FireStats error : FireStats: Unknown commit strategy

అమ్మా….. సంవన్ ఈజ్ మేకింగ్ మదర్ అర్త్ సిక్………..

……..

అని మా అబ్బాయి బాధతో అరిచాడు మేమందరమూ McDonald’s నుండి బయటకు వస్తుంటే. తీరా చూస్తే రోడ్డు మీద ఎవరో అరటి తొక్క, ఒక కవరు, స్ట్ర్ఱా పడేసారు. నిజమే నాన్నా. నీకు ఉన్న కనీస పాటి ఙానం కూడా వాళ్ళకి లేక పోయింది అని నేను కూడా వాపోయాను.

 

తరువాత అడిగాను ఇప్పుడు ఏమిటి చేద్దాం అని.ఆలోచించాడు. ఒక నిమిషం తరువాత నన్ను కూడా మళ్ళీ లోపలకు తీసుకు వెళ్ళి అక్కడ పని వాళ్ళకి ఆ చెత్త గురించి చెప్పాడు. వాళ్ళు కూడా ఏమీ అనకుండా వచ్చి శుభ్ర పరిచారు. మా వాడి మొహం విజయోత్సాహంతో వెలిగి పోయింది. నేను అడిగా నువ్వెందుకు శుభ్ర పరచలేదు అని. అప్పుడు అన్నాడు ‍ అమ్మా వాళ్ళకి చెప్తే మళ్ళా అలా జరగకుండా చూస్తారు అని. నేనూ ఆనంద పడ్డా. ఇప్పటికే కాదు ముందు ముందు కూడా అలా జరగకూడదు అని ఆలోచన వాడికి కలిగినందుకు. మంచిది బాబూ అంటే జవాబుగా వాదు అన్నాడు అసలు జనాలకి ఇలా మదర్ అర్త్ ని డర్టీ చేయొద్దు అని నేర్పిస్తే పోలా అని! అవును నాన్నా! ఇలానే కాదు ‍ చాలా మం‍ది చాలా రకాలుగా భూదేవి ని కాల్యుష్యం తో నింపుతున్నారు.అందుకే మనము చేసే ప్రతి పనిలోను మనమె జాగ్రత్తగా ఉంటూ వేలైతే మన చుట్టు పక్కల వారి చేతా అలాగే చేయించగలిగితే భూదేవి తప్పకుండా శుభ్ర పడుతుంది బాబూ అని చెప్పా. వై నాట్ ష్యూర్ అమ్మా అని ఎంతో ఆత్మ విశ్వాసంతో వాడు చెప్తుంటే భలే ముచ్చట వేసింది.

 

నా చిన్నప్పుడు  తాతయ్య రోజూ పొద్దున నిద్ర లేచి మంచం దిగే ముందర ఏదో శ్లోకం చదివి నేలకు నమస్కారం చేయడం చూసేదాన్ని. (అయిదేళ్ళ వయసులో) ఒక రోజున‌ అడిగేసాను. ఎందుకు తాతయ్యా అలా చేస్తున్నారు అని. భూదేవికి నమస్కారం పెడుతున్నానమ్మా . నా పాదాలతో భూదేవిని తొక్కుతున్నందుకు క్షమించమని ప్రార్థన చేస్తున్నా అన్నారు ఆయన. నేను ఫక్కున నవ్వి అదేమిటి తాతయ్యా!భూదేవి, క్షమాపణ అని అంటున్నావు. భూమి అంటే ప్లానెట్ అర్త్ కదా. గొప్ప శాస్త్ర వేత్తవు నీకు తెలియదా ఏమిటి. మరి ఇలా మాట్లాదుతున్నావేమిటి అని నేనంటే ఆయన తప్పు లేదమ్మా. భూమి మనకి కావల్సినవి అన్నీ ఇస్తుంది కదా. నీకు ఇష్టమైన బొమ్మలకి కావాల్సిన ముడి సరుకు, జాం పండ్లు, ఉయ్యాల ఊగడానికి చెట్లు అన్నీ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుదు భూమిని దేవతా సమానంగా తలిస్తే తప్పేమిటి అని ఆయన నన్ను ఎదురు ప్రశ్న వేసారు. మన దగ్గర సమాధానం నిల్. అప్పుడు ఆయన అన్నారు ప్రతి వస్తువుని దాని యొక్క ప్రయోజనం గుర్తించి, దానిని గౌరవించాలి అని. ఎందుకో తెలియలేదు అప్పుడు గానీ నాకు భలే సిగ్గేసింది. సారీ తాతయ్యా ఇందాక తెలియక నవ్వాను అన్నా.

 

ఆ శ్లోకం గుర్తు లేదు. రోజూ నేనేమీ నేలకు నమస్కారం చేయట్లేదు. కానీ తాతయ్య మాటలు మాత్రం మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసాయి.ఆ మాటల్లో శారాంసాన్ని నా పిల్లలకు కూడా నేర్పిద్దామని నా ప్రయత్నం. మొన్న మా వాడి మాటలు విన్నాక అనిపించింది, చిన్న పిల్లలకి, మన పెద్ద వాళ్ళకి ఉన్న సివిక్ సెంస్ మనకి ఎందుకు లేదూ అని.

 

RTS Perm Link

Comments (2)

పేరంటం – చిన్న నాటి ఙాపకం

శ్రావణ మాసం వచ్చేసింది. చిన్నప్పటి నుండీ మాసం అంటే భలే సరదా. పేరంటాల హడావిడి, కొత్త బట్టలు వేసుకోవడం, అందరి ఇళ్ళకు వెళ్ళడం, అందరూ మన ఇంటికి రావడం, అందరి ముందరా మనకి వచ్చిన పాటలు పాడి టేలంట్ షో చేసేసి తెగ ఫీలయిపోవడం, అమ్మతో పాటు పోటిగా అందరికీ పసుపు కుంకం ఇవ్వడం…. ఓహ్ ఒకటేమిటి ఇలా మాసమంతా సందడే సందడి నిండిన తీపి గుర్తులు.

 

అన్నిటికన్నా అందరికన్నా నాకు బాగా గుర్తుకు వచ్చేది  మా తాతయ్య. నేను అమ్మతో పోటీ పడేదాన్ని అమ్మ కన్నా నేనే ఎక్కువ మందికి పసుపు కుంకం ఇవ్వాలి అని. ఇప్పుడు తలుచుకుంటే ఏమిటా వెర్రి అనిపిస్తుంది కాని  అప్పుడు మాత్రం అది మనకి లైఫ్ అండ్ డెత్ సమస్య. మన కోసం ఎక్కువ పేరంటాళ్ళు మాత్రం ఎక్కడ నుండి వస్తారు? నేను అమ్మా సరి సమానము అని తేలి నేను బుంగ మూతి పెడితే మా తాతయ్య ఎందుకమ్మా నాకు కూడా పెట్టు అని చక్కగా బొట్టు పెట్టించుకుని, కాళ్ళకు పసుపు రాయించుకునే వారు. అదీ అందరి ముందరా. పోనీ నేను ఒక్క దాన్నే ఆయనకు మనవరాలిని కాదు, మొదటి దాన్నీ కాదు  ముద్దు ఎక్కువ అనుకునేందుకు. వారాలు చేసుకుంటూ చదివి, గొప్ప శాస్త్రవేత్తగా పని చేసి, ఒక డిగ్రీ కాలేజీ ప్రింసిపాలు గా రిటైరు అయిన మనిషి, దేశ విదేశాలు తిరిగిన మనిషి తన కూతురి కూతురి ముచ్చట తీరాలి అని ఎంతో నిరాడంబరముగా అందరి ముందరా అలా చేసారు అని తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది. నా కోసమే తాతయ్య అలా చేసారు అని అనుకున్నప్పుడు కించిత్ గర్వముగా కూడా ఉంటుంది.

 

పిల్లలకు నచ్చిన రీతిలోనే మన సాంప్రదాయపు విలువలని వాళ్ళకి తెలియ జేయాలి అని ఆచరణలో ఆయన చూపించారు అని ఇప్పుడు నాకూ కూతురు పుట్టాక అది కూడా నాతో పోటీ పడుతుంటే అర్థం అవుతోంది. అందుకే క్రమము తప్పకుండా నేనూ ప్రతి ఏడాది పేరంటం చేసి ఆయనను తలుచుకుని మురిసిపోతూ ఉంటాను. నా పిల్లలకు కూడా మాసం తీపి గుర్తులను ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాను.

RTS Perm Link

Comments (3)

సంభాషణ – సంబంధము

మొన్నీ మధ్యన ఏవో ఉద్యొగాల ప్రకటనలు చూస్తుంటే ‍ అన్నింటిలోనూ ప్రధానము గా కనిపించింది “కమ్యూనికేషన్ స్కిల్ల్సు” బాగా ఉండాలి అని.ఆ! ఈ రోజుల్లో కూడా ఇలా అడుగుతున్నారేమిటి అని అనుకోకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే అనిపించింది ఈ రోజుల్లోనే ఇది బాగ అవసరము అని.

 

నేను మనము మన స్నేహితులతోనో, చుట్టాలతోనో చేసే సంభాషణల గురించి చెప్పట్లేదు.

 

మనిషి తన భావనలకు మాటల ద్వార రూపం దిద్దితే , ఆ మాటలను ఇతరులతో ముఖాముఖి పంచుకుంటే అది సంభాషణ అవుతుంది. (ఫోనుల్లొను మాట్లాడినా సంభాషణే అనుకోండి). కానీ ఈ రోజుల్లొ అంత తీరిక ఎవరికి ఉంది చెప్పండి. ఈ‍మెయిలు వచ్చిం దగ్గరనుంచి మనకి తోచిన వేళలో చెప్పదల్చుకున్నది ఏదో అవతల వారికి చెప్పేయడమే. ఇహ  SMSలు, ట్విట్టర్లు గట్రా ఉండనే ఉన్నాయి. ఇంన్స్టెంటు మెసెంజర్లు వచ్చిన దగ్గర నుండీ పక్క సీటులో కూర్చునే వారితో కూడా IM లే.  మనము రాసిన దానికి స్పందన వస్తే నచ్చితే మనము ప్రతిస్పందిస్తాము. లే క పోతే లేదు. అవతల వారి హావభావలతో పని లేదు. అంతా వన్ వే ట్రాఫిక్.

 

పోనీ ముఖాముఖీ పరిస్థితి ఏమైన బావుందా అంటే అదీ లేదు. డాక్టరు దగ్గరకి వెళ్తే, పేషెంటుని పలకరించి, పేషెంటు మనోగతి బట్టీ , శరీరానికే కాకుండా మనసుకీ వైద్యం చేయడం…. ఎందుకు లెండి. జరిగే పని కాదు. నిమిషానికి ఎంత మంది పేషంట్లని చూస్తే అంత డబ్బులు వస్తుంటే, ఎవరు కాలం వృధా చేస్తారు? లాయరు దగ్గరకు వెళ్తామా. పొరపాటున వాళ్ళ్సు మనలని పలకరించి “హలో! ఎలా ఉన్నారు?” అని అడిగితే మనకి వళ్ళు మంట. పైగా టెంషను పెరిగి పోతూ ఉంటుంది. మరి నిమిషానికి ఇంత అని గుంజుంతుంటే మన డబ్బులే కదా వదులుతోంది.

 

నేను చెప్పొచ్చేదేమిటంటే ‍ ఈ రోజుల్లో మనిషికీ మనిషికీ మధ్య ఇంఫర్మేషన్ ఎక్స్ఛెంజ్ అవుతోంది తప్ప సంబంధము పెంపొందేటట్లు సంభాషణలు జరగట్లేదు.

ఎందుకిలా? దేనికోసం ఈ పరుగు, ఈ తాపత్రయం? ఆలోచించండి!

 

RTS Perm Link

Comments

జిరాక్సు కాపీ!

కొన్ని రోజుల కిందట ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాటవరసకు మా శ్రీ వారిని అడిగారు “వారాంతంలో ఏమిటి చేస్తూ ఉంటారు” అని. మా వారు వెంటనే తడుముకోకుండా చెప్పారు “జిరాక్సు కాపీ” అని. వాళ్ళు తెల్లబోయి నా వంక, మా వారి వంక వెర్రి చూపులు చూసారు.పాపం వారిని ఇబ్బంది పెట్టడము ఎందుకని అనుకున్నారో ఏమిటో , మా వారు వారికి దాని తాత్పర్యము ఇలా చెప్పారు. పొద్దున లేచిన దగ్గరనుండీ పిల్లల వెంట పడుతూ వాళ్ళకి కావల్సినవి ఏర్పాటు చేయడం , మధ్యలో కాస్త ఖాళీ దొరికితే ఒక చిన్న కునుకు తీయడం ‍ ఇదీ మా దినచర్య. వారాంతంలో కూడా ఇది సాగుతుంది. ఆఫీసుకి వెళ్ళము కాబట్టి ఆ దిన చర్య ఇంట్లోనో, లేక పోతే బయటనో జరుగుతుంది , చిన్న చిన్న మార్పులు ఉంటాయి‍ అంతే. ఒక రోజుని తీసుకుని దానిని ప్రతి రోజూ జిరాక్సు కాపీ తీయడమే మా పని అని  మా వారు సెలవిచ్చారు. వింటున్న వాళ్ళు ఆహా! ఎంత క్లుప్తంగా చెప్పారు సార్! అని మెచ్చుకోలుగా ఈయన వంక చూస్తుంటే, నాకు మాత్రం మా వారు గీతోపదేశం చేస్తున్న శ్రీ కృష్న పరమాత్ముని వలే తొచారు. ముసిముసి నవ్వులు చిందుస్తున్న నా వంక చూసి “ఏమిటీ నవ్వుతున్నావు” అని ఎవరూ అడగక ముందరే నేను అక్కడ నుండి పలాయనం చిత్తగించాను.

 

అన్నట్టు రోజూ బ్లాగడం చేయాలంటే మా జిరాక్సు కాపీ లో బ్లాగడం అని ఒక లైను జొప్పించాలి అనుకుంటా

RTS Perm Link

Comments

నేనూ తెలుగు పాట పాడుతున్నా!

మాతృభాష మీద మమకారం ఎవరికి ఉండదు చెప్పండి!నాకూ ఉంది.దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అలాంటి తెలుగుని నా పిల్లలు కూడా అనర్గళంగా మాట్లాడాలని ఒక చిన్న కోరిక. మరి దానికి నా వంతు కృషి నేను చేయాలిగా. అందుకే నా చిన్ని తండ్రికి, చిట్టి తల్లికి తెలుగు DVDలు, పాత కాలం సినిమాలు చూపిస్తున్నాను. ఇంట్లో ఎలాగూ మాట్లాడేది తెలుగు అయినా పిల్లలు బయట మాట్లాడేది ఆంగ్లం కావడంతో వారు ఎక్కడ తెలుగు ని వదిలేస్తారో అని భయం.వాళ్ళకీ ఆసక్తిగా ఉంటుంది అని కొంచెం తెలుగు సినిమా పాటలు కూడా వినిపిస్తున్నాము. ఇదిగొ ఇక్కడే వచ్చింది చిక్కు.

 

నేటి మన సినిమా పాటలలో అసలు తెలుగు సాహిత్యం కన (విన) పడితేగా. జనరంజకంగా ఉండాలని మధ్య మధ్య ఆంగ్ల పదాలు పెట్టేస్తున్నారు. అలా అని అన్నీ అలాంటి పాటలే అని నేను అనట్లేదు. ఉదాహరణకు నీ స్నేహం చిత్రంలో చినుకు తడికి అనే పాటలో సాహిత్యం ఎంత బాగుంటుందో కదా. పోనీ కొన్ని పాటలలో సాహిత్యం బావుంటే ఉఛ్ఛారణ గురించి మరి అడగకండి. స్వఛ్ఛమైన ఉఛ్ఛారణ ఉంటే నువ్వు పాటలకు పనికి రావు అన్నాడట మ్యూజిక్ డైరెక్టరు అని జోకులు సర్వ సాధారణమై పో యాయి.

 

మా అబ్బాయికి పలికిద్దామని నేను చేసిన ప్రయత్నంతో నేటి రచనకు పునాది పడుతుందని నేను అసలు ఊహించలేదు సుమా! కష్ట పడి అనిపించి, గణపతి, బాణము లాంటి పదాలు పలికించి అంతటితో నేను ఊరుకుని ఉంటే కథకు అంకురార్పణ జరిగేది కాదు.

 

మనము తెలుగింటి ఆడపడుచుని పదహారణాల తెలుగమ్మాయి అని సంభోధిస్తాము కదా. అదే ముక్క మా వాడి చెవిలో పడేశా. ఇంకేం ఒక సారి మా శ్రీవారు కారులో బొమ్మరిల్లు సినిమాలో పదహారణాల తెలుగు జులియట్ అనే పాట వింటుంటే మా సిసింద్రి విన్నాడు. నాకా సంగతి తెలియదు. మహదానందంగా నా దగ్గరకు వచ్చిఅమ్మా! నేనూ తెలుగు పాట పాడుతున్నా”  అని  ఆంగ్లంలోనే  అన్నాడు. ఆహా! నా కృషి ఫలించింది అని లోలోపల మురిసిపోతూ ఏదీ నాకూ వినిపించవూ అని నేను అడగడం వాడు అదును చూసుకుని బెట్టు చేయడం వెంట వెంటనే జరిగి పోయాయి. మొత్తానికి పాడడం మొదలు పెట్టాడు.

 

 పాటలోని మొదటి వాక్యం అయిన వెంటనే ‍Yo, Yo, Yo  అంటూ తరువాత వచ్చే ఆంగ్లంలోని వాక్యాలు చక్కగా పాడి వినిపించాడు.ముందర మన మొహం వెలా తెలా పోయింది.క్షణంలో తేరుకునిరాగ భరితంగా పాడావు అని మెచ్చుకుని తెలుగు పాట అంటే మొత్తం తెలుగు లో పాడాలి బాబూ అని ఙానోపదేశం చేసాను. మరి సినిమాలలో అలా ఎందుకు పెట్టారు అమ్మా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పేది? తెలుగు దినం (అదేనండీ! తెలుగు డే) ఫంక్షను జరుపుకుని మన భాషకు తగిన గౌరవం ఇచ్చేసామని ఆనంద పడే రోజుల్లో అసలు ఇలాంటి ఆశలు పనికి రావేమో!

 

అయినా మనం మాత్రం విక్రమార్కుడికన్నా తక్కువ తిన్నామా ఏమిటి ! పట్టు వదలలేదు. సంగీతం టీచరు గారు నేర్పిన వరద వినాయక శరణం శరణం పాట పాడడం వచ్చే వరకు వదలలేదు.ఇప్పుడు మా వాడునేనూ తెలుగు పాట పాడుతున్నాఅంటే నిజమైన ఆనందమే :‍) నాలుగు ముక్కలూ కూడా తెలుగులో అనిపిద్దామని నా తదుపరి ప్రయత్నం. చూద్దాం ఎన్నాళ్ళకు అంటాడో!

RTS Perm Link

Comments (2)

రాజీనామా!

నేను ఒక సగటు స్త్రీని. మొన్నీ మధ్యన ఒక రాజకీయ నాయకుడు రాజీనామా చేసారని వార్త చదివాను.వెంటనే ఎలుగెత్తి ఒక రాజకీయ నాయకుడిని అయినా కాకపోతిని రాజినామా చేయగా అని పాడుకోవాలని అనిపించింది.( ఏదో విసుగులో, శరీరం అలసిసొలసిన వేళలో! ) మరుక్షణమే !! నా పదవి కిఒక రాజకీయ నాయకునికీ పోలికా! బుద్ధి వైపరీత్యం కాకపొతే అని నన్ను నేను చివాట్లు వేసుకున్నా అనుకోండి! ఇంతకీ ఏమిటి పదవి అంటే ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన పదవిఅమ్మ పదవి!

 

ఒక సగటు స్త్రీ తన జీవితంలో ఎన్నో రోల్స్లో, ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తుందిఒక కూతురిగా, చెల్లిగా,స్నేహితురాలిగా, ఉద్యోగస్థురాలిగా, భార్యగా, అమ్మగా. ఒక్కోసారి రెండు మూడు రోల్స్ ని ఒకే సారి నిర్వహిస్తుంది కూడా!అన్నిటికీ తను తలుచుకుంటే రాజినామా చేయొచ్చు వెసులుబాటు ఉంది. కానీ ఒక సారి అమ్మ అయ్యాక మాత్రం ఎప్పటికీ అమ్మే!

 

అదేమిటీ! మరి ఒక సారి కూతురు, చెల్లి అయితే మళ్ళీ రోల్స్ కూడా మారవు కదా అని మీరు అనొచ్చు! నిజమే! కానీ మన సాంప్రదాయంలో స్త్రీ కి పెళ్ళి అయ్యాక కూతురిగా బాధ్యతలు తగ్గుతాయి. మునుపటికి మల్లే అందరికీ తమ తల్లి తండ్రులని దగ్గర ఉండి చూసుకోవడం కుదరదు కొంతమంది భాగ్యవంతులకి తప్ప! చెల్లిగా కూడ అన్న పెళ్ళి వరకే బాధ్యత! తరువాత అన్న బాధ్యతలు వదినవేకాదంటారా? గమనిక ఇక్కడ భాద్యతల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము మమతలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయి అనేది జగద్విదితమే.స్నేహం కూడా మనకి ఇష్టం ఉన్నంత వరకే సాగుతుంది. ఇక ఉద్యొగాని గురించి వేరే చెప్పాలా! మనకి తిక్క పుడితే తొక్క ఉద్యొగానికి ఒక నమస్కారంఅని బాసు మొహాన రాజినామా పత్రంప విసిరేయమూ!

 

ఇక పోతే భార్యగా అంటారా అన్ని దేశాల ప్రభుత్వాలు విడాకుల చట్టాన్ని అమలు చేస్తున్నాయి.ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు ఇచ్చేసుకొవడం, మళ్ళీ బుద్ధి కుదిరితే ఇద్దరే మళ్ళీ పెళ్ళి చేసుకోవడం రోజుల్లో ఒక ఫేషను అయిపొయింది.(కొంతమంది అనివార్య కారణాల వలన విదాకులు తీసుకుంటారు, అది వారి వారి వ్యక్తిగతం. వారి గురించి నేను మాట్లాడుట లేదు. ).

 

నా పాయింటు ఏమిటీ అంటే అమ్మ పదవికి రాజీనామ వెసులుబాటు లేదు.కారణంఅది తల్లికీ అక్కర్లేదు.

అన్కండిషనల్ ప్రేమను నిస్వార్థంగా ,నిష్పాక్షికంగా అందరు పిల్లలకీ సమానంగా పంచడం అమ్మ నైజం. తనకు పుట్టిన పిల్లలకు ప్రొమోషను వచ్చాక మాత్రమే అమ్మకూ ప్రొమోషను వస్తుంది అమ్మమ్మ గానో లేక మామ్మ గానో! అదే తనకు ఆనందం! ఇక్కడ అహానికి తావు లేదు.ప్రేమ తప్ప! అందుకేనేమో అన్నారు పెద్దలు అమ్మ దేవుని ప్రతి రూపమని. ప్రేమను పొందటానికే విష్ణుమూర్తి సైతం మానవ రూపం ఎత్తుతున్నాడంటే అతి శయోక్తి కాదేమో!

 

అమ్మ తన పిల్లలకి పంచే ప్రేమ లాగా మనము కూడా ఇతరుల పట్ల వ్యవహరిస్తే లోకం నిజంగా ఒక వసుదైక కుటుంబం కాదా? ఆలోచించండి!

 

 

 

RTS Perm Link

Comments (2)

అక్షయ పాత్ర – ఆత్మ విశ్వాసం!

 

ఇంట్లో వంట చేసుకునే ప్రతి మనిషి సమస్య – అక్షయ పాత్రలు. ‍అక్షయ పాత్రలు అంటే ఎంచక్కా వంట చేయకుండా ఎంత మందికైనా భోజనాన్ని సప్లై చేసే పాత్ర కాదు, ‍ అసలు అలాంటిది ఏమీ లేదని నా అభిప్రాయం. ఏదో నా లాంటి వారిని మభ్య పెట్టేందుకు సృష్టింపబడిన వస్తువు. ‍అక్షయ పాత్రలు అంటే ఎన్ని సార్లు తోమినా మళ్ళీ మళ్ళీ వచ్చే వంటింట్లోని పాత్రలు.

 

మామూలుగానే మనకి వంటింట్లోకి వెళ్ళడమంటే చికాకు (తినడానికి అయితే మాత్రం కాదు సుమీ!) చిన్నప్పుడు అమ్మ చిలక్కి చెప్పినట్టు చెప్పేది -‍ వంట నేర్చుకో , పనికి అలవాటు పడు అని! మనం వింటేగా. పైగా పెద్ద పోజు కొట్టి ‍ నాకా అవసరం లెదు అమ్మా ‍ చక్కగ ఉద్యోగం చేసి సంపాదించి అన్ని పనులకి మనుషులను ఏర్పాటు చేసుకుంటాగా అని గర్వంగా డైలాగులు వదిలేదాన్ని. ఆహా! నీ పని ఇలా ఉందా అని ‍ దేవుడు ఇదిగో పని సహాయానికి మనుషులు దొరకని ఈ దేశం లో నన్ను పడేశాడు! సరే ‍ అవసరం మనది కదా ‍ – తప్పుతుందా !‍ ‍ ఎంతో కొంత వంట నేర్చుకున్నా. కానీ మొన్నీ మధ్య వరకు గిన్నెలని చూస్తే మాత్రం మహా చిరాకు వచ్చేది. అసలే మనకి ఏ పని అయిన కష్ట‌ పడి చేయడం ఇష్టం లేదాయె. అలా అని ఇదేమీ ఇష్ట పడి చేసే పనా అని అదో భావన – మొన్నటి వరకు.

 

వంటింట్లో ఎలాగూ తప్పదు ‍ ఏదో కాస్త విశ్రాంతి కోసం అని ఇలా బ్లాగు మీద పడితే ఇక్కడా అదే గొడవా అని అనుకోకుండా కాస్త ఓపిగ్గా చదవండి.

 

నాకు పుస్తకాలు చదవడం బాగ అలవాటు.మొన్నీ మధ్యన ‍ ఆంగ్లంలో “Time Shifting” అని ఒక పుస్తకం చదివాను. అందులో మన ఈ అక్షయ పాత్రలకు ఆత్మ విశ్వాసంకు పెట్టిన లింకు చూసి బుర్ర తిరిగి పోయింది.మ‍ంచం మీద పడుకుని చదివా కాబట్టి సరి పొయింది గానీ లేక పోతే తప్పకుండా కింద పడి పోయేదాన్ని. హాస్యాన్ని కట్టబెట్టి మేటరు లోకి వస్తాను. ఆ పుస్తక సారాంశం ‍ నేను రాసిన “ఈ‍ క్షణ‍ం” చదివితే అర్ధం అవుతుంది.  రోజూ రాత్రి  ‍అక్షయ పాత్రలను తోమడం వలన‌ మనము నిదానించడం కుదురుతుంది. అంతే కాకుండా, ఆ సమయంలో మనము ఈ రోజుని సమీక్ష చేసుకోవచ్చు అని రాసుంది. అంతే కాదండోయ్ ‍ మన చేతిలో ఉన్న పని, క్రమం తప్పకుండా చేస్తే‍ ఖచ్చితంగా అయ్యే పని కాబట్టి, ఈ ‍అక్షయ పాత్రలను తోమడం ద్వారా మన ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది అని రాసుంది.

 

ఎంతో చక్కగా – చికాకు పనులను కూడా మన ధ్రుక్పధం మార్చుకుంటే ఎంత చక్కగా చేసుకోవచ్చో  - అని రాసిన ఆ మహానుభావుడికి సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది.

 

నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఇక అక్షయ పాత్రల గొడ‌వ తగ్గింది.

 

 

RTS Perm Link

Comments (2)

ఆశయాలు

జీవితంలో చేయదలుచుకున్న పనులు:

1.సైకిలు నడపడం (నాకు స్కూటరు నడపడం వచ్చు కానీ సైకిలు నడపడం రాదు అంటే నమ్ముతారా?)
2.సకుటుంబ
సమేతంగా యూరోప్ మరియు ఇతర ప్రదేశాలను చూడడము
3.ఈత కొట్టడం (అయిదు అడుగుల నాలుగున్నర అంగుళాల మనిషినై ఉండి నాలుగు అడుగుల లోతులో నీటిలో మునిగిపోయి ఇహ ఇంతటితో మన పని సరిఅనుకున్న మనిషికి కొంచెం కష్టమైన పనే!)
4.Hang gliding
చేయడం! దీనిని తెలుగు లో ఏమంటారో తెలియక ఆంగ్లంలో రాసాను. క్షమించాలి
!
ప్రస్తుతానికి
ఇవి

RTS Perm Link

Comments (3)

సాధారణమైన పౌరుడికి విసుగెత్తితే…..?

మొన్నీ మధ్యన “A Wednesday” అని ఒక హిందీ సినిమా చూసాను! ఎంతో అర్ధవంతమైన సినిమా! ఒక సాధారణమైన పౌరుడికి విసుగెత్తితే ఏమౌతుందో చాలా చక్కగా చూపించారు! పనిలొ పనిగా యంత్రాంగమునకు కూడా బానే చురకలు పెట్టారు. ఏమంటారు?

RTS Perm Link

Comments

ఈ క్షణము!

చాలా రోజులు అయ్యింది బ్లాగు రాసి. ఎందుకు రాయలేదు అని మీరు అడగలేదు. ఒక వేళ అడిగినాఅబ్బో ! నేను చాలాబిజిఅని తప్పించుకునేందుకు ప్రయత్నిచను! రాయలనిపించలేదు, రాయలేదు! అదేమిటీ? మరి బ్లాగు మొదలు పెట్టడము ఎందుకు అంటే దానికీ మన దగ్గిర ఒక సమాధానము ఉంది - చదవండి.

పని అయినా ఇష్ట పడి చేయాలి తప్పితే కష్ట‌ పడి చేయకూడదు ఒక సిధ్ధాంతము తుచ తప్పకుండా పాటిస్తాను.ప్రతీ క్షణానినీ తనివి తీరా ఆస్వాదించడము, భూతో భవిష్యతి అనుకుని క్షణములో మైమరిచిపొవడము, అం‍తులేని ఆనందం అనుభవించడము ఇది నా మనస్తత్వం! అలా అని ప్రతి పనినీ నిదానముగ చేస్తాననుకుంటే మీరు బుట్టలో కాలు వేసినట్లేనండొయ్! కాల గతిని క్రమము తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను! ఉదాహరణకు పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే క్షణంలో త్వరగానే కదులుతాను! అలాగే చిన్ని పాపాయి బోసి నవ్వులని ఎంత సేపు అయినా ఆనందంతో చూస్తూనే ఉంటాను!

! పెద్ద చెప్పొచ్చావులే, మేము కూడా చేస్తూ ఉంటాము!ఇందులో కొత్తేమిటి అనుకుంటున్నారా? ” క్షణానఅని ప్రతి పనినీ మనస్ఫూర్తిగా చేయడమే ఇందులొ కొత్తదనము! చాల మంది నన్ను చూసి, వారు అనుకుంటున్న చిన్న చిన్న విషయాలకు కూడా నేను స్పందించే తీరు చూసి కొంచెం టెక్కు ఎక్కువ అని అనుకోవడము కూడ తెలుసు! కానీ వారికి అర్ధం కానిది ఒకటే – “జీవించడం!”

ఇన్నాళ్ళూ రాయలనిపించలేదు, రాయలేదు. ఇప్పుడు అనిపిం‍చింది రాసాను.

నిన్న తిరిగి రాదు,రేపు మరలి పోదు. గతంలోనే కూరుకుని పోయినా, భవిష్యత్తులోకి ఎగిరి పోయినా క్షణాన నేను జీవించనట్లే! నా జీవనానికి నాంది, పునాది,ఆది మరియు అంతము క్షణము! క్షణము!

RTS Perm Link

Comments (3)

« Previous entries

RTSMirror Powered by JalleDa

FireStats icon Powered by FireStats