తిరుపతి ఈస్టు రైల్వే స్టేషను

చీకటిలేదంటారా ? మరి చిరుదివ్వె ఎందుకండీ !! చేతి చమురు వదలడానికి తప్ప !!

సాక్షి - డబుల్ ధమాకా !!

Filed under: Uncategorized — madhujanjur at 9:30 am on Friday, November 21, 2008

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకలాంటి ఆవేదనతో ఈ రాతలు–

సాక్షి - డబుల్ ధమాకా !!

నిజ్జం గానే రామోజి రావు గారికి రెండు రకాలు గా ఇది లాభం చేస్తుంది.

1. ఇలాంటి తల తిక్క, వెర్రి వెంగలప్ప ని పెట్టుకొని ఇన్ని రోజులు ( సంవత్సరాలు ) ఈ టివి బాద్యతను అప్పగించి ఒక్క చానలు వల్ల మొత్తం పరువు మంటగలిసిపొకుండా బయటకు పంపించి మంచి చేసి కొన్ని మంచి కార్యక్రమల్ని మనల్ని చూడనివ్వటం .

2. రామోజి ని గురించి నిజాయితిగా ఉన్నదున్నట్టు చెప్పడం. ఎవరు ఎలాంటి  వారొ వాళ్ళే చెప్పేస్తున్నారు …సాక్షి మొదలైన తరువాత నిజమైన ఇంటర్వూ ఇదొక్కటే… 

ఎమంటారు ?? ఒక్క విషయం  గమనించారా ఇంటర్వూ చెసే ఆవిడ  అడిగిన ఒక్క ప్రశ్న ?
 
- మీకు ప్రభాకర్ కి ఎలాంటి రిలేషన్ షిప్ అని ? 

RTS Perm Link

!! ఢిల్లీ లొ కూడ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండీ !! ఫార్ట్(ర్టీ) 2 !!

Filed under: Uncategorized — madhujanjur at 5:07 am on Wednesday, August 27, 2008

!! ఢిల్లీ లొ కూడ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండీ !!  ఫార్ట్(ర్టీ)  2  !!      

మరుసట్రోజు పని ఎక్కువైంది. ఏం చెయ్యాలి ? ఈ ఇనెప్లేషన్ ప్రభావం నాకు ఈ రోజు తెలిసొచ్చింది. తక్కువ మందిమి పానెల్ లొ ఉన్నాము. ఎక్కువ కాండిడేట్స్ వచ్చేశారు.  ఊహు ! అలాగ రప్పించారు మరి !!    

లంచ్ సరిగా తినకుండా పని చేసాము. మరి సాఫ్టువేరా ఉద్యోగమా మజాకా…

సాయంత్రం రానే వచింది. మూన్నెళ్లకో హిట్టు సినిమా ల్లాగా !!        

తొందరగా రూము కి వెళ్లి కార్యక్రమం ప్రారంబిద్దాము అనుకొనేలోపు, బాసు గాడు పరిగెత్తుకు వచ్చేసాడు… తనూ రుచి మరిగిన పిల్లి కదా మరీ.

ఇక మొదలైంది తిప్పలు ! ఏది తీసుకొవాలి !! ఎంత తీసుకొవాలి అని !!!

అనేక తర్జనభర్జనలనంతరం (మీకు కావాలనుకొంటే గ్రూప్ డిస్కషన్స్ అని మార్చుకోండి) అన్నీ కొనేసుకొన్నాకా … రూము కి పరుగెత్తేము… స్కూల్ వదిలిన వెంటనే ఇంటికి పరుగెత్తే పిల్లొళ్ల లాగా !!!

ఇక్కడ మొదలైంది బాసు గాడి బాసిజం $$
నేనూ నా ప్రెండ్ కూర్చున్నాక అరగంట తరువాత వచ్చాడు. ఆత్రం మరియూ బి.పి ఎక్కువై నా ప్రెండ్ ఆ లోపల వాడిని బండబూతులు తిట్టెశాడు., బయట్నించి  విన్నాడనుకొంటా.. మొహం అదోలా పెట్టుకొన్నాడు.

ఆ మొహం చూస్తే నాకొకటి గుర్తు వచ్చింది !
{
చిత్తూరులో చదువుకొనేటప్పుడు బస్ స్టాండ్ కి వెళ్లాలంటే నా ప్రెండ్ మొహం అలాగే అయ్యేది. ఎందుకంటే బస్ స్టాండ్ కి వెళ్లే దారికిరువైపులా యూరినల్స్ చెసేవాళ్లు . ఆడవాళ్లు వెళుతున్నా ఎవరూ పట్టించుకొనేవారు కాదు. అందుకే నా ప్రెండ్ కి ఆ ప్రాంత మంటే అసహ్యం.(ఈ విషయాన్ని నేను చాలా బస్ స్టాండ్ ల దగ్గర గమనించాను )

}

ఇక సమరం మొదలు పెడదాము అనుకొనేలోపు, బట్ట తల వెధవ టి.వి రిమోటు తీసుకొని బెంగళూరు పేలుళ్ల సోది మొదలెట్టేడు.  అది వింటే ఇంపర్మేషన్ విన్నట్టు లేదు …శాంతి స్వరూప్ వార్తలు చదువుతున్నట్తుగా ఉంది. 

ఆక్కడేదో మాకు ఎమీ తెలియనట్టు అంత తనకే తెలుసనట్టు..బోడి గుండు వెదవ…

నస భరించలేక నా ప్రెండ్ తనని కొట్టేస్తాడెమోనని భయపడి కేప్ ఓపెన్ చేసాను..

‘నరుకుతారా వెదవ ‘ అని అన్నట్టు వినిపించి బాసు గాడి వైపు చూసాను సందేహంతొ ??

డౌటు లేదు వాడే నన్ను కొరికేసెలా చూశాడు సారీ చూస్తున్నాడు. వాడి కక్ష ఇంకా తీరలేదు మరి..

అంతే ఇక నేనూ వాడికి విలను అయిపొయాను.

మధు నాకు వద్దయ్యా, ఎంటో కొద్దిసెపట్నించి తలనొప్పి ఎక్కువుగా ఉంది.  అమృతాంజనం ఉంటే ఇవ్వు అని అడిగాడు. నా దగ్గర  ఎందుకు  అమృతాంజనం ఉంటుందో అర్థం కాక వాడి వైపు నిస్సహాయంగా చూసాను.
 
అంతే !  నన్ను పూర్తిగా అర్థం చేసుకొన్నవాడిలా….  

ఓహొ, నీ దగ్గర లేదా, సరే అలా బయటికి వెళదాము రా. వెళ్ళి తీసుకొని వస్తాము అని చెప్పాడు… కాదు కాదు హుంకరించాడు.

(మీకు కావలనుకొంటే బుసలు కొట్టాడు, గాండ్రించాడు, గట్టిగా అరిచాడు లాంటివి ఏదన్న అనేసుకోండి)

నా పరిస్థితి ఎంటో నాకే అర్థం కాలేదు.

రంభ, మేనక నాట్య మందిరాలనుంచి నన్ను బయటికి ఈడ్చుకొని వెలుతునట్టు ఓ పీలింగ్ !! 

ప్రెండ్ వైపు చూసాను ఎమీ చెయ్యలెక, తన పరిస్థితి అలాగే ఉంది పాపం..

ఎదుటి వారికి తెలియకుండా ఏడవడమంటే ఇదేనేమో !! ఎమీ చెయ్యలెక గుడ్ల నీరు కక్కుకొంటూ బయటికి మాత్రం సన్నని చిరునవ్వుతొ వెళ్ళాను… 

ఇలాంటి స్థితి ఎవరికీ రాకుండా చూడు దేవుడా అని మొక్కుకుంటూ బయల్దేరేను వాడి వెంట గంగమ్మ దగ్గరికి వెలుతున్న ‘ మేక ‘ వలే …. 

ఇక రోడ్ల మీద పడ్డాము లేని తలనొప్పికి కావాలనుకొనే అమృతాంజనం కోసం  

నా అదృష్టం బాగునట్టుంది,,కొంచెం దూరము గా మెడికల్ షాపు కనపడింది…నలభయ్యెళ్ళ  బ్రహ్మచారికి ‘ తెల్ల కోక ‘   కనపడ్డట్టు.

వెల్లి బాము తీసుకొన్నాము…వాడు చిల్లర తీసుకొనే లోపు ఆత్రముగా గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటె నా ఆశలన్నీ నాగర్ఝున సాగర్ లో కలిపేసె మాట ఒకటి చెప్పేడు. 

( మేకలకి, బ్రహ్మచారులకి ,శాంతి స్వరూప్ అభిమానులకి క్షమాపణలు తెలుపుకొంటూ చివరి బాగం వచ్చే వారం లో )  

RTS Perm Link

!! ఢిల్లీ లోనూ నాకు సంపూర్ణ స్వాతంత్రం రాలేదండి !! ఫార్ట్ 1 !!

Filed under: Uncategorized — madhujanjur at 5:04 am on Wednesday, August 6, 2008

పోయిన వారము ఢిల్లీ కి వెళ్ళాం. శనివారము, ఆదివారము రెండు రొజులు ఇంటర్వూ పానెల్ లొ ఉన్నాము నేను, నా బాసు గాడు (బట్ట తల వెధవ), ఇంకొక కొలీగూ.  

మా ట్రావెల్ డెస్క్ మేడం కాస్ట్ కట్టింగు వల్ల రాత్రి ఫ్లైటు (09.45 పి.యం) బుక్ చెసింది.

తొందరగా ఢిల్లీ వెళ్లి స్వాతంత్రం కొందాము అని అనుకొన్నాను కాని, ఈ ట్రావెల్ డెస్క్ పిసినారితనం వల్ల నా ప్లాన్లు అన్ని మూలన పడ్డాయి. ఇక్కడ  స్వాతంత్రం అంటె ఎదో ఊహించుకొకండి. కొద్దిగా మందు పుచుకొవడం అన్నమాట. నా భార్యమణి గారు నాతో ఉంటే నాకు మందు కొట్టడానికి స్వాతంత్రం దొరకదు మరి.  

(మనలొ మాట : నిజ్జం చెపుతానండి, నేను మందు కొడితే మా ఆవిడ నన్ను కొడుతుంది, పూర్వ జన్మ పూజా ఫల ప్రభావమనుకొంటా !!)      

ఆందుకే ఎప్పుడైన  అలా  బయటికి వెళ్లే చాన్సు వస్తే  మందు కొట్టి ఎంజాయ్  చెయ్యాలి అనే తత్వం నాది.  

ఏం చెయ్యను ? ఈ రొజు పొతే పొయ్యింది రేపు తాగుదాంలే అని అనుకొని (శని వారం రాత్రి కి ఢిల్లీ లొనె ఉంటాము కదా అని నాకు నెనే ఓదార్చుకొని) బుక్ చెసుకొన్న టాక్సి లొ 05.30 కి ఇంట్లొనించి బయలుదేరాను. మధ్యలొ బట్ట తల వెధవని పిక్ చెసుకోవాలి మరి.   

నాకొక్క విషయం అర్థం కాలేదు , ఏరుపోర్టు ఇంత దూరం ఉంటె ఎవరికి లాభం? (బెంగళూరు ఏరుపోర్టు ఈ మధ్య మారింది లెండి, అనంతపూర్ దగ్గర్లోకి) టాక్సి వాళ్ళకు తప్పించి.   

భల్లూకపు  ట్రాపిక్ చూస్తునే కళ్ళు తిరిగినంత పని అయ్యింది.

బెంగళూరు లొ ఆసలు ఈ ట్రాపిక్ ఎందుకు ఇంత చండాలం గా ఉందొ నాకైతె అర్థం కాదు. 1996 నించి బెంగళూరు లొనే ఉన్నాను మరి , మధ్య మధ్యలొ ‘మధ్యప్రాచ్యం’ చూసి రావడం తప్ప !!
ఆ 1996 ప్రశాంతత తలుచుకొని నాలొ నెనే కుమిలి ఒక్క సిగెరెట్టు తాగి ఆ కొపాన్ని  పొగ రూపం లొ బయటకు వదిలెశాను.
ఇంతలొ బాసు గాడి ఇల్లు వచ్చింది.

వాడి నవ్వు, వాడి తల …ఛీ ఛీ వెదవ బ్రతుకు అనుకొని సాప్ట్ టెకి స్ట్య్లెల్లొ విష్ చెశా ! .

సూట్ కేసు  డ్రైవర్ దగ్గర ఇచ్చేసి తన సహచరిణి కి టాటా చెప్పే పనిలొ మునిగిపొయాడు.

ఎందుకో తన మొహం ఛూడాలనిపించింది….చిత్రం గా వాడి కళ్లల్లొ  విరహరసం…

అనుకొన్నా.  ఇంత తొందరగా వీడు సీనియర్ మేనెజెర్ లెవెల్లొకి ఎలా వెళ్ళాడో   అని. ఇతనితో సినిమా తియ్యమని అమీర్ ఖాన్ కి మరియు కమల్ హాసన్ కి రెకమెండ్ చెయ్యలి, ఆ సినిమా కు ఆస్కార్  అవార్డ్ గేరంటీ గా  వచ్చేస్తుంది.     
        
కారు బయలు దేరింది.. నాలొ రక్తప్రసరణ కూడా వేగమందుకొంది కారు స్పీడ్ లాగే… 

ఆప్పటి వరకు నాలొ లొపల ఉన్న భయం నిజం అయ్యింది. 

మధు, నేను చాలా అలసిపొయానయ్యా. ఎన్ని పన్లు అబ్బ ఎన్ని టెన్షన్స్ ??? . ఈ క్లెంట్స్ నస తో వేగ లేక పొతున్నానయ్య. నేను కాబట్టి చేస్తున్నాను,  వెరే  ఎవరైతె ఈ పని అయ్యేనా ??  (ఈ  సొది కన్న నాకు ఆడియొ సభల్లొని స్కొత్కర్ష నయం అనిపించింది )

బాసు గాడి గొంతు కొద్ది విరమించి అప్పుడే ఎదో  వెదుకుతున్నట్టు గా అరెరె సిగరెట్టు మర్చిపొయానొయ్ 

ఒక సిగరెట్టు ఉంటే ఈవయ్య మధు అని అడిగాడు.
వెదవ సచ్చినొడు,  ప్రతి రొజు నాకు ఈ సంగతి తెలుసు. వాడి బార్య వాడు సిగరెట్టు తాగుతున్నాడని తెలిస్తే దోస గరిటని స్టవ్ మీద కాల్చి వాడి  మూతి మీద వాత పెట్టేస్తుంది.
 
నాకెందుకో డౌటు ఎప్పుడో నిజ్జం గానె అలా వాత పెట్టెసింది అని. వాడి మొహం అలాగే ఉంటుంది లెండి. 

ఏరుపోర్టు చెరుకొనేలొపు అలా రెండు సిగెరెట్టు లాగి పారెశాడు. 07.15 పి.యం కల్లా ఏరుపోర్టు చేరుకొన్నాము. 

రెండు గంటలు వీడితొ ఎలా వేగాలొ అని బాదపడుతుంటె నా కడుపు వార్నింగ్ ఇచ్చేసింది. నాకు ఆకలి ఎక్కువ. ఒక రకం గా తిండిపొతుని. నాకు ఆకలి అని చెప్పి  నేరుగా ఏరుపోర్టు క్యాంటీను కి వెళ్ళి ఒక బిర్యాని పాకెట్టు పట్టుకొని వఛ్చేశాను.  (వాడి పర్మిషన్ కొసం చూస్తే పొదుపు చిట్కాలు చెప్తాడు  మరి)  

తనకీ లాలాజలం ఎక్కువైంది అనుకొంటా. తనూ వెళ్ళి తెచ్చుకొన్నాడు.

తన ప్లాన్ ఏంటంటే ప్లేన్ లొ తింటే డబ్బు కలిసి వస్తుంది అని…

నస కతలు వింటూ ఢిల్లీ చేరుకొన్నాము. తమాష ఏంటంటే నా కొలీగు దొరికిపోయాడు నా కపట నిద్ర వల్ల ప్లేన్ లో.
మేనేజర్ తో మందు భాగోతం  రెండవ బాగం లో………
      

RTS Perm Link

Naa Gurinchi Okkamaata

Filed under: Uncategorized — madhujanjur at 4:39 am on Tuesday, August 5, 2008

చాలా రోజులుగా అనుకొంటూ ఉన్నానండి. ఎలాగా మొదలు పెట్టాలి అని. ఇదిగోండి ఇలా బెంచ్ మీద కొఛ్ఛాక సమయం దొరికిందండి బాబూ….

రాసేస్తున్నాను కాచుకొండిక….

నాది చాలా ఈజీ గోఇంగ్ అండీ ! ఎంత అంటే , వీడెవడు పిచ్ఛి సన్యాసి అని మీరంటే,

ఎమీ మాట్త్ల్ల్నండీ బాబూ ! అంత మంచొడ్ని అన్నమాట

అన్నమాట ఏంటీ ! ఉన్న మాటే కదా !!!!!!!!!

RTS Perm Link


 

RTSMirror Powered by JalleDa