!! ఢిల్లీ లొ కూడ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండీ !! ఫార్ట్(ర్టీ) 2 !!
!! ఢిల్లీ లొ కూడ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండీ !! ఫార్ట్(ర్టీ) 2 !!
మరుసట్రోజు పని ఎక్కువైంది. ఏం చెయ్యాలి ? ఈ ఇనెప్లేషన్ ప్రభావం నాకు ఈ రోజు తెలిసొచ్చింది. తక్కువ మందిమి పానెల్ లొ ఉన్నాము. ఎక్కువ కాండిడేట్స్ వచ్చేశారు. ఊహు ! అలాగ రప్పించారు మరి !!
లంచ్ సరిగా తినకుండా పని చేసాము. మరి సాఫ్టువేరా ఉద్యోగమా మజాకా…
సాయంత్రం రానే వచింది. మూన్నెళ్లకో హిట్టు సినిమా ల్లాగా !!
తొందరగా రూము కి వెళ్లి కార్యక్రమం ప్రారంబిద్దాము అనుకొనేలోపు, బాసు గాడు పరిగెత్తుకు వచ్చేసాడు… తనూ రుచి మరిగిన పిల్లి కదా మరీ.
ఇక మొదలైంది తిప్పలు ! ఏది తీసుకొవాలి !! ఎంత తీసుకొవాలి అని !!!
అనేక తర్జనభర్జనలనంతరం (మీకు కావాలనుకొంటే గ్రూప్ డిస్కషన్స్ అని మార్చుకోండి) అన్నీ కొనేసుకొన్నాకా … రూము కి పరుగెత్తేము… స్కూల్ వదిలిన వెంటనే ఇంటికి పరుగెత్తే పిల్లొళ్ల లాగా !!!
ఇక్కడ మొదలైంది బాసు గాడి బాసిజం $$
నేనూ నా ప్రెండ్ కూర్చున్నాక అరగంట తరువాత వచ్చాడు. ఆత్రం మరియూ బి.పి ఎక్కువై నా ప్రెండ్ ఆ లోపల వాడిని బండబూతులు తిట్టెశాడు., బయట్నించి విన్నాడనుకొంటా.. మొహం అదోలా పెట్టుకొన్నాడు.
ఆ మొహం చూస్తే నాకొకటి గుర్తు వచ్చింది !
{
చిత్తూరులో చదువుకొనేటప్పుడు బస్ స్టాండ్ కి వెళ్లాలంటే నా ప్రెండ్ మొహం అలాగే అయ్యేది. ఎందుకంటే బస్ స్టాండ్ కి వెళ్లే దారికిరువైపులా యూరినల్స్ చెసేవాళ్లు . ఆడవాళ్లు వెళుతున్నా ఎవరూ పట్టించుకొనేవారు కాదు. అందుకే నా ప్రెండ్ కి ఆ ప్రాంత మంటే అసహ్యం.(ఈ విషయాన్ని నేను చాలా బస్ స్టాండ్ ల దగ్గర గమనించాను )
}
ఇక సమరం మొదలు పెడదాము అనుకొనేలోపు, బట్ట తల వెధవ టి.వి రిమోటు తీసుకొని బెంగళూరు పేలుళ్ల సోది మొదలెట్టేడు. అది వింటే ఇంపర్మేషన్ విన్నట్టు లేదు …శాంతి స్వరూప్ వార్తలు చదువుతున్నట్తుగా ఉంది.
ఆక్కడేదో మాకు ఎమీ తెలియనట్టు అంత తనకే తెలుసనట్టు..బోడి గుండు వెదవ…
నస భరించలేక నా ప్రెండ్ తనని కొట్టేస్తాడెమోనని భయపడి కేప్ ఓపెన్ చేసాను..
‘నరుకుతారా వెదవ ‘ అని అన్నట్టు వినిపించి బాసు గాడి వైపు చూసాను సందేహంతొ ??
డౌటు లేదు వాడే నన్ను కొరికేసెలా చూశాడు సారీ చూస్తున్నాడు. వాడి కక్ష ఇంకా తీరలేదు మరి..
అంతే ఇక నేనూ వాడికి విలను అయిపొయాను.
మధు నాకు వద్దయ్యా, ఎంటో కొద్దిసెపట్నించి తలనొప్పి ఎక్కువుగా ఉంది. అమృతాంజనం ఉంటే ఇవ్వు అని అడిగాడు. నా దగ్గర ఎందుకు అమృతాంజనం ఉంటుందో అర్థం కాక వాడి వైపు నిస్సహాయంగా చూసాను.
అంతే ! నన్ను పూర్తిగా అర్థం చేసుకొన్నవాడిలా….
ఓహొ, నీ దగ్గర లేదా, సరే అలా బయటికి వెళదాము రా. వెళ్ళి తీసుకొని వస్తాము అని చెప్పాడు… కాదు కాదు హుంకరించాడు.
(మీకు కావలనుకొంటే బుసలు కొట్టాడు, గాండ్రించాడు, గట్టిగా అరిచాడు లాంటివి ఏదన్న అనేసుకోండి)
నా పరిస్థితి ఎంటో నాకే అర్థం కాలేదు.
రంభ, మేనక నాట్య మందిరాలనుంచి నన్ను బయటికి ఈడ్చుకొని వెలుతునట్టు ఓ పీలింగ్ !!
ప్రెండ్ వైపు చూసాను ఎమీ చెయ్యలెక, తన పరిస్థితి అలాగే ఉంది పాపం..
ఎదుటి వారికి తెలియకుండా ఏడవడమంటే ఇదేనేమో !! ఎమీ చెయ్యలెక గుడ్ల నీరు కక్కుకొంటూ బయటికి మాత్రం సన్నని చిరునవ్వుతొ వెళ్ళాను…
ఇలాంటి స్థితి ఎవరికీ రాకుండా చూడు దేవుడా అని మొక్కుకుంటూ బయల్దేరేను వాడి వెంట గంగమ్మ దగ్గరికి వెలుతున్న ‘ మేక ‘ వలే ….
ఇక రోడ్ల మీద పడ్డాము లేని తలనొప్పికి కావాలనుకొనే అమృతాంజనం కోసం
నా అదృష్టం బాగునట్టుంది,,కొంచెం దూరము గా మెడికల్ షాపు కనపడింది…నలభయ్యెళ్ళ బ్రహ్మచారికి ‘ తెల్ల కోక ‘ కనపడ్డట్టు.
వెల్లి బాము తీసుకొన్నాము…వాడు చిల్లర తీసుకొనే లోపు ఆత్రముగా గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటె నా ఆశలన్నీ నాగర్ఝున సాగర్ లో కలిపేసె మాట ఒకటి చెప్పేడు.
( మేకలకి, బ్రహ్మచారులకి ,శాంతి స్వరూప్ అభిమానులకి క్షమాపణలు తెలుపుకొంటూ చివరి బాగం వచ్చే వారం లో )