ఈ క్షణము!
చాలా రోజులు అయ్యింది బ్లాగు రాసి. ఎందుకు రాయలేదు అని మీరు అడగలేదు. ఒక వేళ అడిగినా – అబ్బో ! నేను చాలా “బిజి” అని తప్పించుకునేందుకు ప్రయత్నిచను! రాయలనిపించలేదు, రాయలేదు! అదేమిటీ? మరి బ్లాగు మొదలు పెట్టడము ఎందుకు అంటే దానికీ మన దగ్గిర ఒక సమాధానము ఉంది - చదవండి.
ఏ పని అయినా ఇష్ట పడి చేయాలి తప్పితే కష్ట పడి చేయకూడదు ఒక సిధ్ధాంతము తుచ తప్పకుండా పాటిస్తాను.ప్రతీ క్షణానినీ తనివి తీరా ఆస్వాదించడము, న భూతో న భవిష్యతి అనుకుని ఈ క్షణములో మైమరిచిపొవడము, అంతులేని ఆనందం అనుభవించడము ఇది నా మనస్తత్వం! అలా అని ప్రతి పనినీ నిదానముగ చేస్తాననుకుంటే మీరు బుట్టలో కాలు వేసినట్లేనండొయ్! కాల గతిని క్రమము తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను! ఉదాహరణకు పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే ఆ క్షణంలో త్వరగానే కదులుతాను! అలాగే చిన్ని పాపాయి బోసి నవ్వులని ఎంత సేపు అయినా ఆనందంతో చూస్తూనే ఉంటాను!
ఆ! పెద్ద చెప్పొచ్చావులే, మేము కూడా చేస్తూ ఉంటాము!ఇందులో కొత్తేమిటి అనుకుంటున్నారా? ” ఈ క్షణాన ” అని ప్రతి పనినీ మనస్ఫూర్తిగా చేయడమే ఇందులొ కొత్తదనము! చాల మంది నన్ను చూసి, వారు అనుకుంటున్న చిన్న చిన్న విషయాలకు కూడా నేను స్పందించే తీరు చూసి కొంచెం టెక్కు ఎక్కువ అని అనుకోవడము కూడ తెలుసు! కానీ వారికి అర్ధం కానిది ఒకటే – “జీవించడం!”
ఇన్నాళ్ళూ రాయలనిపించలేదు, రాయలేదు. ఇప్పుడు అనిపించింది రాసాను.
నిన్న తిరిగి రాదు,రేపు మరలి పోదు. గతంలోనే కూరుకుని పోయినా, భవిష్యత్తులోకి ఎగిరి పోయినా ఈ క్షణాన నేను జీవించనట్లే! నా ఈ జీవనానికి నాంది, పునాది,ఆది మరియు అంతము ఈ క్షణము! ఈ క్షణము!
sree Said,
June 22, 2009 @ 3:44 am
“నిన్న తిరిగి రాదు,రేపు మరలి పోదు” – మంచి సామెత.. సరైన చోట ఉపయోగించారు!!
siree Said,
June 24, 2009 @ 11:55 am
Avunu , Jevvinchatam bane vundi.Prathi kshanam jeevinchataniki ‘tekku’ ki co relation ardham kaledu.Manushulu antha thikka valla ..
Jeevinchatani tekku anukovataniki.
leka nuvvu eduti varini ardham chesukovatam lo thappu chesthunnavemo,ala ankuntunnaremo ani anukovatam tho.
viswakam Said,
June 24, 2009 @ 1:10 pm
కోరిలేషన్ ఒకటే! మనకి చిన్నది అని అనిపించే విషయం అవతలవారికి కాకపోవచ్చు అని అర్ధం చేసుకోవడం! కానీ నేను రాసిన ఈ క్షణానికి సారాంశం జీవించటం అని మీరు అర్ధం చేసుకున్నారు. సంతోషం! అది చాలు!