ఆకాశంలో సగం….

మైలాపూర్ మార్గంలో వచ్చే 12B బస్సు అంటే నాకు ఎంత ఇష్టమో.. ఎందుకంటే వెస్ట్ మాంబళంలో ఉన్న మా ఆఫీసుకు రోజూ వచ్చేదారిలో పాండీ బజారు వరకు నన్ను తీసుకొచ్చి దింపేది ఈ బస్సే మరి. సకాలంలో నేను రోజు ఆఫీసుకు రావాలన్నా, ట్రాపిక్ రద్దీలో చిక్కుకుని ఆఫీసుకు లేటయినప్పుడు ఉన్న బీపీని మరింతగా పెంచుకోవాలన్నా అంతా ఈ బస్సు పుణ్యమే మరి. దీంట్లో ఎక్కి సీటు దొరికి కూర్చుంటే, ఒక అరగంట పైగా విశ్రాంతిగా ఉండొచ్చు, […]

“పడుపు కత్తె రాక్షసరతిలో  దహించుకుపోయే అర్ధ నిమీలిత నేత్రాల దారుణ బాధల గాధల పల్లవులెన్నో విన్నానమ్మా…..” శ్రీశ్రీ రాసిన ఈ కవితా పాదాలతో సరిపోలగలవి తెలుగు సాహిత్యంలో కనబడితే దయచేసి ఇక్కడ కూర్చండి…. RTS Perm Link

ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు

భూమ్మీది కొచ్చి పడ్డాక దాదాపు 33 ఏళ్లకు కంప్యూటర్తో ప్రత్యక్ష పరిచయం (1997) బ్లాగ్ విశ్వరూపమెత్తిన ఇన్నాళ్లకు సొంతంగా నేనూ ఓ బ్లాగును సృష్టించుకున్నాను. అనుభూతులను, పనుల ఒత్తిళ్లను అధిగమించి నన్ను నేను బ్లాగ్ రూపంలో ఆవిష్కరించుకోవడానికి ఏ కాస్త సమయం దొరికినా నాలుగక్షరాలతో ఇలా మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మీ.. మోహన RTS Perm Link

Packaged by Edublogs - education blogs.

RTSMirror Powered by JalleDa

css.php