జర భథ్రం కొడుకో…
మీకు “మూలిగే నక్క మీద తాటికాయ పడటం…” అంటే ఎంటో తెలుసా?
వీడి బాథ ఏంటిరా బాబూ అనుకుంటున్నారా?
ఈ రోజు దినపత్రిక చూస్తే మీకే అర్థం అవుతుంది.
“ఐ.టి సంస్థలకు ఐ.ఎస్.ఐ నుంచి ముప్పు” అని వుంది దానిలో .
అసలే రుపాయ విలువ పెరిగిఫోవడం వలన ఎక్కువ గంటలు పని చెయ్యవలసి వస్తుందేమో అన్న కంగారు ఒక వైపు, చాలీచాలని జీతంతో పడుతున్న అవస్థలు మరొక వైపు ఇలా నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న సగటు సాఫ్టువేర్ జీవి పైనే ఈ తీవ్రవాదుల గురి కూడా వుందని తెలిసినప్పటి నుంచి నాకు ఏమని అనిపిస్తొందో తెలుసా?
“నిండా మునిగినోడికి చలేంటి ” అని… మరి మీకు ఏమని అనిపిస్తోంది???
July 26th, 2007 at 12:10 pm
ముందున్నది ముసళ్ళ పండగ గుర్తు వస్తుంది నాకు
July 26th, 2007 at 12:54 pm
పడిపోయింది డాలర్ విలువనుకుంటా?
July 27th, 2007 at 12:08 am
నిజమే బ్రదర్.. అలవాటులో పొరపాటు..