FireStats error : FireStats: Unknown commit strategy

Archive forJuly, 2009

అమ్మా….. సంవన్ ఈజ్ మేకింగ్ మదర్ అర్త్ సిక్………..

……..

అని మా అబ్బాయి బాధతో అరిచాడు మేమందరమూ McDonald’s నుండి బయటకు వస్తుంటే. తీరా చూస్తే రోడ్డు మీద ఎవరో అరటి తొక్క, ఒక కవరు, స్ట్ర్ఱా పడేసారు. నిజమే నాన్నా. నీకు ఉన్న కనీస పాటి ఙానం కూడా వాళ్ళకి లేక పోయింది అని నేను కూడా వాపోయాను.

 

తరువాత అడిగాను ఇప్పుడు ఏమిటి చేద్దాం అని.ఆలోచించాడు. ఒక నిమిషం తరువాత నన్ను కూడా మళ్ళీ లోపలకు తీసుకు వెళ్ళి అక్కడ పని వాళ్ళకి ఆ చెత్త గురించి చెప్పాడు. వాళ్ళు కూడా ఏమీ అనకుండా వచ్చి శుభ్ర పరిచారు. మా వాడి మొహం విజయోత్సాహంతో వెలిగి పోయింది. నేను అడిగా నువ్వెందుకు శుభ్ర పరచలేదు అని. అప్పుడు అన్నాడు ‍ అమ్మా వాళ్ళకి చెప్తే మళ్ళా అలా జరగకుండా చూస్తారు అని. నేనూ ఆనంద పడ్డా. ఇప్పటికే కాదు ముందు ముందు కూడా అలా జరగకూడదు అని ఆలోచన వాడికి కలిగినందుకు. మంచిది బాబూ అంటే జవాబుగా వాదు అన్నాడు అసలు జనాలకి ఇలా మదర్ అర్త్ ని డర్టీ చేయొద్దు అని నేర్పిస్తే పోలా అని! అవును నాన్నా! ఇలానే కాదు ‍ చాలా మం‍ది చాలా రకాలుగా భూదేవి ని కాల్యుష్యం తో నింపుతున్నారు.అందుకే మనము చేసే ప్రతి పనిలోను మనమె జాగ్రత్తగా ఉంటూ వేలైతే మన చుట్టు పక్కల వారి చేతా అలాగే చేయించగలిగితే భూదేవి తప్పకుండా శుభ్ర పడుతుంది బాబూ అని చెప్పా. వై నాట్ ష్యూర్ అమ్మా అని ఎంతో ఆత్మ విశ్వాసంతో వాడు చెప్తుంటే భలే ముచ్చట వేసింది.

 

నా చిన్నప్పుడు  తాతయ్య రోజూ పొద్దున నిద్ర లేచి మంచం దిగే ముందర ఏదో శ్లోకం చదివి నేలకు నమస్కారం చేయడం చూసేదాన్ని. (అయిదేళ్ళ వయసులో) ఒక రోజున‌ అడిగేసాను. ఎందుకు తాతయ్యా అలా చేస్తున్నారు అని. భూదేవికి నమస్కారం పెడుతున్నానమ్మా . నా పాదాలతో భూదేవిని తొక్కుతున్నందుకు క్షమించమని ప్రార్థన చేస్తున్నా అన్నారు ఆయన. నేను ఫక్కున నవ్వి అదేమిటి తాతయ్యా!భూదేవి, క్షమాపణ అని అంటున్నావు. భూమి అంటే ప్లానెట్ అర్త్ కదా. గొప్ప శాస్త్ర వేత్తవు నీకు తెలియదా ఏమిటి. మరి ఇలా మాట్లాదుతున్నావేమిటి అని నేనంటే ఆయన తప్పు లేదమ్మా. భూమి మనకి కావల్సినవి అన్నీ ఇస్తుంది కదా. నీకు ఇష్టమైన బొమ్మలకి కావాల్సిన ముడి సరుకు, జాం పండ్లు, ఉయ్యాల ఊగడానికి చెట్లు అన్నీ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుదు భూమిని దేవతా సమానంగా తలిస్తే తప్పేమిటి అని ఆయన నన్ను ఎదురు ప్రశ్న వేసారు. మన దగ్గర సమాధానం నిల్. అప్పుడు ఆయన అన్నారు ప్రతి వస్తువుని దాని యొక్క ప్రయోజనం గుర్తించి, దానిని గౌరవించాలి అని. ఎందుకో తెలియలేదు అప్పుడు గానీ నాకు భలే సిగ్గేసింది. సారీ తాతయ్యా ఇందాక తెలియక నవ్వాను అన్నా.

 

ఆ శ్లోకం గుర్తు లేదు. రోజూ నేనేమీ నేలకు నమస్కారం చేయట్లేదు. కానీ తాతయ్య మాటలు మాత్రం మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసాయి.ఆ మాటల్లో శారాంసాన్ని నా పిల్లలకు కూడా నేర్పిద్దామని నా ప్రయత్నం. మొన్న మా వాడి మాటలు విన్నాక అనిపించింది, చిన్న పిల్లలకి, మన పెద్ద వాళ్ళకి ఉన్న సివిక్ సెంస్ మనకి ఎందుకు లేదూ అని.

 

RTS Perm Link

Comments (2)

పేరంటం – చిన్న నాటి ఙాపకం

శ్రావణ మాసం వచ్చేసింది. చిన్నప్పటి నుండీ మాసం అంటే భలే సరదా. పేరంటాల హడావిడి, కొత్త బట్టలు వేసుకోవడం, అందరి ఇళ్ళకు వెళ్ళడం, అందరూ మన ఇంటికి రావడం, అందరి ముందరా మనకి వచ్చిన పాటలు పాడి టేలంట్ షో చేసేసి తెగ ఫీలయిపోవడం, అమ్మతో పాటు పోటిగా అందరికీ పసుపు కుంకం ఇవ్వడం…. ఓహ్ ఒకటేమిటి ఇలా మాసమంతా సందడే సందడి నిండిన తీపి గుర్తులు.

 

అన్నిటికన్నా అందరికన్నా నాకు బాగా గుర్తుకు వచ్చేది  మా తాతయ్య. నేను అమ్మతో పోటీ పడేదాన్ని అమ్మ కన్నా నేనే ఎక్కువ మందికి పసుపు కుంకం ఇవ్వాలి అని. ఇప్పుడు తలుచుకుంటే ఏమిటా వెర్రి అనిపిస్తుంది కాని  అప్పుడు మాత్రం అది మనకి లైఫ్ అండ్ డెత్ సమస్య. మన కోసం ఎక్కువ పేరంటాళ్ళు మాత్రం ఎక్కడ నుండి వస్తారు? నేను అమ్మా సరి సమానము అని తేలి నేను బుంగ మూతి పెడితే మా తాతయ్య ఎందుకమ్మా నాకు కూడా పెట్టు అని చక్కగా బొట్టు పెట్టించుకుని, కాళ్ళకు పసుపు రాయించుకునే వారు. అదీ అందరి ముందరా. పోనీ నేను ఒక్క దాన్నే ఆయనకు మనవరాలిని కాదు, మొదటి దాన్నీ కాదు  ముద్దు ఎక్కువ అనుకునేందుకు. వారాలు చేసుకుంటూ చదివి, గొప్ప శాస్త్రవేత్తగా పని చేసి, ఒక డిగ్రీ కాలేజీ ప్రింసిపాలు గా రిటైరు అయిన మనిషి, దేశ విదేశాలు తిరిగిన మనిషి తన కూతురి కూతురి ముచ్చట తీరాలి అని ఎంతో నిరాడంబరముగా అందరి ముందరా అలా చేసారు అని తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది. నా కోసమే తాతయ్య అలా చేసారు అని అనుకున్నప్పుడు కించిత్ గర్వముగా కూడా ఉంటుంది.

 

పిల్లలకు నచ్చిన రీతిలోనే మన సాంప్రదాయపు విలువలని వాళ్ళకి తెలియ జేయాలి అని ఆచరణలో ఆయన చూపించారు అని ఇప్పుడు నాకూ కూతురు పుట్టాక అది కూడా నాతో పోటీ పడుతుంటే అర్థం అవుతోంది. అందుకే క్రమము తప్పకుండా నేనూ ప్రతి ఏడాది పేరంటం చేసి ఆయనను తలుచుకుని మురిసిపోతూ ఉంటాను. నా పిల్లలకు కూడా మాసం తీపి గుర్తులను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాను.

RTS Perm Link

Comments (6)

సంభాషణ – సంబంధము

మొన్నీ మధ్యన ఏవో ఉద్యొగాల ప్రకటనలు చూస్తుంటే ‍ అన్నింటిలోనూ ప్రధానము గా కనిపించింది “కమ్యూనికేషన్ స్కిల్ల్సు” బాగా ఉండాలి అని.ఆ! ఈ రోజుల్లో కూడా ఇలా అడుగుతున్నారేమిటి అని అనుకోకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే అనిపించింది ఈ రోజుల్లోనే ఇది బాగ అవసరము అని.

 

నేను మనము మన స్నేహితులతోనో, చుట్టాలతోనో చేసే సంభాషణల గురించి చెప్పట్లేదు.

 

మనిషి తన భావనలకు మాటల ద్వార రూపం దిద్దితే , ఆ మాటలను ఇతరులతో ముఖాముఖి పంచుకుంటే అది సంభాషణ అవుతుంది. (ఫోనుల్లొను మాట్లాడినా సంభాషణే అనుకోండి). కానీ ఈ రోజుల్లొ అంత తీరిక ఎవరికి ఉంది చెప్పండి. ఈ‍మెయిలు వచ్చిం దగ్గరనుంచి మనకి తోచిన వేళలో చెప్పదల్చుకున్నది ఏదో అవతల వారికి చెప్పేయడమే. ఇహ  SMSలు, ట్విట్టర్లు గట్రా ఉండనే ఉన్నాయి. ఇంన్స్టెంటు మెసెంజర్లు వచ్చిన దగ్గర నుండీ పక్క సీటులో కూర్చునే వారితో కూడా IM లే.  మనము రాసిన దానికి స్పందన వస్తే నచ్చితే మనము ప్రతిస్పందిస్తాము. లే క పోతే లేదు. అవతల వారి హావభావలతో పని లేదు. అంతా వన్ వే ట్రాఫిక్.

 

పోనీ ముఖాముఖీ పరిస్థితి ఏమైన బావుందా అంటే అదీ లేదు. డాక్టరు దగ్గరకి వెళ్తే, పేషెంటుని పలకరించి, పేషెంటు మనోగతి బట్టీ , శరీరానికే కాకుండా మనసుకీ వైద్యం చేయడం…. ఎందుకు లెండి. జరిగే పని కాదు. నిమిషానికి ఎంత మంది పేషంట్లని చూస్తే అంత డబ్బులు వస్తుంటే, ఎవరు కాలం వృధా చేస్తారు? లాయరు దగ్గరకు వెళ్తామా. పొరపాటున వాళ్ళ్సు మనలని పలకరించి “హలో! ఎలా ఉన్నారు?” అని అడిగితే మనకి వళ్ళు మంట. పైగా టెంషను పెరిగి పోతూ ఉంటుంది. మరి నిమిషానికి ఇంత అని గుంజుంతుంటే మన డబ్బులే కదా వదులుతోంది.

 

నేను చెప్పొచ్చేదేమిటంటే ‍ ఈ రోజుల్లో మనిషికీ మనిషికీ మధ్య ఇంఫర్మేషన్ ఎక్స్ఛెంజ్ అవుతోంది తప్ప సంబంధము పెంపొందేటట్లు సంభాషణలు జరగట్లేదు.

ఎందుకిలా? దేనికోసం ఈ పరుగు, ఈ తాపత్రయం? ఆలోచించండి!

 

RTS Perm Link

Comments

జిరాక్సు కాపీ!

కొన్ని రోజుల కిందట ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాటవరసకు మా శ్రీ వారిని అడిగారు “వారాంతంలో ఏమిటి చేస్తూ ఉంటారు” అని. మా వారు వెంటనే తడుముకోకుండా చెప్పారు “జిరాక్సు కాపీ” అని. వాళ్ళు తెల్లబోయి నా వంక, మా వారి వంక వెర్రి చూపులు చూసారు.పాపం వారిని ఇబ్బంది పెట్టడము ఎందుకని అనుకున్నారో ఏమిటో , మా వారు వారికి దాని తాత్పర్యము ఇలా చెప్పారు. పొద్దున లేచిన దగ్గరనుండీ పిల్లల వెంట పడుతూ వాళ్ళకి కావల్సినవి ఏర్పాటు చేయడం , మధ్యలో కాస్త ఖాళీ దొరికితే ఒక చిన్న కునుకు తీయడం ‍ ఇదీ మా దినచర్య. వారాంతంలో కూడా ఇది సాగుతుంది. ఆఫీసుకి వెళ్ళము కాబట్టి ఆ దిన చర్య ఇంట్లోనో, లేక పోతే బయటనో జరుగుతుంది , చిన్న చిన్న మార్పులు ఉంటాయి‍ అంతే. ఒక రోజుని తీసుకుని దానిని ప్రతి రోజూ జిరాక్సు కాపీ తీయడమే మా పని అని  మా వారు సెలవిచ్చారు. వింటున్న వాళ్ళు ఆహా! ఎంత క్లుప్తంగా చెప్పారు సార్! అని మెచ్చుకోలుగా ఈయన వంక చూస్తుంటే, నాకు మాత్రం మా వారు గీతోపదేశం చేస్తున్న శ్రీ కృష్న పరమాత్ముని వలే తొచారు. ముసిముసి నవ్వులు చిందుస్తున్న నా వంక చూసి “ఏమిటీ నవ్వుతున్నావు” అని ఎవరూ అడగక ముందరే నేను అక్కడ నుండి పలాయనం చిత్తగించాను.

 

అన్నట్టు రోజూ బ్లాగడం చేయాలంటే మా జిరాక్సు కాపీ లో బ్లాగడం అని ఒక లైను జొప్పించాలి అనుకుంటా

RTS Perm Link

Comments

RTSMirror Powered by JalleDa

FireStats icon Powered by FireStats