Archive for February, 2014

Feb 10 2014

ఒక్కమాట.. కవిసంగమం కవుల కవితత్వాల పరిచయం.. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వార్త; ఈనాడు ఆదివారం పత్రికల్లో

Published by under my social views

ఒక్కమాట 150 మంది కవిసంగమం కవుల ‘కవితత్వాలు’పుస్తకం పై అభిప్రాయం: రామ్మూర్తి మాస్టారు అన్నారిలా!!

ప్రతిభా ప్రభలు

ఇది ఒక వినూత్న ప్రయత్నం. కవనాసవాన్ని ఆస్వాదించడానికి పాత్ర ఏదైతేనేం అనుకోకూడదు. దేని ప్రాముఖ్యం దానిదే. మంద్రస్థాయిలో నేపధ్యసంగీతం, చిరువెలుగులు, బంతిలో బంధుమిత్రగణం, చూడగానే అందుకోవాలనిపించే వన్నెచిన్నెలతో పారదర్శకంగా కులికే కలశం… వీటి ప్రభావం కవితామధుపానలోలునిపై తప్పకుండా ఉంటుంది. తలచుకుంటే ఆ మజాయే వేరు! బ్రహ్మానంద సద్భ్రహ్మచారికి బెత్తెడు దూరంలో ఉంటాం. ఇదంతా సాధ్యమయ్యింది వాస్తవంలో ‘యశశ్వికి’, శతాధిక రుచులతో ‘ఒక్కమాటతో’ విందు ఏర్పాటు చెయ్యడం.
తనను అలరించే కవుల పలుకులతోనే వారి వారి అభివ్యక్తి రవళులను గుబాళింపజేయడం అందరికీ చేతకాదు. అదో అవ్యక్త ప్రతిభోదయ ప్రభ. అది యశశ్వికే చెల్లుతుంది.
కవనకాంతామణి వివిధ కవుల రూపాలు ఆపాదించుకొని, పదాలు కదుపుతూ, కావ్యగానం చేయడం దర్శనీయం, శ్రావ్యం, కమనీయం… ‘ఒక్కమాట’లో మనోహరం.
మనసుపెట్టి అక్షరాలకు కన్నులప్పజెప్పి ముందుకు సాగితే పైన చెప్పుకున్న మాటలన్నీ అక్షర సత్యాలని కవితాప్రియులు తెలుసుకుంటారు.
యశశ్వి చెప్పినట్టు ‘తెల్లకాగితం’లో చెప్పిన మాటలు మర్చిపోకూడదు.’ ముందుకు సాగాలి.

My published reviews: Jyothi, Namaste telanganaa on 19.1.2014, Vartha 2.2.2014 @ looking forward for Eenadu on 9.2.2014 (will be)

24639_10202823243404472_738321101_n

923049_10202823244404497_2127070589_n

1618668_10202938366042466_1922931288_n

eenadu sameeksksha okkamaata

RTS Perm Link

No responses yet

Feb 05 2014

ఒక్కమాట .. కవితత్వాలు

Published by under my social views

okkamaata cover FINAL 2

నా మలి పుస్తకం వెనుక కథ ఇది..

https://www.facebook.com/groups/kavisangamam/permalink/557973020922121/

|| ఒక్కమాట.. అన్నం మెతుకు లా …||

కవిసంగమం కవుల్లో చాలమంది ఇప్పటికే.. తమకొక ముద్రను ఏర్పరచుకున్నారు..
కవిత్వం ద్వారా సమాజంపట్ల వారి అవగాహనే కాకుండా వారేం కోరుతున్నారో కూడా తెలియబరుస్తున్నారు

కవిత్వం ద్వారా తమ వ్యక్తిత్వానికి రూపాన్ని సంపాదించుకున్నారు..కుంటున్నారు.
ఇదొక సేహమయ వారధి.

మనకు నచ్చిన రాతల నుంచే వారి మూర్తిమత్వాన్ని దర్శించడం.. ఒక స్నేహానుభూతి..
అలాంటి ప్రయత్నమే.. ఒకటి చేస్తే ఎలా ఉంటుందనిపించింది..
ఇలాఉంటుందే్మో…

నేను నాకు తెలిసిన కొందరు మిత్రులను నిర్వచించే సాహసం చేసాను..
మీకూ బాగుందనిపిస్తే.. ఈ పరంపరను కొనసాగించమని ఆహ్వానిస్తున్నాను..
అవి మనమాటలే.. కానక్కరలేదు..వారి కవిత్వంలోంచి వారిని చూపిస్తే.. చాలదా..
తమ కవితలతొ అలరించే వారికి ఇంతకన్నా మంచి బహుమతి తిరిగి వారికేమివ్వగలం!!

ఎంతో మందిని అలరించి ఆనందించిన ఈ పుస్తకం pdf..
https://www.facebook.com/groups/kavisangamam/575006425885447/ ఇక్కడ..

ఇందుకే.. ఈ విరామం.

పుస్తకం కావలిస్తే.. నేను మీరిచ్చే address కు vpp ద్వారా అందజేయగలను.

RTS Perm Link

2 responses so far

RTSMirror Powered by JalleDa