నాన్న లేని అమ్మ..!!

నువ్వు దూరమై ఏడాది గడుస్తున్నా
కాలం ఎప్పట్లాగే పరుగెడుతోంది
కాలంతోపాటు మనుషులు కూడా…

నువ్వు దూరమైన అమ్మకూడా
కాలంతో నిశ్శబ్దంగా అడుగులేస్తోంది
అయితే నువ్వు ఉన్నప్పటి అమ్మకూ
నువ్వు లేనప్పటికీ అమ్మకూ
తేడా ఇప్పుడే స్పష్టమవుతోంది

నువ్వు లేని ఆమె గతంలోలా
పెద్దరికంగా, ధైర్యంగా లేనేలేదు
ఆమెలో ఏదో తెలీని బాధ
అలాగనీ దాన్ని బయటపడనీయదు
నోరువిప్పి చెప్పదు
బహుశా.. తానే బాధపడితే
పిల్లలు ఇంకెంత బాధపడతారోనని
లోలోపలే కుములుతోందేమో…

అందుకే.. తను మరీ చిన్నపిల్లయిపోయింది
ఇప్పుడు ఆమె మాకు అమ్మకాదు
మేమే ఆమెను పాపలా చూడాల్సి వస్తోంది

పసిపిల్లలు తెలీని వారిని చూస్తే
హడలిపోయినట్లుగా..
ఆమె మాకు కష్టాలొస్తే హడలిపోతోంది
తెలిసినవారిని పిల్లలు హత్తుకున్నట్లుగా
మాకు సంతోషం కలిగితే
గుండెలకు హత్తుకుని ఆహ్వానిస్తోంది…

అదేంటమ్మా అలా చేస్తున్నావ్? అంటే,
చిన్నపిల్లలా ఉడుక్కుంటోంది…
నా పిల్లలు నాకే మంచి చెడ్డలు చెప్పటమా?
అని ప్రశ్నించటం మానేసి…
అందరూ నన్నే అంటున్నారనీ
అమాయకంగా ఏడుస్తోంది…

అందుకే ఆమెను ఓ పసిపాపలా
కంటికి రెప్పలా కాపాడుకోవటం మినహా…
పై లోకానికి వెళ్లిన ఓ నాన్నా…
నిన్ను తెచ్చివ్వలేని నిస్సహాయులం మేం…
ఆమెకి కలలోనైనా కనిపించి
నువ్వు ఉన్నప్పటి మా అమ్మలా
తనని ఉండమని చెప్పవూ…?!

RTS Perm Link

5 Comments so far

 1. poorni on October 29th, 2010

  🙁

 2. bangaru ramachary on October 31st, 2010

  amma shobha
  nannaleni amma kavitha chadivinanu.aardrathatho wrasavu.eekavithaku peru nannaloniamma anedi baguntundemo .

 3. Durga Dingari on October 31st, 2010

  Sobha,

  Amma nannala bandham manato vunna bandham kanna gattidi, annella anubandham, vaariddarimadhya premaanuraagaalu, konni rojullo marchi poyedi kaadu. mana vishayanike vaste mana pellillayi konnellugaa kalisi vuntunna bhaarya bhartala sambandham entagaa penavesukupoyindo alochiste telustundi. Office nundi raavadam kaasta aalasyamaina manasu aaraatapadutundi varu gummamloki raagaane, chirunavvu vacchi cherutundi, poddutinundi miss ayyam kaabatti enno kaburlu cheppalanipistundi. manam puttaka mundunundi penavesukunna anubandham okoka gnyapam gundelni tolichi baadha pedutundi, poddune levagaane kanipinche manishi ika ledu ani taluchukovadaaniki koodaa vaariki manasoppadu.
  Mimmalni pasipaapala ame choosukunnadi ippudu meeru aameni pasipaapalaa choosukovalsi vaste tappakundaa cheyyalsinde mari.
  Sobha mee manasulo chelaregutunna bhaavalani poortigaa ardham chesukogalanu, endukante nenu koodaa ade naavalo prayanistunna daanni kaabatti.
  Premato, Durga.

 4. Shobha on November 1st, 2010

  రామాచారిగారూ ధన్యవాదాలండీ.. మీరన్నట్లుగా ఈ కవితకు నాన్నలోని అమ్మ అనే పేరు కూడా బాగుంటుంది.. అయితే నాన్న లేకుండా ఉన్న అమ్మ ఎలా ఉందనే రాశాను కాబట్టి, నాన్న లేని అమ్మ పేరే కరెక్టుగా సరిపోతుందని అలా పెట్టాను.

 5. Shobha on November 1st, 2010

  దుర్గా..

  అమ్మ కవిత నిన్ను బాగా కదిలించిందని, కదిలిస్తుందని నాకు తెలుసు. నిజంగా ఇద్దరం ఒకే నావలో పయనిస్తున్నవాళ్లమే.. అందుకే మనసులో చెలరేగే భావాలను సులభంగా పసిగట్టగలం.

  నవంబర్ 7 వచ్చేస్తోంది.. అప్పుడే నాన్న దూరమై సంవత్సరం గడిచిపోయిందా అన్నట్లు అనిపిస్తోంది.. ఆనాటి జ్ఞాపకాలు కూడా బాగా బాధిస్తున్నాయి. అయినప్పటికీ జరగాల్సిన పనులు చూడాల్సిందే కదా..!

Leave a reply

RTSMirror Powered by JalleDa