Archive for May, 2014

May 03 2014

|| పిల్లలు..||

Published by under my social views

111

జీవితాల్లోకి వస్తారు..
చూడని లోతుల్లో ఈదిస్తారు
శిఖరాలు ఎక్కిస్తారు

కొత్తదారుల్ని తొక్కిస్తారు
నవ్వేసి మత్తెక్కిస్తారు
చుట్టేసి పులకరింతలకు గురిచేస్తారు

ఏడ్చి బాధ పంచేస్తారు
పట్టుదల అవసరం అవగతం చేస్తారు
బాధలు మరిచే మందిస్తారు

మాటతప్పకుండా మనల్ని సరిచేస్తారు
ఏదైనా కొనిపెట్టమని మారాం చేస్తారు
మతిమరుపు జీవితాలలో ఆనందాలకు పీటవేస్తారు

ఉత్సాహానికి రూపమౌతారు
ఉల్లాసానికి విలాసమౌతారు
అలిసి నిద్దరోయేవేళ నిశ్చింతకు నిలయమౌతారు

మనమీద మనకే ప్రేమ కలిగేలా
జీవితాన్నిస్తారు
వారిగుప్పెట్ల్లో మన ఆనందాలుంచి
ఊరిస్తారు

గూడు చేరమని కబురందిస్తారు
తోవ చూపిస్తారు
ఎలాగోలా…ఆవలితీరానికి చేరుస్తారు
=5.2.14=

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa