దున్నపోతు మీద వాన కురిస్తే…

ఆడిన మాటను తప్పిన
గాడిద కొడుకంచు తిట్టగా విని
వీడా నాకొక కొడుకని
గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్నా!!

మేం చదువుకునే రోజుల్లో విశేషంగా మా నాలుకల మీద పారాడిన గొప్ప పద్యమిది. మాట మాట్లాడితే మనం మన కోపాలను, చిరాకులను, ద్వేషాలను జంతువులపై ఆపాదించి కుక్కల కొడకా, గాడిద కొడకా, పందినాకొడకా, నక్కనాయాల, ముళ్లపందీ, కోతిగా, ముసంగి, కుంటిగుర్రమ్మ… అంటూ ఇలా జంతు సంకేతాలతో మనకు అయిష్టులైన వారిని తిడుతుంటాము గదా…

ఓ సందర్భంలో మనిషి పాలబడి ఇలాంటి తిట్లు పడిన గాడిద భోరుమంటూ విలపిస్తూ నా బతుకెంత హీనమని కిందబడి మరీ ఏడ్చిందట. ఆడిన మాట తప్పిన వాడిని గాడిద కొడుకుగా వర్ణించి ఎవరో ఈసడిస్తే, దారిన పోయే ఓ గాడిద ‘వీడా నా కొడుకు’ అని వలపోయిందట. నీతి తప్పినవాడికి తనతో బాంధవ్యం అంటగడితే గాడిద సైతం తన మనసు కష్టపెట్టుకుంది మరి.

మరి మాట తప్పినవారిని, నీతి తప్పిన వారిని, స్పూర్తి తప్పినవారిని, అక్రమమే, అధర్మమే, అన్యాయవర్తనమే తమ రక్త లక్షణంగా మెలుగుతున్నవారిని ఏమనాలి. కొన్ని జన్మలింతే, కొందరి మాటలు, చేతలు, ఆటలు కూడా ఇంతే అని సరిపెట్టుకోవచ్చా.. క్రికెట్ ఆస్ట్రేలియా బతుకేమిటి ఇంతలా చెడింది? క్రీడా చరిత్రలో సీరీస్ గెలుపొందిన ఏ జట్టైనా ఇన్ని తిట్లు తిన్న వైనం, తింటున్న వైనం విన్నామా కన్నామా?

ఇంతకీ ఆసీస్ క్రికెట్ జట్టుకు ఏమైంది?

కె.రాజశేఖర రాజు.

webdunia.com

చెన్నై

మొబైల్ : +91 9884612596

Email : raju.sekar@webdunia.net

My Another blog

http://raju123.mywebdunia.com/

RTS Perm Link

Leave a Reply

You must be logged in to post a comment.

Packaged by Edublogs - education blogs.

RTSMirror Powered by JalleDa

css.php