలెత్తి చూపడానికి
మార్చుకునే వరకూ వెంటపడడానికి

మంచీ చెడూ అని కలిసిపుట్టిన వాటిని విడదీసి
తెలిసీ తెలియని విషయాల్ని కలగలిపి
కుడి మంచి ఎడమ చెడు అని ఇట్టే నమ్మిస్తారు
దాన్ని బట్టే మనల్ని ఓ గాడిన కట్టేస్తారు

పురసెయ్యోడి తలసరి ఆదాయం
సదరు కుడిసేతోడు కన్నా తక్కువే అని సర్వేలు తేల్చేసి నప్పుడు
కుడిచేత్తో కొబ్బరికాయను కొట్టలేనితనానికి
గుళ్ళో రాతిగుండె నాపై పగబట్టినట్టనిపించింది

పనీపాటా అన్నీ ఉన్నా
పనిగట్టుకుని తట్టుకోలేకే
ఇలా మొరపెట్టుకుంటున్నా;

పడ్డోడి బాధ పక్కోడికి
ఏడుపులెక్కనన్నా తెలవాలి కదా
నాకు తెలుసు మీకిది ఓ నవ్వులాట..

చిన్నప్పుడెప్పటి మాటో..
తినేటప్పుడో, రాసేటప్పుడో
ముందుకెళ్ళేది ఎడమసెయ్యే
టపీమని తగిలేసేది ఓ దెబ్బ దానిమీద

వెనకనే.. ఏరా తేడా తెలియట్లేదా అన్న మాట..
వివక్ష ఊళ్ళోనే కాదు వంట్లోనూ ఉంటుందని
నా కప్పుడే తెలిసొచ్చిందన్నమాట.

రాయడం కుడితోనే ఏదోలా నేర్చినా
నా గుండె ఎడమవైపే ఉండిపొయినందున
ఆ మారిన అలవాటు చెప్పుకోలేని బాధ

కాళ్ళపని చేతులు చెయ్యవు సరే
కుడికి ఇచ్చిన విలువ ఎడమకి ఎందుకివ్వరో అనిపించేది
ఒకటి ముందుకి మరొకటి వెనక్కీ
వాడే అలవాటుకి ఆద్యంతాలు ఎక్కడో

నా దేహమే దేశమైనట్టు..
లోపల మొలకెత్తే ఆలోచనలనూ
నాలోని అసమానతలను రోజూ గమనిస్తున్నాను

కుడి ఎడమైతే పొరపాటు లేదన్న
కబుర్లలోతుతెలియదు కానీ
ఎవడిపని వాడు చెయ్యాలని చెప్పడంలో
శాస్త్రం కన్నా ఝాంకారమే ఎక్కువ కనిపించేది

కుడికాలుని ముందుపెట్టాలంటే
ఎడమపై నిల్చోవాల్సి రావడం ఎంత నిజమో
కుడి చేయి కడగడానికి ఎడమ అంతే అవసరం కదా

అప్పుడప్పుడు తనే నిజమని, సహజమని
ఎడమచేతికి చెప్పాలనిపిస్తుంటుంది
అలా ప్రయత్నించినప్పుడల్లా
కుడి చేయి దాని గొంతుని గుప్పెట్లో మూసేసి
కిందకు లాగేసేది
తలతో పాటు అదీ వాలిపోయేది

నాది కాకపోతే గోదారి దాకా అని చూపించే
పక్షపాతానికి నా ఎడమ ఎప్పుడో బలైపోయింది
సహజసిద్దమైన అలవాటుని పొరపాటు అన్నప్పుడే
నాకీలోకం ఎప్పటికీ తల్లకిందులే అని తేలిపోయింది

నా మనసు మాటను పాటించలేక
మాటలతో పొడిపించుకోలేక
కొన్ని అలా కొన్ని ఇలా అని
రెండిటితో సరిపెట్టుకుపోతున్నా

మారిన అలవాట్లలో
నేనే చేతి వాటమో నాకే అర్థంగాక
తికమకపడుతున్నా
తిండీ తిప్పలను కుడికి అప్పగించి
అవసరానికి ఏది కుదిరితే అదే వాడుతున్నా

రాసే పనిని ఓ చేతికి గుత్తంగా అప్పగించేసి
మిగతావాటన్నిటికీ మరోచేయి వాడలనిపిస్తుంది
ఇంకానయం! దేవుడు ఒక్కనోరే పెట్టాడు!!
తిన్న తరువాత చాల సమయానికి
అరిగే అలవాటుని భలే కనిపెట్టాడు!!

కడుక్కోవడం ఎప్పటికప్పుడు
రెంటికీ అవసరమైనప్పుడు
ఈ ఎక్కువ తక్కువలు ఎందుకో!

ఎప్పుడైనా ఏ గొంతైనా
నన్నెవ్వరూ పట్టించుకోవడంలేదన్న అరుపు
వినపడినప్పుడల్లా
వాడెంత అదృష్టవంతుడో అని బుగ్గలు నొక్కుకుంటున్నా

కసిగా పట్టించుకుని
నువ్విలా ఉండూ నేనిలా ఉంటాను అనుకునే కన్నా
ఎవడిమానాన వాడ్ని బతకనివ్వడం మిన్నఅని
జీవితానుభవంతో తెలుసుకుంటున్నా

=18.4.2016=

RTS Perm Link

No responses yet

Apr 11 2016

యశస్వి ||దుర్ముఖీ@ ఎఫ్బీడాట్ కామ్||

Published by under my social views

th

మై డియర్ ఉగాదీ!!

నీకు ఆహ్వాన పత్రిక ను రాసి
ఆదరంగా పండక్కి పిలవమని
అమ్మ నాకు ఫోన్లో చెప్పింది

మొక్కుబడిగా వచ్చేదే కదా
అందంగా కనిపిస్తేనే పండగ అనుకుంటాం
ముఖం బాగా లేనిదంట
ఎందుకులే అమ్మా! అన్నా!

సంప్రదాయాన్ని వదలొద్దని,
వదరుమాటలు పలకొద్దని
ఆచూకీ దొరక్కపోతే
ఫేస్ బుక్ లో స్టేటన్ అప్ డేటైనాపెట్టమంది..

రేపటి నీపేరుమీద ముందటేడులానే టాగ్ చేశా
నేను ఆఫ్ లైన్ లో ఉన్నప్పుడైనా ఓ చూపు చూస్తావన్న ఆశ
టెక్నాలజీ మారినా తీరు మారదుగా
అందుకే నీకీ ఫోస్ట్ పెడుతున్నా

నువ్వు చదివినట్టు ఓ లైక్ కొట్టు..
ఉన్న ఎమోటికాన్ గుర్తుల్లో నీ కనిపించిందే నొక్కు.
ఇప్పుడు ఇక మా జీవితాల్లో షడ్రుచుల స్థానే ఉన్నవి
లైక్, లవ్ ,హాహా వావ్, సేడ్, యాంగ్రీ ఆ ఆరేగా
వాటి సాయంతోనే నిన్ను ఈనాడూ తలుస్తున్నా

రాక్షసలో పుట్టినోడ్ని; సిద్దార్ధలో బడికెళ్ళినోడ్ని
ప్రభవ విభవల్లో వసంతం వచ్చేదారిని కనుకున్నవాడ్ని
యువ నుంచి కవిత్వమై నీకై కాగితాలపై తరించిన వాడ్ని..

నీపై ఎన్నెన్ని కవితలల్లానో
ఎన్ని సమ్మేళనాల్లో తపించానో
నా ప్రేమని ఎప్పుడన్నా గుర్తించావా!

నువ్వు నా జతలేవని అనుకున్న కాలంలో
ఎండమావుల కై పరిగెట్టానని అలిగినట్టున్నావ్..
ఆ మాత్రం ఎడబాటు లేకపోతే
జీవితంలో ఎలా నిలబడగలననుకున్నావ్!!

వద్దన్నా వసంతసేనని పట్టుకుని వేలాడడానికి
శకారుడ్ననుకున్నావా!
వలచి వస్తే చారుదత్తుడిలా ఆదరిస్తాను

రెచ్చగొట్టిన సందర్భాల్లో
మన్మధుడి అసలు రూపాన్ని ఎప్పుడో కనిపెట్టాను.

దేశద్రోహం నేరం మోపినా
నిన్ను ప్రేమించాననే చెబుతాను తప్ప
తల్లిని చేసి జైకొట్టలేను

ఆమోదించినా లేకున్నా
నా తమ్ముళ్ళ మాట్లాడే హక్కును పోగొట్టలేను
చెల్లెళ్ళ స్మృతిలో కొవ్వొత్తులు వెలిగించలేను

దుర్ముఖీ! నా ప్రియురాలా!!
ఆకలి లా నైరూప్యం అనుకోలేదు నిన్ను
అరుణిమలా శ్వేతకాంతిగానే ఊహిస్తున్నా
నిన్ను ఇంకా చుడని కళ్ళన..
జీవిత పట్టకంలోంచి నీ ప్రొఫైల్ బొమ్మ ను తేరిపార చూస్తున్నా

నువ్వు..
జైలుకెళ్ళని సల్మాన్ ఖాన్ లానో
విడుదలైన సంజయ్ దత్ లానో
పిడికిలి బిగించిన కన్నయలానో
ఎన్నికల సభల్లో చాయ్ వాలాగానో
కుర్చీలాటలో కబుర్లు చెప్పే చంద్రుళ్ళగానో
పోటెత్తిన విరాట్ కోహ్లీగానో
వగలుపోతున్న సన్నీలియోన్లానో కాక

వానతడిగానో, పచ్చని నారుమడిగానో
సామాన్యుడి నాడిగానో, బడిపిల్లోడిగానో
ఎప్పుడు కనిపిస్తావ్!
ప్రశాంతతను ఎలాప్రసాదిస్తావ్!!

నీపేరున్న టైం లైన్ లోకి తొంగిచూస్తున్నా
నాలానే సాటి మనుషుల్లానే
అనాదిగా దిగాలుగా ఉన్నావ్
నువ్వు పంచే మంచిని ఎంచలేక
మేమంతా దుర్ముఖాలతోనే ఉన్నాం

ఇన్బాక్సులోకి వచ్చేబదులు
ఓపిగ్గా ఉన్నావోలేదో ఒకసారి
ఇంటికి వచ్చేయరాదూ..
పచ్చడి తింటూతీరిగ్గా మాట్లాడుకుందాం!!

=07.04.21016=
ఉగాది శుభాకాంక్షలతో..

*సూద్రకుని మృచ్ఛకటికం సంస్కృత నాటకంలో పాత్రలు వసంతసేన, చారుదత్తుడు. శకారుడు..
1984 హిందీ సినిమా ఉత్సవ్.. చూస్తే అర్థమౌతుంది.. లేదా వికీలో.. అంతర్జాలంలో ..అవగాహనకు చాలినంత సమాచారం లభ్యం.

RTS Perm Link

No responses yet

Apr 02 2016

యశస్వి ||రెండో నెంబరువాడి రెండో ప్రేమకధ||నిజంగా.. నిజం

Published by under my social views

Brick wall

ఏందుకనో రెండుకు.. నేనంటే మక్కువ
నాకూ రెండు మీదే మనసెక్కువ

అన్నదమ్ములు నాన్నకు ఇద్దరు
నేను మరి రెండోవాడి ..రెండోవాడ్ని
అందరికీ ఇద్దరేసి లింగళ్ళే
అన్నకూ నాకూ పెదనాన్న చిన్నాన్నల వల్ల
ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అన్నలు..
అమ్మ తరఫు ఏ పెద్దమ్మ వల్లనైనా నాకు ఉన్నది
ఇద్దరిద్దరు అక్కలు

అన్న వల్ల ఇంటికి వెలుగొచ్చింది
భాను కిరణాల్ని తట్టుకోవడానికి,
వెన్నెల కురిపించే పని పెట్టుకోవడానికి
రెండుగా నా అవసరమొచ్చింది
నన్ను చూడడానికి అందరూ
మా ఇంటికి రెండోసారి వచ్చేవారు

అన్నయ్యకూ నాకూ కలిపి
అవి ఏవైనా సరే!; రెండు – రెండు తెచ్చేవారు
పండగలకి ఒకేరకం రెండు జతలు
బట్టలు బిగుతైనప్పుడల్లా సిద్దంగా ఉండేది
అదే తానుముక్కలోని అన్నకు కుట్టించిన చొక్కా
నా నిక్కర్లకు బదులుగా వాడి పాంట్లను తొడిగేవాడ్ని

అదేంటో చోద్యం!!
ఒకటి నుంచి పది దాక
రెండు తక్కువ పది ఊళ్ళల్లో చదివా
ఊరూ, క్లాసూ మారినన్నిసార్లూ
అరమార్కు తేడా ఉన్నా, ఆరుమార్కులున్నా
ఏ రెండుసార్లో తప్ప రెండోవాడిగానే ఉన్నా

ఎందుకిలా జరిగేదో తలపట్టుకు కూర్చున్నా
తెలిసేది కాదు అమ్మకూ- నాన్నకు
నే ఇంట్లో చదివేవాడ్ని కాదంటే బళ్ళో నమ్మరు
క్లాసు బయట అల్లరిని చూస్తే ఏ పంతులమ్మా నన్ను నేనని నమ్మదు

నే చెప్పినదెంత నవ్వులాటగా ఉన్నా
నేను పుట్టిన ఒకటో తేదీమీదొట్టు
ఎప్పట్నించో రెండుగానే బతుకుతున్నా
ఎక్కడో పోగొట్టుకున్న నన్ను అక్షరాలలో వెతుక్కుంటున్నా

పెళ్లయిన సంవత్సరానికి..
అదే తారీకున పుట్టినోడు.
ఏ దివ్యలోకాలనుంచో
రెండు రెళ్ళని పక్కపక్కన పెట్టుకుని
ఈనెలే 22 న ఊడిపడ్డోడు…
వాడు నేను కన్నోడు; ఓరోజు నన్నడిగాడు

మరి “నన్నొక్కడ్నే ఎందుకు కన్నావని?”
వాడితో అన్నాన్నేను.. ఒక్కొక్కటిగా ఉన్నవి
నువ్వూ- అమ్మా నా జీవితంలో రెండే ఉండాలని
నీతో కలిపి నా కవిత్వం నే కన్న కలలని.. నాకు పుట్టిన బిడ్డలని

ఈ రెండే నా జీవితమంతా నిండాలని
మీ నీడనే నా శేష జీవితం పండాలని

రెండక్షరాల తడి జీవితమంతా
పరుచుకున్నప్పుడు
13456789ల్లా కాకుండా
2 లా మీకు మరోమారులా
గుండెల్లో నిండా కూర్చుండాలని..

నా రెండో పుస్తకం రెండోభాగంరెండు మాటలు రాస్తున్నా…
రెండు చేతులతో దీవించండి.

=1.4.16=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa