అనాథ పిల్లలే…

కాని ఎవరు బాధ్యులు? నాలుగు నెలల తర్వాత ఈ ఆదివారం ఒక ముఖ్యమైన పనిపై తిరుపతికి వెళ్లాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత నా ఒకప్పటి స్నేహితుడు కాళయ్యను (గోపీ అని మరోపేరు) కలుసుకోవడానికి వెళ్లాను. నా సహచరి అనారోగ్యాన్ని డాక్టర్‌కు చూపించాలని చేసిన ప్రయత్నం విఫలం కావటంతో – మేము వెళ్లిన సమయానికే ఆ డాక్టర్ వాళ్లమ్మ కాలం చేశారు – దాంతో దొరికిన ఆ సెలవు రోజు ఖాళీ సమయాన్ని నా చిరకాల మిత్రుడిని […]

స్పందించే హృదయాలకు….

నిండు నీరాజనాలు…. తిరుపతిలో నా స్వంత అనుభవాన్ని అక్షరాలుగా మార్చి నిన్న -ఫిబ్రవరి 26- Telugu.webdunia.com లోని వెబ్‌దునియా బ్లాగులో అనాథ పిల్లలపై ప్రచురించిన ఒక కథనం ఆ నిర్భాగ్యుల తక్షణావసరాలను కొన్నింటిని సత్వరమే తీర్చగల స్పందనలను కొందరిలో కలుగజేసింది. 18 ఏళ్లనుంచి 35 ఏళ్ల వయసులో ఉన్న యువతరానికి కావలసిన అన్ని మసాలాలను అందించడానికి, వారిని ఆకర్షించడానికి పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్లు వగైరాలు నానా పాట్లు పడుతున్న ఈ రోజుల్లో, అనాథ పిల్లల జీవన్మరణ సమస్యలు […]

నడిరేయి ఏ జాములో….

స్వామి నిను చేర దిగివచ్చెనో…. అమ్మగారిని నమ్ముకుంటే చాలు.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని తెలుగు సామెత. అయ్యగారు అధికార స్థానంలో ఉండి ఒక పట్టాన కొరుకుడు పడని రకం మనిషి అయితే ఆయన సతీమణి… అదే…. అమ్మగారిని కాకాపడితే చాలు ఎంత కష్టమైన పని అయినా ఇట్టే జరిగిపోతుంది. పై సామెత అంతరార్థం ఇదే కదా…. తరతరాలుగా జన జీవితంలో ఒకానొక అనుభవం ఎంత అద్భుతమైన సామెతగా తయారైందంటే, ఈ అమ్మగారిని నమ్ముకుని పని పూర్తి చేసుకునే భావన […]

మా తెలుగు మాస్టారూ…

మా తెలుగు పద్యమూ… పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు….7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. మా క్లాసుకు రెండు సెక్షన్‌లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూతలూగించేవారు.. ఇంగ్లీష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్‌లతో పరమ విసుగ్గా ఉండే మాకు ఆయన క్లాస్ అంటే చాలు చెవులు నిక్కబొడుచుకుని ఆయన రాక కోసం ఎదురు […]

సత్ప్రవర్తన – సచిన్ ‘లా’

సామాన్యుడు కాడు….. మూడు నాలుగు రోజుల క్రితం ఆధునిక క్రికెట్ సమ్మోహనుడు సచిన్ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ చేసిన ప్రశంసను అందరం చదివే ఉంటాం. క్రికెట్‌లో ఎవరితో అయినా పెట్టుకో. కాని సచిన్‌తో మాత్రం కాదు అన్నది షేన్ ప్రశంస. సచిన్ విషయంలో స్లెడ్జింగ్ పనికిరాదని, రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోవడం సచిన్ శైలి అని షేన్ పదే పదే చేస్తున్న హెచ్చరిక.. బ్యాట్స్‌మెన్‌గా సచిన్ ఆటతీరును ఈ ప్రశంసారూప హెచ్చరిక ఎత్తి చూపుతూ ఉండవచ్చు […]

దున్నపోతు మీద వాన కురిస్తే…

ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్నా!! మేం చదువుకునే రోజుల్లో విశేషంగా మా నాలుకల మీద పారాడిన గొప్ప పద్యమిది. మాట మాట్లాడితే మనం మన కోపాలను, చిరాకులను, ద్వేషాలను జంతువులపై ఆపాదించి కుక్కల కొడకా, గాడిద కొడకా, పందినాకొడకా, నక్కనాయాల, ముళ్లపందీ, కోతిగా, ముసంగి, కుంటిగుర్రమ్మ… అంటూ ఇలా జంతు సంకేతాలతో మనకు అయిష్టులైన వారిని తిడుతుంటాము గదా… ఓ సందర్భంలో […]

పెర్తాయనమః

-రాజశేఖర్ బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ…. మానవ అనుభవ సారాన్ని అత్యద్భుతంగా తాత్వీకరించిన ఈ పద్యం ఇప్పుడు మన పాఠశాల పిల్లలకు చెబుతున్నారో లేదో తెలీదు. కానీ, మొన్న పెర్త్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు జరిగిన జీవిత కాల పరాభవాన్ని చూశాక, చదివాక ఈ పద్య సారాంశం మరింత మహత్తరంగా బోధపడింది. క్రికెట్‌లో జయాపజయాలు ఎవరికయినా, ఏ జట్టుకయినా సహజమే కాబట్టి పెర్త్‌లో ఆసీస్ […]

జీవితమా

కరుణించవూ…. కలిమి లేములు కష్టసుఖాలు కావడిలో కుండలనీ భయమేలోయి కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయి… ఈ వింతేనోయి.. గత 35 ఏళ్లుగా అంటే ఊహ తెలిసినప్పటినుంచీ, ఎన్ని వందలసార్లు వింటూ వచ్చానో ఈ పాటను…హిందూ వేదాంతాన్ని ఇంత నగ్నంగా, నిరామయంగా చాటి చెప్పిన బైరాగి గీతం (వైరాగ్య గీతం అంటే చక్కగా సరిపోతుందేమో) తెలుగు సినీ సాహిత్యంలో మరొకటి లేదేమో…ఈ పాట విన్న ప్రతిసారీ సంగీత బాణీ, ఘంటసాల మంత్ర స్వర మహత్తులో మునిగి […]

సోమరులకెందునూ మోక్షము లేదు….

కృష్ణమూర్తి టీచర్…. ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని….మారోజుల్లో టీచర్లు ఏ క్లాసు పాఠం చెప్పేవారు అయినా సరే సబ్జెక్టు మాత్రమే కాక జీవితానికి సంబంధించిన విలువల గురించి సందర్బం వచ్చినప్పుడల్లా పిల్లల మనసుల్లో నాటేవారు. విసుగు తెప్పించే మామూలు పాఠాల కంటే అప్పుడప్పుడూ అయ్యవార్లు చెప్పే ఇలాంటి జనరల్ విషయాలే చాలా బాగుండేవి. […]

ఎదురు తిరిగితే…

శతాబ్దాల చరిత్ర హతం.. పదో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన…సైన్స్ మాష్టార్ల హవా ఇప్పుడే కాదు అప్పుడూ నడుస్తున్న కాలం. అందులోనూ బౌతిక రసాయన శాస్త్రాల అధ్యాపకులు అంటే కఠినాత్ములు అని పేరుపడిన కాలం. మా స్కూల్లో ఫిజికల్ సైన్స్ -ముద్దుగా ఫిజిక్స్ అని పిలిచేవారు- టీచర్ రంగారెడ్డి అని ఉండేవారు. ఆయన పేరు ఫిజిక్స్ సారుగానే మాలో ముద్రించుకుపోయింది. పల్లెటూళ్లు కేంద్రంగా ఉండే స్కూల్లో చదువుకున్నాం. మా కాలంలో అంటే 1970లలోనూ అయ్యవార్లు అంటే వణికి […]

Packaged by Edublogs - education blogs.

RTSMirror Powered by JalleDa

css.php