Archive for October, 2011

Oct 22 2011

శృంగార షష్టిపూర్తి

ప్రకృతి లో ఎందెందు కందోయి దూరినా అందందు అందాలు కనువిందు చేస్తాయి.
నవరసాలు అంచులు దిగువార జాల్వారుతూ ఉంటాయి. చూపులే దోసిళ్లూగా, ఈ మథుర రస ధారల్ని జుర్రుకోగలది కళాహృదయం ఒక్కటే!
లలితకళల్ని ఆరాధించి ఉపాసించే వారికి స్వార్థం తెలియదు… తాము పొందిన సౌందర్యానుభూతిని అందరికీ పంచుతారు. అలౌకిక స్పందనలు పొందగలిగిన మనస్సు దానిని ఆస్వాదిస్తుంది. అలాంటి రస హృదయాంకితమైన ఈ శృంగార షష్టిపూర్తి కి ముఖ పత్ర రచన నా అదృష్టం.
పుస్తకావిష్కరణ 20.11.2011 న భద్రాద్రి లో.

ఇది 76వసంతాల మా తెలుగు మాస్టారి.. భావ వల్లరి.. రస మాధురి.

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa