అమ్మా….. సంవన్ ఈజ్ మేకింగ్ మదర్ అర్త్ సిక్………..
……..
అని మా అబ్బాయి బాధతో అరిచాడు మేమందరమూ McDonald’s నుండి బయటకు వస్తుంటే. తీరా చూస్తే రోడ్డు మీద ఎవరో అరటి తొక్క, ఒక కవరు, స్ట్ర్ఱా పడేసారు. నిజమే నాన్నా. నీకు ఉన్న కనీస పాటి ఙానం కూడా వాళ్ళకి లేక పోయింది అని నేను కూడా వాపోయాను.
తరువాత అడిగాను ఇప్పుడు ఏమిటి చేద్దాం అని.ఆలోచించాడు. ఒక నిమిషం తరువాత నన్ను కూడా మళ్ళీ లోపలకు తీసుకు వెళ్ళి అక్కడ పని వాళ్ళకి ఆ చెత్త గురించి చెప్పాడు. వాళ్ళు కూడా ఏమీ అనకుండా వచ్చి శుభ్ర పరిచారు. మా వాడి మొహం విజయోత్సాహంతో వెలిగి పోయింది. నేను అడిగా నువ్వెందుకు శుభ్ర పరచలేదు అని. అప్పుడు అన్నాడు అమ్మా వాళ్ళకి చెప్తే మళ్ళా అలా జరగకుండా చూస్తారు అని. నేనూ ఆనంద పడ్డా. ఇప్పటికే కాదు ముందు ముందు కూడా అలా జరగకూడదు అని ఆలోచన వాడికి కలిగినందుకు. మంచిది బాబూ అంటే జవాబుగా వాదు అన్నాడు అసలు జనాలకి ఇలా మదర్ అర్త్ ని డర్టీ చేయొద్దు అని నేర్పిస్తే పోలా అని! అవును నాన్నా! ఇలానే కాదు చాలా మంది చాలా రకాలుగా భూదేవి ని కాల్యుష్యం తో నింపుతున్నారు.అందుకే మనము చేసే ప్రతి పనిలోను మనమె జాగ్రత్తగా ఉంటూ వేలైతే మన చుట్టు పక్కల వారి చేతా అలాగే చేయించగలిగితే భూదేవి తప్పకుండా శుభ్ర పడుతుంది బాబూ అని చెప్పా. వై నాట్ ష్యూర్ అమ్మా అని ఎంతో ఆత్మ విశ్వాసంతో వాడు చెప్తుంటే భలే ముచ్చట వేసింది.
నా చిన్నప్పుడు తాతయ్య రోజూ పొద్దున నిద్ర లేచి మంచం దిగే ముందర ఏదో శ్లోకం చదివి నేలకు నమస్కారం చేయడం చూసేదాన్ని. (అయిదేళ్ళ వయసులో) ఒక రోజున అడిగేసాను. ఎందుకు తాతయ్యా అలా చేస్తున్నారు అని. భూదేవికి నమస్కారం పెడుతున్నానమ్మా . నా పాదాలతో భూదేవిని తొక్కుతున్నందుకు క్షమించమని ప్రార్థన చేస్తున్నా అన్నారు ఆయన. నేను ఫక్కున నవ్వి అదేమిటి తాతయ్యా!భూదేవి, క్షమాపణ అని అంటున్నావు. భూమి అంటే ప్లానెట్ అర్త్ కదా. గొప్ప శాస్త్ర వేత్తవు నీకు తెలియదా ఏమిటి. మరి ఇలా మాట్లాదుతున్నావేమిటి అని నేనంటే ఆయన తప్పు లేదమ్మా. భూమి మనకి కావల్సినవి అన్నీ ఇస్తుంది కదా. నీకు ఇష్టమైన బొమ్మలకి కావాల్సిన ముడి సరుకు, జాం పండ్లు, ఉయ్యాల ఊగడానికి చెట్లు అన్నీ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుదు భూమిని దేవతా సమానంగా తలిస్తే తప్పేమిటి అని ఆయన నన్ను ఎదురు ప్రశ్న వేసారు. మన దగ్గర సమాధానం నిల్. అప్పుడు ఆయన అన్నారు ప్రతి వస్తువుని దాని యొక్క ప్రయోజనం గుర్తించి, దానిని గౌరవించాలి అని. ఎందుకో తెలియలేదు అప్పుడు గానీ నాకు భలే సిగ్గేసింది. సారీ తాతయ్యా ఇందాక తెలియక నవ్వాను అన్నా.
ఆ శ్లోకం గుర్తు లేదు. రోజూ నేనేమీ నేలకు నమస్కారం చేయట్లేదు. కానీ తాతయ్య మాటలు మాత్రం మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసాయి.ఆ మాటల్లో శారాంసాన్ని నా పిల్లలకు కూడా నేర్పిద్దామని నా ప్రయత్నం. మొన్న మా వాడి మాటలు విన్నాక అనిపించింది, చిన్న పిల్లలకి, మన పెద్ద వాళ్ళకి ఉన్న సివిక్ సెంస్ మనకి ఎందుకు లేదూ అని.
నాగప్రసాద్ Said,
July 24, 2009 @ 1:27 pm
భూమిపై పాదాలు మోపునప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని స్మరించాలి.
సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ||
viswakam Said,
July 24, 2009 @ 2:06 pm
చాలా ధన్యవాదములు. మా పిల్లలకి ఈ శ్లోకం అర్ధం చెప్పి తప్పకుండా నేర్పిస్తాను.