ఈ విశాల ప్రపంచంలో ఈ భూమి ఎంత?
అందులో మనిషి ఎంత? నేనెంత?
నాలో నా ఎడమ కాలి బొటని వేలు గోరెంత?
దీని గురించా నేను ఎప్పుడూ అందమైనదని,
పదునైందనీ పొగుడుకుంటూ ఉంటాను!
ఛీ! దీనిని చూపించా ప్రపంచాన్ని బయపెట్టాలని చూశాను
తెలియక బయపెట్టానే అనుకో ఎందుకు ఈ ప్రపంచం బయపడాలి?
చివరకి అర్థం అయింది. భయం గోరుతో కాదు
మానవ మనో వెలితుల వల్లనే
ఈ వెలితులే మనిషిని శాసిస్తున్నాయి
ఎంతో వికాసంతో, మానవత్వంతో, స్వేచ్చతో గడపాల్సిన మనిషి
వెలితుల గుప్పిట్లో బంధీ అయి ఉన్నాడు
నా తిక్క మనసుకి ఏదో అర్థం అయిందని అనుకున్నాను
కానీ ఈ తిక్క ఎప్పటికీ వదలదనే నగ్న సత్యం నన్ను హతాశుడిని చేసింది
ఈ వెలితి శాశ్వతమా? ఇది అనివార్యమా?
సత్యం తెలిసింది కాబట్టి గోరు బయపెట్టక పోవచ్చు!!!
కానీ తల వెంట్రుక కొన బయపెడుతుందేమో!!!
బయపెడదామా మరి? ఇంకెందుకు ఆలస్యం!!!
నాకీ తిక్క వదలదా?
ఈ తిక్క నాకు శాశ్వతమా?