ప్రియా
ప్రియా
ఓ వైపు నీమది మరోవైపు నిధి
వీటిలో నాకేం కావాలో తెలుసా
ఓ సారి నా కళ్ళలో చూడు తెలుస్తుంది.
* * * *
ఎందుకే నన్నంతగా ప్రేమించావు
నా అనుభూతిని తెల్పను
నాకు మాట రావటం లేదు
ఓ కన్నీటి బొట్టు తప్ప
* * * *
నువ్వు, నేను ఒక్కటైతే
ఏమౌతుందంటావా
వెన్నల్లో ఇంద్రదనస్సు
నీకు చూడలునుందా
* * * *
వెన్నల కురిసి అలసినా
జాజులు విరిసినా నీ
నవ్వు కంటే
అందంగా వుంటుందా
===============
ప్రియా
ఎంటే ఈవేళ
అన్నీ నీ ఆలోచనలే
నిరంతరం నాలో
* * *
నిన్నయితే
విడిచివున్నా కాని
నీ జ్జాపకాలను,
నీ చిరునవ్వును కాదు
* * * *
ఓ సారి నిన్ను
గుండెలకు హత్తుకు
నినిన్నే చూస్తు
ఎన్నో చెప్పాలనుంది
* * * *
అసలందుకే
ఈ దూరం నీకు,
నాకు మధ్య
===============
ప్రియా
అదేమిటే గుండె నిండా నువ్వేనైతే
నే గుర్తున్నానా అంటావు
నా ప్రాణం నువ్వే కదా
* * * *
బందరు లడ్డంత తియ్యగా వుంది
నీ వాలుచూపు, అది
నా గుండెల్లో ఎంత
గుబులు రేపిందో చూడు
* * * *
గుట్టుగా వుండాలని
గుసగుసలాడితే
సిగ్గులేదా అని
చిన్నబుచ్చుతావేంటే
* * * *
సోగ కళ్ళు
నీ సోగసును పెంచితే
నాలో మోహం
నీపై ఆశను పెంచింది.
===============
ప్రియా
అందమంతా నీదైతే
ఆయనెవరో బాపు బొమ్మను చూడమంటాడు
కృష్ణశాస్త్రి కవితను చదవమంటాడు
* * * *
నే చెప్పిన మాటకి
నీ బుగ్గలైతే
తొలిసంద్యలో
విరిసిన కలువలయ్యాయి
* * * *
ఎంత తియ్యగ వుందే
జీవితం, నువ్వుంటే
లక్షరోజుల లంకణమైనా
లక్షణంగా వుంటాను
* * * *
యమునా తటిలో
రాధలా నువ్వుంటే
నేను వెన్నదొంగలావేడుక
చూసానంట, రాత్రంతా అదే కల.
==================
ప్రియా
నీ అందం విరిసిన మందారం
నిగ్గ గుచ్చిన పూల సరం
వున్నమాటంటే, ఊరుకోవేం
* * * *
నిన్న నిన్ను చూసి
బాపు బొమ్మన్నాడు బాజి
ఈ బొమ్మకు బొరుసును
నేనే కదా
* * * *
గాలి నిండా గందం
నీ మాట
నువ్వు నిండిన గుండె
నా కోట
* * * *
గతమంత మధురం అని ఆయనంటే
బవిశ్యత్తంతా బంగారం అనిఈయనన్నాడు
నాకివన్నీ తెలియలేదేం
నువ్వున్నువనా
=======================
ప్రియా
నింగిలోని నీటికి ఎంత ఆశ
నిన్ను తడమాలని, ముత్యాల చినుకులు
నిను ముద్దడుతుంటే, ఎంత ముద్దుగా వున్నవే
* * * *
ముంగిలి ముందు
రంగుల ముగ్గు
బుగ్గలు నొక్కుకుంది
నా సరసన నిన్ను చూసి
* * * *
నిన్ను పోల్చమంటె కష్టమేనే
ముద్దబంతులు, మువ్వలసడులు
విరిసిన మల్లెలు, కురిసిన జల్లులు
అన్నీ కలిసి నువ్వేనాయే
* * * *
పగలైతే పగటి కలలు
మరి రాత్రయితే
ఇంకా చెప్పాలా
నిన్ననే కదే నిన్ను చూసింది.
==================
ప్రియా
వెన్నలై నీపై వాలి
నీ సిగ్గు దొంతరలను
పెదవులతో అద్దాలని ఆశ
* * * *
నీ చిరునవ్వుల
సుగందాలు, చిలికావేమో
ఓ సమ్మొహన కెరటం
నను ముంచేసింది
* * * *
అమౄతమంటి నీ ప్రేమను
పంచావు, నాకు అందుకే
నీ హౄదయంలో
నా ప్రాణముంచాను
* * * *
చిగురాకుల సవ్వడిలా
నీ నడక
సెలయేటి గలగలలా నీ నవ్వు తో
నన్ను కట్టేస్తున్నావు .
===================
ప్రియా
అదేంటే నీకుపడిశం పడితే
నాకు ఊపిరి అడటం లేదు
నేనే నువ్వాయ్యాన
* * * *
నీ పేరులో ఎంత మధువుందే
పిలిచిన ప్రతిసారి
పెదవెంత తియ్యగా
తగులుతుందో తెలుసా.
* * * *
చీకటంత బాదలోనీ జ్ఞాపకం
ఓ చిరు దీపం
ఇన్ని మరిపించేదినీ
చిరునవ్వే తెలుసా.
* * * *
ఈ తోటలో ఇన్ని పూలున్నాయని
నేనెప్పుడు చూశాను
సన్నజాజి లాంటి
నీ సొగసు తప్ప
==================
ప్రియా
ఇన్ని పూలు విరబూస్తే
నీ నవ్వు చిన్నబోతుందనుకున్నాను
అవేంటే తలలొంచుకున్నాయి.
* * * *
నువ్వు నాకోసమే కదటే పుట్టింది
మరి నువ్వక్కడ
నే నిక్కడ ఎంటే
నీలో నన్ను కరిగిపోని.
* * * *
ప్రతి రోజు నేనొక పువ్విస్తాను
దానికి నువ్వో నవ్విస్తావు.
మరి ఈరోజు పండిస్తాను
దానికి నువ్వేం ఇస్తావు
==============
ప్రియా
ఇది పెదవేకదా
మధువెమోనని
అనుమానంనిజమేనా
* * * *
నా ప్రెమంతా నీదైతే
ఇంకేం మిగిలిందే నాలో
నీ ఊసు, రూపు తప్ప
ఎప్పటికి ఇంతేనా
* * * *
ఇన్నడిగినా
జవాబు రాదేమిటే
తళుక్కున మెరిసె
నీ చిరునవ్వు తప్ప
=================
ప్రియా
నిరాశ ఎందుకే
నన్ను చూడలేదని
నీతొ నేను నీడలా వున్నా
* * * *
నీ ఊహ వస్తే చాలు
నా మనసు వికసిస్తుంది
నీ జ్జాపకల పరిమలాలతో
* * * *
ఇదుగో నా చిరునవ్వు
నీ వాలు చూపుకి బదులు
మరి నీ చిరునవ్వుకు బదులేది
నాలోపులకరించిన హ్రుదయం తప్ప
* * * *
శిశిరిమా ఇది
ఆయినా నా అశలు చిగురిస్తున్నాయి
నీ అనురాగపు మబ్బులు వురిసి
నీ ప్రేమలో నిండా తడిసి.
===================
ప్రియా
నాకు లోకమంతా చీకటీ
అందులో వెలుగుతూ నువ్వు,
నవ్వుతూ నేను
* * * *
వెన్నెలంతా నీ చిరునవ్వే
అందులో ఆడుతూ నేను
ఇదే నువ్వు చెప్పాలని
ఎంత సేపటినుంచున్నానో
* * * *
నాకు మాటరావటం లేదు
నీ కళ్ళలో చూస్తుంటె
ఇలా ఎప్పటికి చూస్తుంటావా.
===================
ప్రియా
సందేహమా
నేనే నాకు గుర్తుండను తెలుసా
నీ సమక్షంలో
* * * *
నువ్వుంటే
భయంలేదు, భాదలేదు
బెంగలేదు, బెదురు లేదు
నీపై ప్రేమ తప్ప
* * * *
ఓ సారి నీ కన్నులు
మరో సారి నీ పెదవులు
నన్ను పిలుస్తున్నాయి
చక్కని నీ చెక్కిలి తడమను.
* * * *
ప్రేమా
అది మాయో, మంత్రమో
తీపో, చేదో
ఏమో నాకేం తెలుసు.
నన్నడిగితే నువ్వని చెప్తాను.
================
ప్రియా
నిన్న నిన్ను చూడాలని
నీ చెంత కొస్తే
నువ్వు, నా కోసం వెళ్ళావట.
* * * *
నువ్వు, నేను
పున్నమి కలువలైతేదూరంగా వుంటామని
తారా, చంద్రులమన్నాను
నీకు సిగ్గేసిందా
* * * *
ఇన్ని రోజుల
నీప్రేమను తలుచుకుంటే
నను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
ఇంతకు వింటున్నువా…