చెప్పాలి… గుర్తుండిపోయేలా..!!

పొద్దుట్నుంచీ ఒకటే ఆలోచన
ఏదో రాయాలి, చెప్పాలి
ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి
చెప్పాలన్న విషయంలో స్పష్టత ఉన్నా,
ఎలా ప్రారంభించాలో తెలియని అయోమయం

కానీ చెప్పాలి..
తానున్నంతవరకూ గుర్తుండిపోయేలా
అనుక్షణం గుర్తు చేస్తుండేలా
అసలు మరపు అనేదే ఎరుగకుండా
సూటిగా చెప్పాలి
కానీ ఎలా…?

రోజులా రేపు తెల్లారుతుంది
అదేం పెద్ద విషయం కాదు
ఆ రేపటిలోనే ఎంతో విషయం ఉంది
ఆ రేపటిలోనే ఎంతో జీవితం ఉంది
ఆ రేపటి రోజునే
మా ప్రియమైన పుత్నరత్నం
దేవకన్యలు తోడురాగా
ఈ భూమిమీద వాలిపోయాడు

మావాడి ప్రతి పుట్టినరోజునా
వచ్చే గిఫ్ట్‌లను చూస్తూ.. ఆ దేవుడికి
మనసులో థ్యాంక్స్ చెప్పేస్తుంటా
ఎందుకంటే…
ఆ దేవుడు చాలా పెద్ద గిఫ్ట్‌ను
తన రూపంలో మాకు ఇచ్చినందుకే…

విషయం పక్కదారిపట్టకముందే…
బ్యాచిలర్‌గా చివరి పుట్టినరోజు
జరుపుకుంటున్న ముద్దుల తనయుడా…
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది అందరూ చెప్పేదే
కానీ పెళ్లంటే…
కొత్తల్లో లోకాన్నే మర్చిపోయేలా ఉండటమూ కాదు
పాతబడేకొద్దీ అనుమానాలూ, అవమానాలూ కాదు
పెళ్లంటే ఇద్దరి మధ్య ఉండే నమ్మకం

పరస్పరం నమ్మకం, ప్రేమాభిమానాలతో
మీ జీవితం నల్లేరుమీద నడకలా
మూడు పువ్వులు, ఆరు కాయలుగా
హాయిగా, ఆనందంగా సాగిపోవాలని
ఇలాంటి పుట్టినరోజులు
మరిన్ని జరుపుకోవాలని
మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ…
విష్ యూ హ్యాపీ బర్త్ డే మై డియర్ సన్…!!


(డిసెంబర్ 21న పుట్టినరోజు జరుపుకోబోతున్న మా పుత్రరత్నానికి ఆశీస్సులతో…)

RTS Perm Link

5 Comments so far

  1. తృష్ణ on December 20th, 2010

    happy birthday to your little one.

  2. మీ అబ్బాయికి నా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించండి.

  3. kaarunya on December 20th, 2010

    @తృష్ణ గారు, @వేణూశ్రీకాంత్ గారు – చాలా థ్యాంక్సండీ..! మీ శుభాకాంక్షలు మా అబ్బాయికి అందించేసాను 🙂

  4. siva on May 23rd, 2012

    Hello,

    కారున్య గారు మె బ్లాగ్ kaarunya.blogspot.com కనపడుట లేదు.
    ఈ బ్లాగ్ మీది కాకపొతె క్షమించండి

  5. kaarunya on June 20th, 2012

    ధన్యవాదాలు శివక్రిష్ణగారు… మీరు చెప్పే బ్లాగ్ నాదే. ప్రస్తుతం కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న కారణంగా ఆ బ్లాగును టెంపరరీగా నిలిపివేశాను. ఎగ్జామ్స్ అయిపోగానే మళ్లీ కొనసాగిస్తాను. ధన్యవాదాలు.

Leave a reply

RTSMirror Powered by JalleDa