సరే! బ్లాగు అయితే మొదలు పెట్టాను కానీ ఏమిటి రాద్దాము అని ఆలొచిస్తే శతకోటి విషయాలు తట్టాయి! అలా అని అన్నీ రాయగలిగేంత గొప్ప విషయాలు కావు. అసలే బ్లాగులోకం! స్వగతం కాదు కదా! మనసులో మాటలు ఠపీమని బయట పెట్టేయడానికి.అయినా సరే ఎలాగోలాగ ఏదో ఒకటి అర్జ్ంట్ గా రాసేద్దామని నడుము (అదే నండీ కంప్యూటెరు) బిగిన్చి రంగంలోకి దిగాను.
ఈ రోజున ఆనందం గురించి బ్లాగుదాం!
సెలవు నాడు కూడా ఆఫీసు పని చేస్తుంటే పిల్లాడు వచ్చి “అమ్మా నాతో ఆడవా” అని అడిగిన వెంటనే , పని ఆపేసి , కాగితపు ప్లేనులతో తనతో ఆడినప్పుడు ఆ చిన్నారి ముఖంలో వేయి వోల్టుల బల్బులాగ వెలిగిన వెలుగు కదా ఆనందం!
వర్ష్ పు తొని చినుకు నేల పై పడినప్పుడు వచ్చే వాసన కదా ఆనందం!
ప్లానిటోరియములో నక్షత్రాలను చూసి చిన్ననాటి తీపి స్మ్రుతులను తలుచుకుంటూ మైమరిచిపోవడము కదా ఆనందం!
రెగ్యులరుగా ఫోనులో మాట్లాడుతూ ఉన్నా , ఠంచనుగా ప్రతి సారీ “ఏమ్మా! ఎలా ఉన్నావు?” అని మమతానురాగలతో నిండిన తల్లితండ్రుల పలకరింపు కదా ఆనందం!
పక్షుల కలకలం , సూర్యుని ఉదయం, చల్ల ని పిల్లగాలి కి ఊగే లవలీ లతలు కదా ఆనందం!
అంతెందుకు అలసిసొలసి ఇంటికి వచ్చినవెంటనే “అమ్మా” అని పరిగెత్తుకు వచ్చే పిల్ల్లలు కదా ఆనందం!
ఆనందం మన చుట్టూనే తిరుగుతూ ఉంది! దానిని పొందడము మన ధ్రుక్పథముపై ఆధారపడి ఉంది! దైనందిన పనులలో పడి చిన్న చిన్న ఆనందాలను అనుభవించడం మర్చేపోకండి!
సర్వే జనా సుఖినో భవంతు!
RTS Perm Link