విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్ఠలేననీ…..
నేను చిన్నప్పటి నుండి చాలా చాలా ఆంబిషన్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనదగ్గర పెద్దవాల్లకి ఏది ఇష్టమో అది పిల్లలు కావాలి అనుకుంటారు, దాన్నే పిల్లల మీద రుద్దుతారు. చిన్నప్పుడు అందరికీ హీరో ఎవరండి? (నోట్: చిరంజీవి , బాలయ్య లాంటి సినిమా వాళ్ళు కాకుండా). మీరు ఆలొచించద్దులే కాని నేనే చెప్తాను. చిన్నప్పుడు ఎవరికైనా హీరో వాళ్ళ నాన్నే నండీ బాబు. మరి హేరోలు ఎమి చేస్తారు. వాళ్ళ పిల్లల్ని కూడా హీరోలు చెయాలి అని చూస్తారు. దానర్థం నాన్నల్ని చేయలి అని కాదు. జీవితంలో బాగ స్థిరపడేలా చేయాలి అని. మా నాన్న కూదా అంతే నండి. నన్ను హీరో చేయాలి అనుకున్నారు పాపం.
మా నాన్న బయోలజికల్ సైన్సెస్ బాక్ గ్రౌండ్. కాని నన్ను మాత్రం ఇంజనీర్ చేద్దాం అనుకున్నరు. అందుకనే చిన్నప్పటినుండీ మాథ్స్ లో మాత్రం బాగా ఇది చూపించేవారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఫార్మసీ లొకి మారాల్సి వచ్చింది. మధ్యలొనె ఆగిపొవాల్సిన నా చదువు కాస్తా లండన్ లొ చదివే వరకూ వచ్చింది. మేము కూడా వెన్నెల టీం లాగ నలుగురం క్లాస్ మేట్స్ వచ్చాం లండన్ కి. అప్పుడు అనుకున్న కల కానిది నిజమైనదీ …అని
ఇక ఉద్యొగం విషయానికి వస్తే మాస్టర్స్ అయిపోయిన తరువాత మాతృదేశంలో ఫార్ములషన్ లొ కొన్నాల్లు జాబ్ చేసాను. మల్లీ లండన్ వచ్చిన తరువాత అందులో జాబ్ దొరకలేదు. ఏం చేయాలి మరి అల వచినప్పుడు తల వంచుకొని దారి మార్చుకొవాలి కదా. క్లినికల్ రిసర్చ్ లొ ప్రస్తుతం ప్రయాణం సాగుతోంది.
మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి మరి…………………….
అందుకే అన్నారు విధి చేయు వింతలన్నీ మతి లేని చేష్ఠలేనని అని…..
Comments(1)