ఆశయాలు
జీవితంలో చేయదలుచుకున్న పనులు:
1.సైకిలు నడపడం (నాకు స్కూటరు నడపడం వచ్చు కానీ సైకిలు నడపడం రాదు అంటే నమ్ముతారా?)
2.సకుటుంబ సమేతంగా యూరోప్ మరియు ఇతర ప్రదేశాలను చూడడము
3.ఈత కొట్టడం (అయిదు అడుగుల నాలుగున్నర అంగుళాల మనిషినై ఉండి నాలుగు అడుగుల లోతులో నీటిలో మునిగిపోయి “ఇహ ఇంతటితో మన పని సరి” అనుకున్న మనిషికి కొంచెం కష్టమైన పనే!)
4.Hang gliding చేయడం! దీనిని తెలుగు లో ఏమంటారో తెలియక ఆంగ్లంలో రాసాను. క్షమించాలి!
ప్రస్తుతానికి ఇవి
BPhaniBabu Said,
June 22, 2009 @ 1:41 am
ఎప్పుదినా వీలుంటే నా బ్లాగ్గులు చదవండి. యు హావ్ గుడ్ కంపెనీ.
viswakam Said,
June 22, 2009 @ 9:43 am
లక్ష్మీ ఫణి గారూ,
మీ బ్లాగులు కొన్ని చదివాను. చాలా బాగున్నాయి. అన్నీ చదవడానికి ప్రయత్నిస్తాను.
ఒక ప్రశ్న మీ బ్లాగులో Stats ఎలా పెట్టారు? చాలా లింకులు కూడా తెలుగులో ఉన్నాయి.మీరు ఎలా చేసారో చెప్తే నేను కూడా అలానే చేయడానికి ప్రయత్నిస్తాను
BPhaniBabu Said,
June 23, 2009 @ 11:44 am
ఇందులో నా గొప్పతనం ఏమీలేదండి.మా అబ్బాయీ, కోడలూ కలిసి అవన్నీ చేశారు. నాకు ఈ గొడవలన్నీ ఏమీ తెలియవు. వ్రాయడం ఒక్కటే ఎలాగో లాగించేస్తున్నాను !!