FireStats error : FireStats: Unknown commit strategy

Archive forMarch, 2009

మనసులో మాట‌

చాలా రోజుల విరామము తరువాత మళ్ళీ రోజు బ్లాగు రాయటానికి వీలు దొరికింది. వారం రోజుల కింద ఇంట్లో మెట్లపై నుండి జారిపడినప్పుడు, తరువాత నా మదిలో కదిలిన భావనలే నాటి మన పిచ్చాపాటి.

ఇంతకు ముందర పోస్ట్ లో రాసినట్టు ఇలా దెబ్బ తగలడములొ ఆనందం ఏముంటుంది అని ఎవరైన అడగొచ్చు. అమ్మా! రామా! అని మూలుగుతుంటే ఐదేళ్ళ మా బాబు అమ్మా! నువ్వు rest తీసుకో అని అనడం ఆనందం! రెండేళ్ళ మా పాప అమ్మా! నీ తప్పు లేదు ఏదో accident అనడం ఆనందం! అంత బాధలోనూ చల్లని మాటల‌కు తన్మయత్వం పొందడం ! ఇదేనేమో మాత్రుత్వం అంటే!

ఎలాగూ లేచే పరిస్థితి కాదు! మరి ఇంట్లో పిల్లల పరిస్థితి ఏమిటి? ఇంట్లో ఇల్లాలు బండి చక్రం లాగ తిరిగుతున్నంతవరకు ఎవరికీ లోటు తెలియదు. బండి చక్రం ఆగితే? అంతే సంగతులు! ఏదో స్నేహితుల సహకారము వల్ల రోజు ఏమీ ఇబ్బంది లేకుండా గడిచి పోయింది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది మనిషికి మనిషి సహాయము ఎంత అవసరమో అని! వారాంతములొ చాల పని చేసాను కదా అని ఒక రెండు రోజులు సెలవు తీసుకుని rest తీసుకుందాము అనుకున్నా!దేవుడు లెవెల్లో rest ఇస్తాడు అని అనుకోలేదు. దొరికిందే ఛాన్సు అని పనిలో పని గా ఒకదానివెంట ఒకటిగా ఒక రెండుసినిమాలు లాగించేసాననుకోండి!

కాసేపు అమెరికాలో వైద్య వ్యవస్థ గురించి, మన భారత దేశంలో వైద్య వ్యవస్థ గురించి ఆలోచించి తప్పొప్పులు అందరూ ఎంచుతారు మనం చేయగలిగింది ఏమిటి అని అంతరాత్మను ప్రశ్నించుకొని ఒక నిర్ధారణకు వచ్చేలోపలే మందుల ప్రభావముతో నిద్రకు ఉపక్ర‌మించడముతో అలోచనలకు ఆనకట్ట పడింది!

ఇంకొక రోజున మళ్ళీ దీని గురించి మట్లాడుకుందాము!

 

RTS Perm Link

Comments (3)

తెలుగు నేర్చుకో

 

తెలుగు నేర్చుకొనుటకు సహాయపడు websites:

 

http://www.cpbrownacademy.org/

 

http://teluguuniversity.ac.in/</a.

RTS Perm Link

Comments

RTSMirror Powered by JalleDa

FireStats icon Powered by FireStats