మజిలీలు

మదిలొని ఆలోచనలు

సశేషం

Filed under: Cinema — majileelu at 9:11 pm on Wednesday, June 11, 2008

నాకు నచ్చిన కొన్ని తెలుగు సినిమాలు:
1)మురారి

2)ప్రేమ కథ

3)చందమామ

4)ిన్నే పెళ్ళాడతా

5)అతడు

6)తొలి ప్రేమ

7)ఖుషీ

8)గుండమ్మ కథ

9)యువ

10)అహ నా పెళ్లంట

11)లిట్టిల్ సొల్జర్స్

12)పెళ్ళి పుస్తకం

చిన్న గురుదక్షిణ

Filed under: ఆలోచనలు — majileelu at 6:34 pm on Sunday, May 25, 2008

తెలుగు భాష మీద మక్కువ పెంచుకోవటానికి ముఖ్యమైన కారణాల్లో ప్రధానంగా స్కూలులో తెలుగు నేర్పించిన ఉపాధ్యాయులు అని చెప్పాలి.

వారిలో ముఖ్యులు ఏకబిగిన మూడు సంవత్సరాలు చెప్పిన విజిత టీచరు, ఇంకా ఒక సంవత్సరం చెప్పిన సుందరీ టీచరు .వాళ్ళిద్దరి  పుణ్యమా అని,నేడు  ఈ బ్లాగు సాధ్యపడింది. 

విజిత టీచరు ప్రత్యేకతలు:
తెలుగు భాషలోని మాధుర్యాన్ని వంటబట్టేలా చెయ్యటం  ఆవిడకే చెల్లింది. అది మా చేత పద్యాలు కంఠస్థం చేయించటం అయినా, పద్య, గద్య భాగాల్లో సారాన్ని   విడమరచి చెప్పటం అయినా, పద్యాన్ని క్లాసులో అందరితో చదివించటం అయినా అవి ఆవిడలోని తాపత్రయానికి  నిలువెత్తు సాక్ష్యాలు.

సుందరీ టీచరు ప్రత్యేకతలు:
పద్యాల్ని రాగయుక్తంగా పాడటం ఆవిడ వరం అని చెప్పొచ్చు. 
 
అయితే,ప్రపంచపు (వెస్టర్న్)పొకడలు వంటపట్టించుకున్న వారు, ఏంటీ…మా పిల్లలు తెలుగు చదివి ఏం చేస్తారనే వారు,ఏదో మొక్కుబడిగా, కష్టంగా తెలుగు నేర్చుకునే విద్యార్ధులు కూడా లేకపొలేదు.అయినా ఇవన్నీ నాకెందుకులే…

ఏదేమైనా నాకు బొమ్మరిల్లు సినిమా లో పాట గుర్తొస్తుంది  ఇదంతా చూస్తూ ఉంటే…

“టీవీ యాంకర్ దేఖోరా (ఒక అమ్మాయిని చూపిస్తూ హీరో స్నేహితులు అంటే)…ఆ  వంకర భాషకు దండమురా…(హీరో అనటం)”

అని అనడం పరప్రాంతాల వారికి మాత్రమే కాదు, కొంతవరకు
తెలుగులో మాట్లాడటానికి నామోషీగా ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనటం తప్పేం కాదేమో అని అనిపిస్తుంధి.

ఇప్పటికి ఇంతే…మళ్ళీ వీలు కుదిరినప్పుడు రాస్తా…
గమనిక: ఇక్కద వ్యక్తం చేసిన అభిప్రాయాలు నావి మాత్రమే.

మొదటి పోస్టు

Filed under: ఆలోచనలు — majileelu at 1:46 am on Sunday, May 25, 2008

గమనిక:ఈ బ్లాగులోని content సరిగా కనిపించాలంటే Internet Explorer వాడండి. 

ఈ బ్లాగుకి ఏ పేరైతే బావుంటుందో ఆలోచించగా,ఆలోచించగా  ‘మజిలీలు’ అని పెడితే బాగుంటుందని అనిపించి పెట్టాను.

ఇక సంగతేమిటంటే, బోలెడు మంది బ్లాగులు రాస్తున్నారు కదా, నేను మాత్రం ఎందుకు రాయకూడదు అని మొదలు పెట్టా. (అందులోనూ ఇప్పుడు హింది హీరోలు, వారి బ్లాగులు, వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తుంటే ఎవరికి మాత్రం రాయాలని ఉండదు). పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కొన్ని సార్లు అనిపించింది కానీ, ఏమైతే ఆది లే అని స్టార్ట్ చేసా.

తెలుగులో బ్లాగు రాయాలన్ననిర్ణయం తప్పో కాదో తెలీదు కానీ రాస్తున్నాను టార్గెట్ ఆడియెన్స్ తగ్గినా కూడా మనసులో ఉన్న మాటల్ని వ్యక్తం చెయ్యటానికి ఇంతకు మించి మార్గం కనిపించలేదు .పైగా నాకు ఉన్న భాషా పరిజ్ఞానానికి తెలుగులో తప్ప వేరే ఏ భాషలోనూ రాయటం అసాధ్యం

ఎం రాయాలో కూడా నిర్ణయించుకోలేదు కానీ ,టైమ్ చూసుకు రాయాలని పక్కా ఫిక్స్ అయ్యాను ఇంతకు ముందు చాలా సార్లు ఇలా ప్రయత్నాలు చేశానులే కానీ చూడాలి ఈ సారి ఏమవుతుందో.

ప్రస్తుతం

  • పాటలు:
    బుజ్జిగాడు (తెలుగు సినిమా)
  • వ్యక్తి:
    ఆరుషి తల్వార్ (నోయిడాలో జరిగిన ఘోరమైన హత్య కేసులో పధ్నాలుగు సంవత్సరాల హతురాలు)
  • సినిమా:
    కంత్రి (తెలుగు)

ఉంటాను మరి…ప్రస్తుతానికి సెలవు