ఉగాది = రంగు, రుచి, వాసన కలిసిన పండుగ.

తెలుగుదనం ఉట్టిపడే పందుగ ఉగాది
ఎంతో అహ్లాదకరమైన వాతావరణంతొ ఉగాది మన ముందుకు వస్తుంది. ప్రకృతి అంతా కొత్త చిగురులతో, పూతలతో అలంకరించుకొని ఎటు చూసినా ఆకుపచ్చని రంగుతో పండగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. రంగు, రుచి, వాసన కలగలిసిన ఏకైక పండుగ ఇదేనేమో. ఎందుకంటే ఎటు చూసినా హయిగొల్పే పచ్చని రంగు, ఆహ్లాదకరమైన కొత్త చిగురుల వాసన, కమ్మని పచ్చి మామిడి పండ్ల రుచి ఇవన్నీ ఒక్క ఉగాది పండుగకే సొంతం.
తెలుగువారికి మొదటి పండుగ ఉగాది. ఉగాదితొనే పండుగల సంబరాలు ఎలా మొదలవుతాయో అలానే పిల్లలకు మాత్రం పరిక్షల భయం మొదలవుతుంది. ఒంటిపూట బడులతొ బడికి వెళ్ళే సమయం తగ్గి చదువుకునే సమయం పెరుగుతుంది. కనీసం అప్పుడైనా పిల్లలకు వల్ల ఇష్టప్రకారం చదువుకునె వీలుంటుంది. ఎందుకంటె ఇప్పటి బడులలొ చదువులు ఎలా ఉన్నయో అందరికి తెలిసిన విషయమేగా. పిల్లలని ఉదయం నుండి రాత్రి దాకా ప్రొగ్రామింగ్ చెసిన పరికరాలుగా చూస్తున్నారు. కబట్టి ఉగాది వారికి కూడా స్వేఛ్చని ఇస్తుందనే చెప్పాలి.
ఇక కాలక్షేపానికి వస్తే ఏ పండగకి ఐనా ఒక కాలక్షేపం ఉంటుంది. ఉదయం లేవగానే పిల్లలకి ఉగాది పచ్చడిలొకి కావలసిన వేప చిగురు, మావి చిగురు, మామిడి కాయలు సేకరించడం. మొదటగా ఉగాది పచ్చడి తిన్న తరువాత పూజ పునస్కారాలు, చేసుకున్న పిండివంటలు ఆరగించడంతొ సరిపోతుంది. అలానే ఈ ఉగాదికి ప్రత్యెకమైనది పంచాంగ శ్రవణం. వారి వారి నమ్మకాన్ని బట్టి పిల్ల, పెద్ద తేడా లెకుండా అందరూ కూర్చొని రాబొయే సంవత్సరం అంతా వారి భవిష్యత్ ఎలౌంటుందో ఆసక్తిగా వింటారు.
అలా పండుగ వాతవరణంతొ మొదలైన సంవత్సరం ఆసాంతం మీ అభిలాష ప్రకారమె జరగాలని ఆశిస్తూ
మీ
కిరణ్