నా చెలి
నా హృదయంతరాలలో
విరబూసిన కమలంలో
తడి ఆరని పెదవుల్లో
కౌసర్ కన్నుల్లో
హిందోళపు రాగంలో
తుషారపు భాష్పాల్లో
భాస్కరుని రుదిరపు వర్ణంలో
ఆ నెలవంక చాయలో
సౌగందిక పుష్పంలో
హంస నడకల్లో
మంచు శిఖరాల్లో
మదుర కావ్యాల్లో
సుమదుర గీతాల్లో
ఎటుచూసినా నా చెలి ప్రతిరూపమే.
=====================
అది పండువెన్నల
ఆ పండు వెన్నెల్లో
ఇసుకతిన్నెలపై
ఈ మంచులో
ఉరకలు వేసే చిరుగాలి
ఊరుకోక
ఋతువును మార్చింది
ఎందుకో
ఏమిటో
ఐనా నాలొ ప్రేమ ఋతువుమారలేదు
ఒట్టి ఋతువేకాదు ఆమె రూపం కూడా
ఓ రోజు
ఔనన్నా కాదన్న
అందరు ఒప్పుకున్న ఒప్పుకోకపొయినా
అఃహల్య తోనా వివాహం జరుగుతుంది.
========================
నేను నీ చెంతనున్న వేళ
కాలం నాదరి చేరనీకే
మన ఘడియ ఏకాంతవేళ
ఓ యుగంలా ఉండిపొతే
నీ ఒడిలో నీమోమును చూస్తు
నీ పిపాసిలా ఉండిపోతాను
సందె చిరుగాలి తాకి
విరిసిన మల్లెల నీ చిరునవ్వు
ఇక కాలంలేదంటు
ఇంటికెల్లిన వేళ
నాలో నిస్సహాయత
కాలంపై కక్ష కట్టింది
ఓ అనంత కాలం
నీ అపురూప సౌందర్యాన్ని
ఆస్వాదించాలని
నీలో లీనమైపోవాలని
నీలో ఎన్నడు తీరని ఆశ.
==============
నీ ఏకాంతం
చిగురాకుల వసంతం
నీ జ్జాపకం
నీటిలోని ప్రతిబింబం
నీ మౌనం
నిర్మానుష్య నిశిధి
నీ చిరునవ్వు
నింగిలోని విహంగం
నీ పలుకులు
సెలయేటి గలగలలు
నీ తనువు
సుగంద పరిమళం
నీ కన్నులు
మంచు ముత్యాల జల్లులు
నీ కురులు
జలపాతాల దారలు
నీ వయసు
చిగురించె రెమ్మలు
నీ అదరాలు
తేనెలూరే గులాబీలు
నీ సొగసు
మెరిసె పున్నమి వెన్నెలలు
కానీ, చెలి
నీ హ్రుదయం
ప్రేమలేని పాశానం.
=================
ఓ మేఘమా నా చెలిని చూడవే
నీవు లేని నెలవంక అందమది
అరవిచ్చిన మందారమొగ్గది
కార్తీకపు ప్రమిదది
పిండారబోసిన వెన్నలది
తన చిరునవ్వుల గాలితో
నను చుట్టేసింది
తన వలపు మత్తులో ముంచేసింది
తనను ఏమని చెప్పను
సన్నజాజుల గుబాళింపని చెప్పనా
తళతళ మెరిసే తారని చెప్పనా
సందె కాంతుల శొభని చెప్పనా
నా సర్వం తానని చెప్పనా
ఆ నయనాల నయగారం
మల్లెల సింగారం
ఆ అదరాల మదువు
మెరిసే తనువు
అన్నీ నాకొసమని ఆశగా చూస్తున్నా
ఆమె రాక, అదొక వసంతం
తనులేని ఏకాంతం
హేమంతపు చిరుగాలి
ఆమెలేని జీవితం
గ్రీష్మపు సూర్యతాపం
దూరాన తాను వస్తున్నట్టుంది
తేలిపోవే మేఘమా
తేలి చెంతరాకే మేఘమా..
====================
నీ కోసం
వెన్నల రాత్రిని
వేకువ జాముని
విరిసిన పగలని
ముసిరిన రాత్రిని
నిర్లిప్తంగా గడిపేస్తున్నా
నీ కోసం
చెదిరిన మనసుని
చివికిన బ్రతుకుని
జరిగిన కథని
తీరని వ్యదని
ఓర్పుగా భరిస్తున్నా
ఆజన్మాంతం అలసినా
ఆశలు సొలసిన
గుండెలు పగిలినా
గుర్తులు చేరిగిన
నాకోసం నిను మరువను.
=================
రావే నేస్తం
నా మనసాగకుంది
పదే నీకై పరుగుతీస్తుంది
నీ జ్జాపకాలు నను చుట్టెస్తున్నాయి
ఓ రోజు నీకై వస్తాను
నీ ప్రేమకై చూస్తాను
అందాక నా జ్జాపకాలు చెరిగిపోనీకు
అవే మన చెలిమికి సాక్ష్యాలు
నే మాత్రం నిను మరువలేను
కొత్త నీరు వచ్చాక నను మరిచిపోకే
నీ ముద్దుమాటలు నను విడిచిపోయే
నీవు లేక ఈకాలం మూగబోయే
నేనిక వుంటా నేస్తం
కాలం సాగిపోతుంది.
====================
ఆ రోజులెక్కడే చెలి
నీవు,నేను కలసిన వేళ
ప్రకృతి పులకించిందెందుకో
నీకై ప్రతిక్షణం నే వేచిన వేళ
నీ చిరునవ్వు కానుకిచ్చేవు
నీటి అలపై చందమామ రూపు
చేమంతులు విరిసిన నీ నవ్వు
నీకాటుక కన్నులు
నాకింకా గుర్తున్నాయి
నీవే నాప్రాణమంటు
నీ చెంత చేరిన వేళ
నీ ప్రేమతో నను బందించావు
ఎటూ కదలక నా హ్రుదయంలో వుండిపోయావు
నీవు ఘడియ దూరమైన వేళ
నే పడిన తపన గుర్తుందా
మరి ఈనాడు నీవులేక ఎలా వున్ననో..
========================
వచ్చేస్తున్నా చెలి
నీకోసం ఈ దిగంతాలు దాటి
నులువెల్లా నీటీ వెల్లువలా వస్తున్నా
సురీడు పారిపోయినా
చీకటి ముసుగులు దాటివస్తున్నా చెలి
నా మనసైతే ఎనాడో నినుచేరింది
నే వడివడిగా వస్తున్నా చెలి
తిధులెన్ని ఆపినా నీవైపే
ఆశగా వస్తున్నా, నీకై ఆలోచిస్తున్నా
స్వర్ణముఖి ఆపినా, సురలు వచ్చి ఆపినా
చీకటి ప్రాణం పోయేసరికి
నీ రాకకై వేచివుంటాను
నీ కాటుక కన్నులు, లేత అదరాలు
నను మరిచాయేమో
మరలా మనం ఒకటౌతాం
కలకాలం కలిసుంటాం..
===================
వచ్చేస్తున్నా చెలి
నీకోసం ఈ దిగంతాలు దాటి
నులువెల్లా నీటీ వెల్లువలా వస్తున్నా
సురీడు పారిపోయినా
చీకటి ముసుగులు దాటివస్తున్నా చెలి
నా మనసైతే ఎనాడో నినుచేరింది
నే వడివడిగా వస్తున్నా చెలి
తిధులెన్ని ఆపినా నీవైపే
ఆశగా వస్తున్నా, నీకై ఆలోచిస్తున్నా
స్వర్ణముఖి ఆపినా, సురలు వచ్చి ఆపినా
చీకటి ప్రాణం పోయేసరికి
నీ రాకకై వేచివుంటాను
నీ కాటుక కన్నులు, లేత అదరాలు
నను మరిచాయేమో
మరలా మనం ఒకటౌతాం
కలకాలం కలిసుంటాం..