సంభాషణ – సంబంధము
మొన్నీ మధ్యన ఏవో ఉద్యొగాల ప్రకటనలు చూస్తుంటే అన్నింటిలోనూ ప్రధానము గా కనిపించింది “కమ్యూనికేషన్ స్కిల్ల్సు” బాగా ఉండాలి అని.ఆ! ఈ రోజుల్లో కూడా ఇలా అడుగుతున్నారేమిటి అని అనుకోకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే అనిపించింది ఈ రోజుల్లోనే ఇది బాగ అవసరము అని.
నేను మనము మన స్నేహితులతోనో, చుట్టాలతోనో చేసే సంభాషణల గురించి చెప్పట్లేదు.
మనిషి తన భావనలకు మాటల ద్వార రూపం దిద్దితే , ఆ మాటలను ఇతరులతో ముఖాముఖి పంచుకుంటే అది సంభాషణ అవుతుంది. (ఫోనుల్లొను మాట్లాడినా సంభాషణే అనుకోండి). కానీ ఈ రోజుల్లొ అంత తీరిక ఎవరికి ఉంది చెప్పండి. ఈమెయిలు వచ్చిం దగ్గరనుంచి మనకి తోచిన వేళలో చెప్పదల్చుకున్నది ఏదో అవతల వారికి చెప్పేయడమే. ఇహ SMSలు, ట్విట్టర్లు గట్రా ఉండనే ఉన్నాయి. ఇంన్స్టెంటు మెసెంజర్లు వచ్చిన దగ్గర నుండీ పక్క సీటులో కూర్చునే వారితో కూడా IM లే. మనము రాసిన దానికి స్పందన వస్తే నచ్చితే మనము ప్రతిస్పందిస్తాము. లే క పోతే లేదు. అవతల వారి హావభావలతో పని లేదు. అంతా వన్ వే ట్రాఫిక్.
పోనీ ముఖాముఖీ పరిస్థితి ఏమైన బావుందా అంటే అదీ లేదు. డాక్టరు దగ్గరకి వెళ్తే, పేషెంటుని పలకరించి, పేషెంటు మనోగతి బట్టీ , శరీరానికే కాకుండా మనసుకీ వైద్యం చేయడం…. ఎందుకు లెండి. జరిగే పని కాదు. నిమిషానికి ఎంత మంది పేషంట్లని చూస్తే అంత డబ్బులు వస్తుంటే, ఎవరు కాలం వృధా చేస్తారు? లాయరు దగ్గరకు వెళ్తామా. పొరపాటున వాళ్ళ్సు మనలని పలకరించి “హలో! ఎలా ఉన్నారు?” అని అడిగితే మనకి వళ్ళు మంట. పైగా టెంషను పెరిగి పోతూ ఉంటుంది. మరి నిమిషానికి ఇంత అని గుంజుంతుంటే మన డబ్బులే కదా వదులుతోంది.
నేను చెప్పొచ్చేదేమిటంటే ఈ రోజుల్లో మనిషికీ మనిషికీ మధ్య ఇంఫర్మేషన్ ఎక్స్ఛెంజ్ అవుతోంది తప్ప సంబంధము పెంపొందేటట్లు సంభాషణలు జరగట్లేదు.
ఎందుకిలా? దేనికోసం ఈ పరుగు, ఈ తాపత్రయం? ఆలోచించండి!