Archive for February, 2011

Feb 22 2011

మేం చూస్తాం.. చూసి తీరతాం

choostam

మేం చూస్తాం.. చూసి తీరతాం
ఏ రోజు కై ఎదురుచూసామో ..మేం చూస్తాం.. చూసి తీరతాం
64 ఏళ్ల కింద వచ్చినట్టు విన్న రోజుని..
పెద్దల పెదాలపై పదే పదే పలికిన రోజు ని
చీకటి వాకిట్లోకి వెలుగై చిమ్మే రోజు ని ….
మేం చూస్తాం.. చూసి తీరతాం

ఇక ఏ రాజకీయ మైనాకమైనా సముద్రంలో దూక వలసిందే.
సగటు మనిషి అడుగుల సవ్వడిలో మిన్ను – మన్ను కంపించ వలసిందే
పాలకుల బిరుసు తలల పై పిడిగులు పడే రోజు ని
మేం చూస్తాం చూసి తీరతాం

నిజం అంత నిజం గా విజయం – సహచర కలసి నిలిచే రోజుని
తరమబడ్డ నమ్మకాన్ని పీఠమెక్కించే రోజుని
ఖద్దరు ముసుగుల లొసుగులు తొలగి పోయే క్షణాలు తారాడే రోజుని
మేం చూస్తాం చూసి తీరతాం.

కోరుకున్న రోజు ఎదురొచ్చినప్పుడు దారి చూపే సహచర తో కలసి
మనం కాక మరెవ్వరన్న జవాబు ఇప్పుడు కాక మరెప్పుడన్నస్ఫూర్తి తో నడచి
అది నాలో నేనై ప్రభవించి.. మానవతై గుబాళించే స్వతంత్ర పుష్పాన్ని
చూస్తాం చూసి తీరతాం.

సామాన్యుడి బతుకు బండి గతుకుల దారి.. పూల బాటైన రోజుని
రోజువారీ పని లో అలసట ఆట పాటైన రోజుని
మేం చూస్తాం చూసి తీరతాం

ఫైజ్ అహమద్ ఫైజ్ స్పూర్తి తో.

.

RTS Perm Link

No responses yet

RTSMirror Powered by JalleDa