ఓ మనిషి మేలుకొ నిజం తెలిసి మసలుకో !!!

అంతటి ఆ దేవుడే మనిషిగా బ్రతకాలని ఎన్నో అవతారాలెత్తాడు మనిషిలా మన మధ్యకు వచ్చాడు. అన్నీ తెలుసనుకున్న మనిషి మళ్ళీ ఆ దేవుని రాయిలా మార్చాడు. మన కర్మభూమి లో దేవుని అభిషేకానికి పాలు ఉంటాయి కాని పేదవారికి, పసివారికి ఇవ్వడానికి ఉండవు.

రాయిని పూజించీ పూజించీ మనిషి గుండె రాయిగ మారింది. అందుకే  మన దేశంలొ మనిషికన్నా రాయికే విలువ ఎక్కువ.

ప్రాణం లేని ప్రతిమకేమో ప్రాకారలు, ప్రసాదాలు
ప్రాణమున్న మనిషికేమొ పెదవి విరుపులు …

ఏ పుణ్యం చేసిందో రాతిబండ దేవుడాయె
ఏ పాపం చేశాడో మనిషి గుండె రాయయ్యే …

రాతి గుండె మనసు కన్న రాతి యుగం మనిషి మిన్న
కరగలేని మనసు కన్న కరిగే క్రొవ్వత్తి మిన్న …

ఓ మనిషి మేలుకొ నిజం తెలిసి మసలుకో !!!

మనసున్న కనులతో లోకాన్ని చూడు
అపుడే వినిపిస్తుంది కష్టాల గోడు…

నీ స్వార్థం మానుకొ నిస్వార్థం పెంచుకో
పదిమందికి సాయపడుతూ మనిషిగా మసలుకో ….

ఓ మనిషి మేలుకొ నిజం తెలిసి మసలుకో !!!

RTS Perm Link

వేటూరి గారి సాహిత్యం … ఏ కులము నీదంటే ….

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఓఓఓ…….ఆఆఆఆఆఆ…………………..

ఏడు వర్ణాలు కలిసి ఇంద్ర ధనసౌతాది
అన్ని వర్ణాలకొకటే
ఇహము పరముంటాది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది(2)
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు………………

కుల మత భేదాలు లేవని మనుషులంతా ఒకటేనని తన కలంతో చెప్పిన వేటూరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ….

RTS Perm Link

ఓటరూ కావాలి నువ్వే ఇక లీడరు ……..

ఓటరు -
ఈ సమాజానికి నువ్వే ఓనరు ..
ఫఖీరు -
నువ్వు ఎవడంటే వాడేలే లీడరు …

నీ చేతిలో ఉంది ఓటు అనే ఆయుధం - 
దానితో సాధించెయి నీకున్న ఆశయం …

భావి తరాలకు నువ్వే కావాలి ఆదర్శం -
అందుకో నువ్వు ఈ సువర్ణావకాశం …

నీ వేలికి పెట్టే ఎలక్షన్ బొట్టు  -
అభివృద్ధికి కావాలి ఒట్టు …

రాజకీయం అంటే రాజరికం కాదురా
గులాంగిరి సలాంలు వద్దురా …

వెసేయి ఓటు -
అవినీతికి వచ్చేలా గుండే పోటు… 

దించేయి మెట్టు -
అన్యాయం చేసినోల్లని తరిమికొట్టు… 

ఓటరు ……. !

ఐదేళ్ళకి ఒకసారి వచ్చే మీ నాయకుడు -
మీకేమీ చేయడులే ఎప్పుడూ …

డబ్బుతోటి ఓటును బేరమాడే నాయకులు -
మీ కష్టం దోచే రాబందులు …

సామర్థ్యం కలిగి మంచి చేసే నయకులను -
ఏరికోరి ఎంచుకో నేడు …

అలసత్వం చూపి -
అలసిపోతే నేడు వెళ్ళలేవు ముందుకు ఎన్నడూ …

ఓటరు ……. !

RTS Perm Link

తొందర పడకు సుందరవదనా

ఇది ఒక యదార్థ గాధ.

మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బస్ లొ వెళ్తున్నడండి. ఇంకా బస్ బయలుదేరలేదని తన లాప్ టాప్ బాగ్ బస్ లో పెట్టి క్రిందకి దిగాడు. అంతలోనే ఎవరో దొంగ వచ్చి ఆ బాగ్ ని తీసుకొని ప్రక్క బస్ లొ వేసి దిగిపోయడు. ఈ తతంగం మొత్తం ఇద్దరు అమ్మయిలు చుస్తున్నారు. కొంతసేపటి తరువాత మనోడు బస్ ఎక్కడం బాగ్ పోయిందని గమనించడం జరిగిపొయాయి. ఆ ఇద్దరు అమ్మాయిలు జరిగిన విషయం అతనికి చెప్పారు. ఐతే మనోడు మీరేం చెస్తున్నరని వాళ్ళమీద పిచ్చిగా అరిచేసి బస్ ని పోలీస్ స్టేషన్ కి తీస్కొనివెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు.

కొన్ని రోజుల తరువాత ……

దొంగ గారి వైపు ఏం జరుగుతుందో చూద్దాం …

ఇక్కడ మన దొంగ గారెమో లాప్ టాప్ పాస్ వర్డ్ ని ఛేదించడానికి నా నా కష్టాలు పడుతున్నాడు కాని అది ఓపెన్ అవ్వడం లేదు. ఇదంతా దొంగ గారి పక్క ఇంటి అతను గమనిస్తున్నాడు. మరి అతనికి ఏం మంచి బుద్ది పుట్టిందో కాని లాప్ టాప్ లొ ఉన్న మెయిల్ ఐడి కి మొత్తం దొంగ అడ్రెస్స్ పంపించాడు.

ఇంత జరిగాక ఎవరు ఆగుతారండి? ఇక్కడ మన లాప్ టాప్ ఓనర్ పోలిసుల్ని తీసుకొని ఆ అడ్రెస్స్ కి వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లాప్ టాప్ లు ఉన్నయంట.

ఇంకేం మనొడి లాప్ టాప్ దొరికింది కదా !!
మనోడు ఇంటికి దొంగోడు జైలు కి …. కాని కథ మాత్రం కంచికి వెల్లలేదు ఇంకా ఉంది …

కొన్నిరొజుల తరువాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోర్ట్ పని మీద తిరగాల్సి వచ్చింది ఎందుకో చెప్పండి చూద్దాం . …..

ఆ ఇద్దరమ్మయిలు మనోడి మీద న్యుసెన్స్ కేస్ పెట్టారు.

అందుకే తొందరపడి ఎవరినీ ఏమీ అనకండి సార్ .. తరువాత చాలా బాధ పదాల్సి ఉంటుంది.

ఇంకా ప్రయాణం చేసేటపుడు మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. కొన్నింటిని మాత్రమే మనం డబ్బుతో కొనుక్కోగలం.  

 

RTS Perm Link

శ్రీ రామ నవమి

 

 

ఊరంతా చల్లగా పందిళ్ళూ
కడుపంతా చల్లగా పానకం వడపప్పు
మనసంతా చల్లగా శ్రీ సీతా రామ కళ్యాణం.             

విన్న వారింట వైభోగం.

 

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

RTS Perm Link

ఆరుబయిట సాయంకాలం అమ్మ చేతి ముద్ద

నిండు పున్నమి నాటి పండు వెన్నెల స్వర్గన్నే తలదన్నేలా

పగలంతా విహరించిన సూరీడు విశ్రాంతి కోసం వినీలాకశంలొ పశ్చిమ తీరానికి మెల్లగా జారుకున్నపుడు
పండు వెన్నెలతో పన్నీటి జల్లును కురిపించడానికి విచ్చేసిన రేరాజు తన చల్లని వెలుగును తెల్లగా పరిచినపుడు
మెల్లగా తగిలే చల్లగాలి మేనుకి మైమరపైతే, విరగబూసిన విరజాజులు వెదజల్లే సుగంధం మనసుని మైమరిపింపచెసినపుడు
దేవతలకి సైతం దక్కని అమృతమైన అమ్మ చేతి ముద్ద తింటూ అమ్మ చెప్పే మర్యదరామన్న కథలు వింటున్నపుడు
చల్లగాలికి మల్లె తీగ గమ్మత్తుగా ఊగుతుటే ఆ మల్లెల మత్తుగాలికి నా మనసు ఊహలలొ తేలుతూ నిద్రలొకి జారుకుంది.

RTS Perm Link

విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్ఠలేననీ…..

నేను చిన్నప్పటి నుండి చాలా చాలా ఆంబిషన్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనదగ్గర పెద్దవాల్లకి ఏది ఇష్టమో అది పిల్లలు కావాలి అనుకుంటారు, దాన్నే పిల్లల మీద రుద్దుతారు. చిన్నప్పుడు అందరికీ హీరో ఎవరండి? (నోట్: చిరంజీవి , బాలయ్య లాంటి సినిమా వాళ్ళు కాకుండా). మీరు ఆలొచించద్దులే కాని నేనే చెప్తాను. చిన్నప్పుడు ఎవరికైనా హీరో వాళ్ళ నాన్నే నండీ బాబు. మరి హేరోలు ఎమి చేస్తారు. వాళ్ళ పిల్లల్ని కూడా హీరోలు చెయాలి అని చూస్తారు. దానర్థం నాన్నల్ని చేయలి అని కాదు. జీవితంలో బాగ స్థిరపడేలా చేయాలి అని. మా నాన్న కూదా అంతే నండి. నన్ను హీరో చేయాలి అనుకున్నారు పాపం.

మా నాన్న బయోలజికల్ సైన్సెస్ బాక్ గ్రౌండ్. కాని నన్ను మాత్రం ఇంజనీర్ చేద్దాం అనుకున్నరు. అందుకనే చిన్నప్పటినుండీ మాథ్స్ లో మాత్రం బాగా ఇది చూపించేవారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఫార్మసీ లొకి మారాల్సి వచ్చింది. మధ్యలొనె ఆగిపొవాల్సిన నా చదువు కాస్తా లండన్ లొ చదివే వరకూ వచ్చింది. మేము కూడా వెన్నెల టీం లాగ నలుగురం క్లాస్ మేట్స్ వచ్చాం లండన్ కి.  అప్పుడు అనుకున్న కల కానిది నిజమైనదీ …అని

ఇక ఉద్యొగం విషయానికి వస్తే మాస్టర్స్  అయిపోయిన తరువాత మాతృదేశంలో ఫార్ములషన్ లొ కొన్నాల్లు జాబ్ చేసాను. మల్లీ లండన్ వచ్చిన తరువాత అందులో జాబ్ దొరకలేదు. ఏం చేయాలి మరి అల వచినప్పుడు తల వంచుకొని దారి మార్చుకొవాలి కదా. క్లినికల్ రిసర్చ్ లొ ప్రస్తుతం ప్రయాణం సాగుతోంది.
మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి మరి…………………….

అందుకే అన్నారు విధి చేయు వింతలన్నీ మతి లేని చేష్ఠలేనని అని…..

RTS Perm Link

RTSMirror Powered by JalleDa

css.php