FireStats error : FireStats: Unknown commit strategy

రాజీనామా!

నేను ఒక సగటు స్త్రీని. మొన్నీ మధ్యన ఒక రాజకీయ నాయకుడు రాజీనామా చేసారని వార్త చదివాను.వెంటనే ఎలుగెత్తి ఒక రాజకీయ నాయకుడిని అయినా కాకపోతిని రాజినామా చేయగా అని పాడుకోవాలని అనిపించింది.( ఏదో విసుగులో, శరీరం అలసిసొలసిన వేళలో! ) మరుక్షణమే !! నా పదవి కిఒక రాజకీయ నాయకునికీ పోలికా! బుద్ధి వైపరీత్యం కాకపొతే అని నన్ను నేను చివాట్లు వేసుకున్నా అనుకోండి! ఇంతకీ ఏమిటి పదవి అంటే ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన పదవిఅమ్మ పదవి!

 

ఒక సగటు స్త్రీ తన జీవితంలో ఎన్నో రోల్స్లో, ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుందిఒక కూతురిగా, చెల్లిగా,స్నేహితురాలిగా, ఉద్యోగస్థురాలిగా, భార్యగా, అమ్మగా. ఒక్కోసారి రెండు మూడు రోల్స్ ని ఒకే సారి నిర్వహిస్తుంది కూడా!అన్నిటికీ తను తలుచుకుంటే రాజినామా చేయొచ్చు వెసులుబాటు ఉంది. కానీ ఒక సారి అమ్మ అయ్యాక మాత్రం ఎప్పటికీ అమ్మే!

 

అదేమిటీ! మరి ఒక సారి కూతురు, చెల్లి అయితే మళ్ళీ రోల్స్ కూడా మారవు కదా అని మీరు అనొచ్చు! నిజమే! కానీ మన సాంప్రదాయంలో స్త్రీ కి పెళ్ళి అయ్యాక కూతురిగా బాధ్యతలు తగ్గుతాయి. మునుపటికి మల్లే అందరికీ తమ తల్లి తండ్రులని దగ్గర ఉండి చూసుకోవడం కుదరదు కొంతమంది భాగ్యవంతులకి తప్ప! చెల్లిగా కూడ అన్న పెళ్ళి వరకే బాధ్యత! తరువాత అన్న బాధ్యతలు వదినవేకాదంటారా? గమనిక ఇక్కడ భాద్యతల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము మమతలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి అనేది జగద్విదితమే.స్నేహం కూడా మనకి ఇష్టం ఉన్నంత వరకే సాగుతుంది. ఇక ఉద్యొగాని గురించి వేరే చెప్పాలా! మనకి తిక్క పుడితే తొక్క ఉద్యొగానికి ఒక నమస్కారంఅని బాసు మొహాన రాజినామా పత్రంప విసిరేయమూ!

 

ఇక పోతే భార్యగా అంటారా అన్ని దేశాల ప్రభుత్వాలు విడాకుల చట్టాన్ని అమలు చేస్తున్నాయి.ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు ఇచ్చేసుకొవడం, మళ్ళీ బుద్ధి కుదిరితే ఇద్దరే మళ్ళీ పెళ్ళి చేసుకోవడం రోజుల్లో ఒక ఫేషను అయిపొయింది.(కొంతమంది అనివార్య కారణాల వలన విదాకులు తీసుకుంటారు, అది వారి వారి వ్యక్తిగతం. వారి గురించి నేను మాట్లాడుట లేదు. ).

 

నా పాయింటు ఏమిటీ అంటే అమ్మ పదవికి రాజీనామ వెసులుబాటు లేదు.కారణంఅది తల్లికీ అక్కర్లేదు.

అన్కండిషనల్ ప్రేమను నిస్వార్థంగా ,నిష్పాక్షికంగా అందరు పిల్లలకీ సమానంగా పంచడం అమ్మ నైజం. తనకు పుట్టిన పిల్లలకు ప్రొమోషను వచ్చాక మాత్రమే అమ్మకూ ప్రొమోషను వస్తుంది అమ్మమ్మ గానో లేక మామ్మ గానో! అదే తనకు ఆనందం! ఇక్కడ అహానికి తావు లేదు.ప్రేమ తప్ప! అందుకేనేమో అన్నారు పెద్దలు అమ్మ దేవుని ప్రతి రూపమని. ప్రేమను పొందటానికే విష్ణుమూర్తి సైతం మానవ రూపం ఎత్తుతున్నాడంటే అతి శయోక్తి కాదేమో!

 

అమ్మ తన పిల్లలకి పంచే ప్రేమ లాగా మనము కూడా ఇతరుల పట్ల వ్యవహరిస్తే లోకం నిజంగా ఒక వసుదైక కుటుంబం కాదా? ఆలోచించండి!

 

 

 

RTS Perm Link

2 Comments »

  1. priya emani Said,

    June 25, 2009 @ 6:08 am

    మీరు రాసిన పాయింటు చాలా బాగుంది–అమ్మ పదవికి రాజీనామా లేదు ఎందుకంటే ఏ తల్లికీ అది అక్కరలేదు!!”దేవుడు అన్నిచోటలా ఉండలేడు కాబట్టి అమ్మని సృష్టించాడు ” అని ఒక ఇంగ్లీషు కొటేషన్ ఉంది.ఆలాగ అమ్మది దేవుడిలాగ అంతులేని,నిస్వార్ధమైన ప్రేమ.కానీ ఆఖరులో మీరు రాసిన వాక్యం కొందరు పాటించలేరండీ.నేను చూసాను కొందరిని –తమ ప్రేమంతా తమ పిల్లలపైనే చూపుతారు.మిగిలినవాళ్ళ అవసరాలని పట్టించుకోరు అస్సలు…ఎందుకనో!(నేను నాకు తెలిసిన కొందరి గురించి మాత్రమే చెప్పాను.గమనించగలరు)

  2. viswakam Said,

    June 25, 2009 @ 8:43 am

    నిజమేనండీ! ఎవరో ఎందుకు ‍ నేను కూడా ప్రంపంచంలో అందరిని నా పిల్లలతో సమానంగా చూడగలను అని ధైర్యంగా చెప్పలేను. అహం ని దులపరించుకుని, నా అన్న భావన ని వదిలించుకుంటే గాని అది సాధ్య పడదు. అందుకే రాసాను ‍ అలా మనము అందరమూ చేయగలిగితే ప్రపంచం వసుదైక కుటుంబం అవుతుంది అని. ప్రయత్నిస్తే కష్ట సాధ్యమైన పనులు కూడా అసాధ్యం కాకుండా సుసాధ్యం అవుతాయి. ఏమంటారు?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment

RTSMirror Powered by JalleDa

FireStats icon Powered by FireStats