మాట ఇస్తావు కదూ..?!

mothers-love

నీ కళ్లు…
నవ్వుల పువ్వులై పలుకరించాలని

నీ చూపు…
వెండి వెలుగులు విరజిమ్మాలని

నీ పెదవులు…
ఎల్లప్పుడూ నిజమే చెప్పాలని

నీ ముఖం…
ప్రశాంతతకు మారుపేరవ్వాలని

నీ మాటలు…
నేనున్నాననే ధైర్యాన్నివ్వాలని

నీ మౌనం…
మాటల సీతాకోకలై ఎగరాలని

నీ చేతులు…
పదిమందికి ఆసరా అవ్వాలని

నీ నడక…
అందరూ నిన్నే అనుసరించాలని

మాట ఇస్తావు కదూ..?!

RTS Perm Link

4 Comments so far

 1. parimalam on October 16th, 2009

  తల్లి తన చిట్టితల్లిని మరేమడుగుతుంది ? మాట ఇచ్చేవయసొచ్చేసరికి మాటవింటారా అని !
  *మీకూ మీకుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు !

 2. kaarunya on October 20th, 2009

  చాలా లేటుగా చూసుకున్నందుకు మన్నించగలరు.. (సెలవులో అమ్మదగ్గర వాలిపోయా..!)

  మీకూ, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు (బిలేటెడ్)..

  చిట్టి తల్లులపై అందరికీ అలాంటి ఆశే.. మీరన్నట్లు వయసొచ్చేసరికి మాట వింటారా అనేది నాకూ సందేహమే..!! 🙂

 3. carthik on November 8th, 2009

  abba aaphoto entha bagundooooo

  ekkadasampadinchaa randi baabu
  kavitha photo super andi

 4. kaarunya on November 13th, 2009

  ఇంకెక్కడ సంపాదిస్తాం చెప్పండి.. ఫొటోల భండాగారం గూగుల్‌లోనే… 🙂

Leave a reply

RTSMirror Powered by JalleDa