ఇన్నాళ్లూ… గృహిణిగానే ఉన్న నేను… ఓ రెండేళ్ల క్రితం జాబ్‌లో చేరాను. ఇంటికే పరిమితమైన నాకు అంతగా విషయాలేమీ తెలిసేవి కావు. అయితే ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చాక ఒక్కోటి తెలుస్తుంటే.. ఇన్నాళ్లూ ఎంత మిస్సయ్యాను అనిపించింది.
ఇక బ్లాగ్ ప్రపంచంలోకి కూడా ఈ మధ్యే వచ్చాను. మా అబ్బాయి రాస్తుండే బ్లాగును చూసి ప్రేరణ పొందిన నేను.. నేనూ ఈ కారుణ్య పేరుతో బ్లాగ్ ఓపెన్ చేశాను. సాహిత్యం అంటే చాలా మక్కువ ఉన్నప్పటికీ పెళ్లయ్యాక, బాధ్యతల్లో పడిపోయి కొద్ది కొద్దిగా దూరం అయ్యాను. ఇప్పుడు మళ్లీ సాహిత్యం చదివే అవకాశం, చేతనైనంత రాసే అవకాశం కుదిరింది.
నా రాత, శైలి కాస్త బాగానే ఉంటాయనుకుంటున్నా… పాఠకులైన మీకు నచ్చుతుందో, నచ్చదో.. ఏదేమైనా నన్ను మీలో ఒకరిగా చేర్చుకుంటారని ఆశిస్తూ…
కారుణ్య
4