Archive for May, 2010

May 24 2010

నీతో..

కలిసి నడుద్దాం ..
ఈ నీరెండ లో ..
అప్పుడే అవసరం నీ తోడు.
ఊసులాడదాం
మలుపులవతల దారి కానరాని వేళ
అడుగుల ముద్రలు కొత్తపుంతలై..
ఎవరిమానాన వారైనవారైనా మునుపెన్నడూ చూడని కొత్త లోగిలి లో ..
ఆడి పాడదాం
మమతల పవనాల పలకరింతలనాడు ..కలిగిన పులకరింతలు నీ కేరింతలు.
నిరంతర బాటసారినైనా మునుపెన్నడూ పొందని గిలిగింతల వింతలు.
నా గమ్యం ఎటువైపైనా నీ తో కలిసి నడిచిన ఆడుగే కద నాన్నా.. నను నిలిపి ఉంచేది.. నిను నిలువరించేది..

RTS Perm Link

3 responses so far

RTSMirror Powered by JalleDa