తిరుపతి ఈస్టు రైల్వే స్టేషను

చీకటిలేదంటారా ? మరి చిరుదివ్వె ఎందుకండీ !! చేతి చమురు వదలడానికి తప్ప !!

చిన్న సందేహం ఎవరైనా తీర్చగలరేమోనని ఈ చిన్ని టపా !!

Filed under: Uncategorized — madhujanjur at 6:47 am on Tuesday, August 18, 2009

చిన్న సందేహం ఎవరైనా తీర్చగలరేమోనని ఈ చిన్ని టపా !!

ఈ రొజు ఏప్రిల్ 1 విడుదల పాటలు వింటున్నా, ఎందుకో గాని వంశీ గారి ప్రొపైల్ నచ్చింది ..ఎందుకంటారా…

ఎన్ని కథలు వ్రాశారు, ఎన్ని సినిమాలు తీసారు !!

ఊసులో లేనివన్నీ పక్కన పెట్టండి…ఇలా వచ్చి అలా మనసులను తాకని వాటిని వదిలి పెట్టండి !

తను తీసిన సినిమాలు,కథలు …..చరిత్ర తిరిగి వ్రాయక పొవచ్చు గాక…..

కానీ నిజం మాత్రం అప్పుడప్పుడు చూసి నవ్వుకోవచ్చు…నిజాయితీగ.. కథలు చదువుకొని మనసు తేలిక పరచుకోవచ్చు….నిరభ్యంతరంగా

మరి పేద్ద పేద్ద మహానుభావుల్ని చూసే భాగ్యం కలిగిన సుత్తి ఆడియో పంక్షన్స్ లొ చూడలెక పొయా !!

స్కొత్వర్ష తొ నిండిన, ఈర్ష్యా,ద్వేషాలు కలగలిసిన “ఉత్సవాలలొ” కూడ చూడలేక పొయా !!

పట్టుమని పది రొజులు ఆడని విజయోత్సవ వేడుకలలొనూ ఎక్కడా కనిపించలా ఈ “జీవి”

ఏ డైలీ పేపర్ లొనూ తన ఇంటర్వూ చూడలే ఆదివారం సప్లిమెంట్స్ లొనూ/పన్ డే లొనూ(ఎవరికీ పన్ డే ?? :) ) వెతకి వెతకి చూసిన కానరాలే !!

ఊరకే పని పాట లేక పొగిడింపు కార్యక్రమాలు పెట్టుకొంటారే అలాంటి కార్యక్రమాల్లొనూ కనిపించడెందుకని ?

మీకు ఎక్కడైన కనిపించినపుడు నాకు చెప్పడం మరవకండేం ?

 అంతవరకు నేను ఈ పాట ని హం చెసుకొంటూ ఉంటా ‘ ఎదిగిన కొద్ది ఒదగమని….”

మనలొ మాట .. ఇలా వేరే ఎవరన్న ఉన్నారా మహానుభావులకి అర్థం చెప్పిన తెరవెనుక మనుషులు ??

 

RTS Perm Link


 

RTSMirror Powered by JalleDa