తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా ||తేనెల||
సాగర మేఖల చుట్టుకుని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు ||తేనెల||
గంగ జటాధర భావనలో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే ||తేనెల||
ఎందరొ వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని ||తేనెల||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై నడిపించ రావా ||అణువు||
మనిషే మనిషే కరిచే వేళా
ద్వేషము విషమై కురిసే వేళా
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలు చిలికి
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమర జీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించగ రావా ||అణువు||
జాతికి గ్రహణం పట్టిన వేళా
మాతృభూమి మొరుపెక్కిన వేళా
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించగ రావా ||అణువు||
వ్యాధులు బాధలు ముసిరే వేళా
మృత్యువు కోరలు సాచే వేళా
గుండెకు బదులుగ గుండెను పుదిగి
కొన ఊపిరులకు ఊపిరులు ఊది
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవా గుణం మాకందించ రావా ||అణువు||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
భారతదేశం మనదేశం భారతీయులం మనమంత
దేశసేవే మన కర్తవ్యం భారతమాతే మన సర్వస్వం
మమతా సమతలు మానవ విలువలు మన నడతలో చూపిన
మనదేశ ప్రగతి పదంలో మున్ముందుకు పోతుంది
మురిపాలను అందిస్తుంది
జాతి ప్రగతికి రూపునిచ్చి జగతి జనులకు శాంతినిచ్చి
మార్గాదర్శకమైన దేశం మరులు గొలిపే స్వర్గం
ఇదే మన భారతదేశం
దేశ ప్రజలను సేవిద్దాం దేశమాతను పూజిద్దాం
దేశదేశాల మన పేరు స్థిరంగా నిలుపుదాం.
RTS Perm Link
పయనించే ఓ… చిలుకా… ఆ…
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు ||పయనించే||
తీరెను రోజులు నీకీ కొమ్మకు
కొమ్మా ఏ చోటు వదలి
ఎవరికీ వారే ఏదోనాటికి
ఎరుగము ఎటుకో బదిలీ
మూడు దినాల ముచ్చటయే… ||2||
ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధాన… ||2||
చనుమా ధైర్యమె తోడు… ||పయనించే||
పుల్లా పుడక ముక్కున కరచి…
గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగిరెక్కలు
ఎండకు ఆరినవోయి
ఫలించలేదని చేసిన కష్టము… ||2||
మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెనువెంట… ||2||
త్యాగమే నీ చేదోడు ||పయనించే||
మరవాలి నీ కులుకుల నడలే…
మదిలో నయగారాలే ||2||
తీరని వేదన తీయని ముసుగే
శిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై… ||2||
లేవే కనికారాలే
కరిగీ కరిగీ కన్నీరై… ||2||
కడతేరుటె నీ తలవ్రాలే ||పయనించే||
గోడుమని విలపించేరే…
నీ గుణము తెలిసినవారు ||2||
జోడుగ నీతో ఆడిపాడి కూరములాడినవారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాక
ఎవడే తెలిసినవాడు ||పయనించే||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
శేషశైలావాస శ్రీవెంకటేశా
శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా…
శేషశైలావాస శ్రీవెంకటేశా…
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలుమంగకు అలుకరానీయకు ||2||
ముద్దు సతులిద్దరిని ఇరువైపుల జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి ||శేషశైలావాస||
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి ||2||
భక్తులందరు నిన్ను ప్రస్తుతించిపాడ
చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము ||2||
కరువుతీరా గాంచి తరియింతుమూ మేము ||శేషశైలావాస||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి? కలలే…! ||2||
నా కలలో నీవే కనబడితే
ఆ చొరవకు బలమేమి? మరులే…!
మరులు మనసులో స్థిరపడితే
ఆపై జరిగేదేమి? మనువు…!
మనువై ఇద్దరు ఒకటైతే
ఆ మనుగడ పేరేమి? సంసారం…! ||కనులు||
అల్లరి ఏదో చేసితిని
చల్లగ ఎదనే దోచితివి ||2||
ఏమీ లేని పేదనని
నాపై మోపకు నేరాన్ని ||2||
లేదు ప్రేమకు పేదరికం
నే… కోరను నిన్ను ఇల్లరికం ||2||
నింగి నేలకు కడుదూరం
మన ఇద్దరి కలయిక విడ్డూరం ||కనులు||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే ||2||
వగలరాణివి నీవే…
పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం ||2||
రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం
వగలరాణివి నీవే…
దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ ||2||
బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగలరాణివి నీవే…
కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే ||2||
వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే
వగలరణివి నీవే…
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే ||2||
తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనె లేవులే లేవులే
నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో ||2||
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె ||2||
దూరదూర తీరాలు చేరువైపోయె ||తావిలేని||
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ ||2||
రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే
ఓ… ||నన్ను వదలి||
తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగ
నీ మేని హొయలు నీలోని వగలు
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి
ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగే మేఘాలదాటి
కనరాని లోకాలు కనగా
ఆహా ఓహో ఉహు ఆ… ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే లేనులే
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే ||నా హృదయంలో||
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోనా
కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
చకోరమై నిను వరించి
అనుసరించినానే కలవరించినానే ||నా హృదయంలో||
నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే ||2||
పల్లవిగా పలుకరించరావే ||2||
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే ||నా హృదయంలో||
ఇక్కడ నుండి ఈ పాటను వినండి
RTS Perm Link
ఇటీవలి వ్యాఖ్యానాలు