నేను సైతం…

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం..
మౌనం చుపిస్తుందా సమస్యలకు మార్గం?
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?
మంచైనా చెడైనా పంచుకోను నే లేనా
ఆ మాత్రం  ఆత్మీయతకైనా పనికిరనా
ఎవ్వరితో ఈ మాత్రం పంచుకోని వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలెమిటండీ?

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

గుండెల్లో సుడులు తిరిగే కలత కధలూ

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలివెస్తే అయినా నే ఏకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలివెస్తే అయినా నే ఏకాకిని

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

పాత పాట మరాలని చెప్పటమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచె వన్నెల విరితోట
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట?
మనిషి అడుగు జాడల్లొ లేదా ఏ ముళ్ళ బాట?
మనిషి అడుగు జాడల్లొ లేదా ఏ ముళ్ళ బాట?

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం?
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం?
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుంభవ్రుష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మొడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుకవున్నదే రాగం?
అనుక్షణం వెంటాడె ఆవేదన ఏ తాళం?
అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్తకోకిల
కళ్ళు వున్న కబోధిలా చెవులున్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం…
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం…

చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది

అసహాయతలో ధడ ధడలాడే హ్రుదయ మ్రుదంగ ధ్వానం ,
నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని సోకం..
ఎడారి బతుకున నిత్యం ఛస్తూ సాగే బాధల బిడారు…
దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ఠ జీవన స్వరాలు
నిలువినా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపస్రుతి సరిచేయాలి
జన గీతిని వద్దనుకుంటు నాకు నేనె హద్దనుకుంటూ…
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను…

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతానూ..
నేను సైతం భువన ఘొషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ…
నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తానూ..
నేను సైతం  నేను సైతం  బ్రతుకు పాటకు గొంతు కలిపేనూ..
నేను సైతం  నేను సైతం  బ్రతుకు పాటకు గొంతు కలిపేనూ…

సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా..
ప్రతీ మనిషికి జీవనంలో నందనం  వికసించుదాకా…
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడి పోను..
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడి పోను…

నేను సైతం  నేను సైతం  నేను సైతం ..
నేను సైతం  నేను సైతం  నేను సైతం  …

జీవితంలో ‘ నేడు ‘ అనేదానిని విడిచి ‘ రేపు ‘ అన్నదానికి పయనం సాగించాలి అంటే ప్రతీక్షణం వెంటనుండి,వెన్ను తడుతూ స్పూర్తిని కలిగించే భావాలు ప్రతి మనిషీకీ కొన్ని వుంటాయి.

పైన రాసిన పాటలోని ప్రతి వాక్యం, నాలో అలా స్పూర్తిని రగిలించేదే.
మరి మీలో స్పూర్తిని కలిగించే భావాలు ఏంటో మన మిత్రులందరితో తప్పక పంచుకుంటారని  ఆశిస్తూ..

 మీ,
నాయిడు బావ.

గమనిక: పైన రాసిన పాట “రుద్ర వీణ” చిత్రంలోనిది. చాలా మంచి పాట. వీలైతే తప్పకుండా విని ఆనందించండి,ఆశ్వాదించండి.

3 Responses to “నేను సైతం…”

  1. aparichitudu Says:

    అన్నయ్యా, ఎంతో మంచి పాట ను మీరు వెలుగులికి తెచ్చారు, ఎంతో inspirational song అది.

  2. శ్రీరాం తనికెళ్ళ Says:

    నాయుడు బావ గారూ,
    అక్కడక్కడ అప్పుతచ్చులు వున్నయండీ…

    “దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?
    మంచైనా చెడైనా పంచుకోను మేలైనా”

    – మంచైనా చెడైనా పంచుకోను “నే లేనా”

    “ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం?
    ఏదీ మరి మిగతా కలలకు తాళం?”

    – ఏదీ మరి మిగతా “కాలాలకు” తాళం?

    “దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు”

    – దిక్కు మొక్కు తెలియని దీనుల “వ్యదార్ఠ” జీవన స్వరాలు

  3. naidubaava Says:

    శ్రీరాం తనికెళ్ళ గారూ,

    నా అచ్చుతప్పులు సరి చేసినందుకు ధన్యవాదాలు. తప్పులు చెయ్యడం మానవ సహజం కదా.
    మీ కామెంట్ లో కూడా అచ్చుతప్పులు వున్నాయండోయ్

    “నాయుడు బావ గారూ,
    అక్కడక్కడ అప్పుతచ్చులు వున్నయండీ…” - అక్కడక్కడ అచ్చుతప్పులు వున్నయండీ… ;)

Leave a Reply