Archive for February, 2013

Feb 05 2013

నా కొత్త గీతలు జనవరి 31

Published by under my social views

జనతంత్ర మోర్చా ఇదేదో కొత్తపేరులా ఉందే..
జార్ఖండ్ ముక్తి మోర్చా – గూర్ఖా జనముక్తి మోర్చా
బిజెపి మోర్చా ,కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, బేషర్మీ మోర్చా
మైనార్టీ మోర్చ , అంగన్‌వాడీ ఫెడరేషన్ల సంయుక్త మోర్చా
ఇన్ని నలిగిన పేర్లుల మధ్య దీని స్వచ్చతను ఎలా గుర్తించడం!! ఏల గుర్తించడం!!
ఇది నాలోనూ తొంగిచూసే ప్రశ్నే..
నమ్మక చెడిపోడం కన్నా నమ్మి నడవడం మిన్న..
అన్నా!.. అగ్గిపుల్ల వెలిగించడం నీకు తెలుసు..
కార్చిచ్చులా అల్లుకోవడం మాకు తెలుసు..
మరి మా అలుసేమిటంటే చప్పున చల్లారిపోవడం..
మా కుర్రాళ్ళందరికీ.. మంచి ముందు మంచు ముందూ..
శీఘ్ర లఘుశంక సమస్య
పన్నయ్యాకా.. ఇప్పుకుతిరగమని కాదు..
పనయ్యేదాకా వంపుకోకుండా ఉండమని..
ఉద్యమం అంటే ఎత్తిన చెయ్యే…
నెత్తిన చెయ్యి కాదు కదా!! ఏమంటారూ!!

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 30

Published by under my social views


మీ ఆట మీ ఇష్టం గానీ.. ఆటగాళ్ళూ..
మిమ్మల్ని ఇలా భరించడం కొంచం కష్టం.

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 29

Published by under my social views

మైథిలమ్మా!.. మీరో మోడల్
మీ పరిథిలో మీనిర్ణయాలు మీ ఇంటిని నిలబెట్టాయి..
మీలా అందరూ వ్యవసాయం చెయ్యమని కాదు గానీ..
భర్తకు సాయం చెయ్యమని.. మీ మాటగా వనితాలోకానికి
చెప్పకనే చెప్పారు.. ఇల్లు నిలబెట్టుకున్నారు..
మీ అమ్మ మీ కాదర్శమైతే.. మీరెందరికో..’
మీకు జయహో..

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 28

Published by under my social views


ఇద్దరూ చేసేది వ్యవసాయమేనా!.. ఎంత వ్యత్యాసం!!
బ్రతుకుతెరువులేక ఇంటిల్లిపాదీ కాడికింద చాకిరీకి ఒకచోట,
ప్రయోగాల బాటలో కంప్యూటర్ పక్కనపెట్టి
కమతాలను పొట్టపోయించిన తెలివి మరొక చోట..
కష్టాలన్నీ కట్టగట్టి ఒకగాటన!
బోలెడు బుద్ధుల బుర్రకు ప్రయోగాల వ్యవసాయం ఒక ఆటగ!!

దేవుడా!! ఇందులో నీ గొప్పెంత!! తప్పెంత??

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 27

Published by under my social views

ప్రాణదానం .. ఈ సందర్భం లో ఈ మాట చిన్నదైపోయింది
ఎవరి ప్రాణాన్ని ఎవరు దానం చెయ్యగలరు
అవయవ దానం ఇంతమందికి ఆయుప్రదానమైందా!!
అన్మోల్ జునేజా! నువ్వు ౩౪ మందిలోనే జీవించి ఉన్నావనుకుంటున్నావా!!
నీ తండ్రి స్పూర్తే నిన్ను వెలిగిస్తుంది..
ఎన్ని జన్మలకైనా ఏ ప్రమాదమైనా నిను ఏమార్చదు..
నువ్వు బతికున్ననాళ్ళు తండ్రికి కరుణను కాంచావో లేదో..
నీద్వారా మేం ఒక తండ్రిని గాంచాం.. మనిషిగా చలించిపోయాం

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 26

Published by under my social views

మాణిక్ సర్కార్!..
నీ నిబద్దత పై అపనమ్మకాలు త్రిపురకేకాదు, దేశం మొత్తానికీ లేదు..
సొంతలాభం కొంతమానుకోవడం ఈతరపు నైజం కాదు
ఒక్కతాటిన మీ రాష్ట్రాన్ని నిలబెట్టావు,
౩ పర్యాయాలు ప్రభుత్వాన్ని నిలిపి చరిత్ర సృష్టించావు
త్రిపురలో మారుమూల ప్రాంతాలు లేకుండా చేశావు
కాంగ్రెస్ విధాన వ్యతిరేకతే నీ వరమా..
ఉన్నత వ్యక్తిత్వం నీ పరమా
నీ బోటి నాయకులు లేకపోయారా..
భవిషత్ లో మాకోసం రాకపోతారా!!

RTS Perm Link

No responses yet

Feb 01 2013

నా కొత్త గీతలు జనవరి 25

Published by under my social views

చెట్టు పేరున కాయలమ్ముకునే సంప్రదాయం నుండి
ఉల్టా చోర్ దొంగ..దొంగని అరవడం రాజకీయాల్లో మామూలైపోయింది.
కవిమిత్రుడొకడు అన్నమాట ” దేశమంటే మంత్రులోయ్” నిజమౌతుంది ఈరోజుల్లో
ఏ ఇద్దరు కలిసి సమయం గడుపుతున్నా.. ఎవరిష్టాలు వారివనేరోజుల్నించి..
ఇది ఏ పరిణామపు పునాదిరాయో అని భయపడే కాలమొచ్చింది.

అణు విస్ఫోటనల మేఘాల్లా నల్లడబ్బే.. దేశాన్ని కమ్మేసింది..
అసలు రూపం కనిపించనీయకుండా ఉంచినందుకు
ప్రజాలోకం ఖద్దరు నవ్వుల్ని నమ్మేసింది
పత్రికలు, పౌరసంఘాలూ ఏకొమ్ముకాకొమ్ము కాస్తున్నప్పుడు
అర్థజ్ఞానులవైపే దేశం బిక్కచూపులు చూస్తుంది.

అర్థరధి అన్నమాట పడ్డ కర్ణునికే సేనావాహినిని నడపాల్సిన స్థితి.
లోతు తెలియని అన్నా.. హజారేయే వెయ్యమంది పెట్టు
సంకల్పాలకు ఉన్నబలంముందు.. సందేహాలన్నీ తీసికట్టు
ఇది వినేవాళ్ళకు ఆచరణ అమలు కాని సూత్రం
మరి డబ్బుతో కొనేవాళ్ళకు తలొగ్గనన్నదా ఎన్నడైనా న్యాయం మాత్రం!!

RTS Perm Link

No responses yet

« Prev

RTSMirror Powered by JalleDa