ఈ పాపం ఎవ్వరిది..?

Child

ఈరోజు ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్తుంటే.. ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండటంతో బస్ స్లోగా వెళ్తోంది. కిటికీవైపు కూర్చున్న నేను బస్టాపుల్లో, ప్లాట్‌ఫాంపై నిలుచున్న జనాలు అవతలివైపుకు చాలా ఆసక్తిగా చూస్తుండం గమనించాను. వీళ్లంతా అంత ఆసక్తిగా ఏం చూస్తున్నారబ్బా..?  అనుకుంటూ ఇటువైపు తలతిప్పి చూశాను.

అక్కడ పట్టుపని ఐదేళ్లు కూడా ఉండని ఓ చిన్న అమ్మాయి ఒక తాడుపై నడుస్తూ కనిపించింది. తాడుపై నడవటంలో ఆశ్చర్యం ఏముంది అంటారేమో…? ఏడడుగుల ఎత్తులో అటూ ఇటూ కర్రలకు కట్టిన ఒక తాడుపై నడుస్తోంది తను. కిందన ఆమె తల్లి ఒక డప్పును వాయిస్తుంటే, ఆ అమ్మాయి పక్కనే ఇంకో డప్పు వాయిస్తూ తండ్రి తనతో ఆ ఫీటు చేయిస్తున్నాడు.

అంత చిన్నమ్మాయి ఆ తాడుపై బ్యాలెన్స్ చేస్తూ నడవటమే కాకుండా, చేతుల్లో ఓ లావాటి కర్రను కూడా పట్టుకుని నడుస్తోంది. అంతేకాదు ఆ అమ్మాయి తాడుమీద ఎలా నడుస్తోందంటే… ఒక అడుగు కింద చిన్న ప్లేటునొకదాన్ని పెట్టుకుని, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఈ ప్లేటును కూడా ముందుకు తీసుకెళ్తోంది.

కర్ర, ప్లేటులు కిందపడకుండా, తాను పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏకకాలంలో ఆ చిన్న అమ్మాయి పడుతున్న… కష్టం చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయి పక్కనే డప్పు వాయిస్తూ నడుస్తున్న తండ్రిని, తల్లిని చూస్తే చెప్పలేనంత కోపం వచ్చింది.

చూడు నాన్నా వాళ్లెలా చేస్తున్నారో అన్నట్లుగా నేను మా అబ్బాయి వైపు చూశాను. వాడి ముఖం అప్పటికే కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది. హాయిగా ఆడుతూ, పాడుతూ స్కూలుకెళ్లాల్సిన వయసులో తమను సాకాల్సిన తల్లిదండ్రులనే సాకుతున్న ఈ చిన్నారుల గురించి తల్చుకుంటే గుండెల్లో కలుక్కుమంటుంది.

చాలా సందర్భాలలో ఈ అమ్మాయిల్లాంటి చాలామంది.. తల్లిదండ్రులకు ఆసరాగా (బలవంతగానో, ఇష్టంగానో) ఏదో ఒక పనిచేస్తూ ఉన్నారు. పొట్టకూటికోసం చాలామంది చిన్నారులు యాచక వృత్తిలోనూ.. మరికొంత మంది చిత్తు కాగితాలు ఏరుకుంటూ తల్లిదండ్రులతో కనిపించటం నేడు షరా మామూలే..!

పలకా, బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చిట్టి పొట్టి చేతులతో ఇంటింటికి వెళ్ళి యాచించే పిల్లలు.. ఇటుక బట్టీలు, హోటల్స్, పెట్రోల్ బంక్‌లు, వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ అడుగడుగునా దుర్భర జీవనాలు గడుపుతున్న బాలలే నేడు ఎటుచూసినా దర్శనమిస్తున్నారు.

ఈ బాల యాచకులను, బాల కార్మికులను మినహాయిస్తే.. పలు వ్యాపార సంస్థల్లో వెట్టిచాకిరి చేస్తు కాలం వెళ్ళదిస్తున్న 14 సంవత్సరాల వయస్సు గల బాలల సంఖ్య కూడా కొకోల్లలుగానే ఉంది. పిల్లలను పనుల్లో పెట్టకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిసినప్పటికి, కొంత మంది వ్యాపారులు చిన్నారులను బాల కార్మికులుగా మార్చడం మామూలైంది.

ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే.. బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకున్న దాఖలాలేమీ కనిపించటం లేదు. ఒకవేళ తీసుకున్నా అవి పేపర్, టీవీ ప్రకటనల్లో మాత్రమే..! అనేక పథకాలు చేపట్టి బాలలను పాఠశాలల్లో చేర్పించామని సంబంధిత అధికారులు కాకి లెక్కలు చూపిస్తున్నారేగానీ.. వాస్తవం మరో రకంగా ఉంటోంది.

అయితే ఈ పరిస్థితిని ఇలాగే వదిలేయాల్సిందేనా..? దీనికి పరిష్కారమే లేదా..?

 

RTS Perm Link

6 Comments so far

 1. rayraj on October 5th, 2009

  “అంత చిన్నమ్మాయి ఆ తాడుపై బ్యాలెన్స్ చేస్తూ నడవటమే కాకుండా, చేతుల్లో ఓ లావాటి కర్రను కూడా పట్టుకుని నడుస్తోంది.”

  ఈ వాక్యంలో మీ భావం, నడవటమే కష్టం కదా! ఆ లావాటి కర్రని మోయటం దానికి డబుల్ కష్టం కదా అనే అనుకుంటున్నాను.

  🙂 కానీ స్టోరీ అది కాదు. ఆ కర్ర ఉండటం వల్లే బ్యాలెన్సు వస్తుంది. మీ పిల్లాడు దీన్ని చూసినప్పుడు, నిజానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించిన పాఠం చెప్పొచ్చు. మీరు కాస్త హేతువాదులతో తిరిగి సైన్సు నేర్చుకుంటే, ఇంతలావున బాధ పడిపోరు. ఇంకొంచెం పెద్ద క్లాసులో దాన్ని లెక్కలు కట్టడం నేర్చుకునేటప్పుడు, బహుశా ఇలాంటి భావోద్వేగాలు ఉండవు.

  ఆ పిల్ల చేసేది కష్టమే! అదే వయస్సులో ఉన్న చిన్నపిల్లలకీ రష్యాలో అయితే ఇలాగే బోళ్డెంత కష్టపెట్టి “జిమ్నాస్టిక్సు”నేర్పిస్తారు. ఆ కష్టం అందరూ పడలేరు గాబట్టే, అది “టాలెంట్” ఔతుంది.

  బీదరికానికీ, ప్రతి “కష్టానికి” లింకు పెట్టి బాధ పడకండి. ఆ అమ్మాయి టాలెంటును చూసి ఆనంద పడండి. ఈ బీదరికాన్ని తొలగించే మార్గం చూడండి. చాలా సార్లు, మనిషిలోని టాలెంట్‌కి ఆదరణ లేక, అవకాశాలుగా మార్చులేక ప్రజలు బీదరికంలో ఉంటారు. వ్యక్తిలోని టాలెంటునే ఇక్కడా తల్లి దండ్ర్లులు డబ్బు చేసుకుంటున్నారు. అందులో తప్పేమీ కూడా లేదు. మీ అబ్బాయికి సినిమా ఛాన్సు వస్తే, తీసుకెళ్తారా లేదా!?

  హోప్ యూ గెట్ మై పాయింట్. When you feel like this, look what other opportunity can be “shown” to them. Because, most of the time, this of lack of information and knowledge is whats keeping our progress at bay.Isn’t the same reason that’s working against in your career!?

 2. Sree on October 6th, 2009

  ఈ మొత్తం పోస్ట్‌కంటే, rayraj గారి వ్యాఖ్య నిడివే ఎక్కువైనట్టుంది కదూ!:)

  ఈ పోస్ట్‌లో బ్లాగర్ ఉపయోగించిన ఒక “అనవసర” వ్యాక్యాన్ని పట్టుకుని, దాన్ని సాగదీసి, లాగదీసి, చింపి, చాంతాడంత చేసేసి అసలు బ్లాగర్ బ్లాగు వ్రాసిన ఉద్దేశ్యానికి ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కోణంలో మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. Centre of Gravity, Gymnastics, Talent etc. అంటూ చాలా ఎక్స్‌ట్రాలే చే(వ్రా)సారు పాపం..

  “మీరు కాస్త హేతువాదులతో తిరిగి సైన్సు నేర్చుకుంటే, ఇంతలావున బాధ పడిపోరు.” అంటూ సానుభూతితో పాటు ఉచిత సలహాలు కూడా కురిపించేసారు.

  “మీ అబ్బాయికి సినిమా ఛాన్సు వస్తే, తీసుకెళ్తారా లేదా!?” అంటూ ఆత్మశోధన చేసుకోమన్నారు కూడా..
  క్రికెట్, టెన్నిస్, సినిమా అవకాశాలు వంటి బహుముఖ లాభాలు (డబ్బు, పరపతి మొ.) ఉన్న రంగాలతో సమానంగా భావించేసుకుని – పొట్టకూటి కోసం కన్నబిడ్డలతో ప్రాణాపాయకరమైన “talent”లు ప్రదర్శించడాన్ని పోల్చేసారు.

  “వ్యక్తిలోని టాలెంటునే ఇక్కడా తల్లి దండ్రులు డబ్బు చేసుకుంటున్నారు. అందులో తప్పేమీ కూడా లేదు.”
  ఈయన వ్యాఖ్య, ప్రత్యేకించి ఈ లైన్ చదివాకా — ఈయన కూడా పనిపాటా మానేసి, తన పిల్లల దగ్గర so called జిమ్నాస్టిక్స్, టాలెంట్ల ప్రదర్శనతో పొట్ట నింపుకుంటున్నారేమో.. అందుకే ఆ సోమరి తల్లిదండ్రులను -తన వర్గం వారు కాబట్టి అంతలా వెనకేసుకొస్తున్నారేమో.. అనేటటువంటి సందేహాలు ఎవరికైనా కలిగితే ఆశ్చర్యముందా!!

  పొట్టకూటి కోసం కన్నబిడ్డల దగ్గర అలాంటి Talent ప్రదర్శనలే ఇప్పించనక్కర్లేదండీ rayraj గారూ..!
  కాదంటారా.. ఈ నా వ్యాఖ్యకు కూడా గుడ్డిగా అడ్డదిడ్డంగా వాదించేయాలని సిద్ధపడిపోయారా?

  లోకంలో సైన్సుకి, మానవ మేథస్సుకి అందని విషయాలు చాలానే ఉన్నాయండీ.. పిల్లలపై ప్రేమ, ఆకలి వంటివి వాటిలో కొన్ని మాత్రమే.. అర్థం చేసుకుంటారు కదూ!!

  (వామ్మో.. నా వ్యాఖ్య నిడివి కూడా కొండవీటి చాంతాడైంది సుమా!!)

 3. rayraj on October 6th, 2009

  నిన్న ఇంపల్సివ్‍గా వేసేసిన కామెంటుకు, బ్లాగరు ఎలా ఫీలయ్యారో అని నేను ఫీలయ్యి,ఈ బ్లాగుని కష్టపడి వెతికి పట్టుకొని మళ్ళీ వచ్చాను. సర్పైజింగ్లీ, వేరెవరో తెగ ఫీలయ్యారు.

  @శ్రీ: యూ మిస్డ్ ది హూల్ పాయింట్.

  @కారుణ్య – అసలు బ్లాగరి :
  నిర్బంధ విద్య, బానింగ్ చైళ్డ్ లేబర్ అనేవి “పరిష్కారాలుగా” భావించారు. అవే పరిష్కారం అయ్యింటే, అవి ఇంకొంచెం ఎక్కువగానే విజయవంతం అయ్యుండేవి. కానీ, ది సో కాళ్డ్ “విద్య”, రెలటివ్ టాలెంట్లను చంపేసి, అవకాశాలను మరింత దూరం చేస్తోంది. ఇదే “కష్టం”, మరి కొంత సంపన్న పిల్లల్లో, “టాలెంటుని అభివృద్ది” చేసుకోడానికి పడే “కష్టం” ; ఏ కారణం వల్లనైనా గావచ్చు, ఆ పని ఆల్రెడీ చేసేయగలుగుతున్న పిల్లకి, అదే టాలెంటు “అభివృద్ది”కి కారణంగా మార్చలేకపోతున్నాం.

  ఏ చేతిలో కర్ర వల్ల మరింత కష్టం ఇస్తోందని భ్రమిస్తున్నారో, ఆ చేతిలో కర్ర నిజానికి నడకకి బ్యాలెన్సుని ఇస్తున్న పరిష్కారమే!

  ఇప్పటికీ నే చెప్పిన విషయం ఎక్కకపోతే, ఆ తప్పు మనిద్దరిదీ కాదు లెండి. 🙂

 4. Sree on October 7th, 2009

  @ rayraj –
  తమరి తాజా వ్యాఖ్య : “ఏ చేతిలో కర్ర వల్ల మరింత కష్టం ఇస్తోందని భ్రమిస్తున్నారో, ఆ చేతిలో కర్ర నిజానికి నడకకి బ్యాలెన్సుని ఇస్తున్న పరిష్కారమే!”

  నిన్న నేను మొత్తుకున్నది కూడా అదే మహాశయా:
  “ఈ పోస్ట్‌లో బ్లాగర్ ఉపయోగించిన ఒక “అనవసర” వ్యాక్యాన్ని పట్టుకుని…..”

  అయినప్పటికీ మీరు మీ వ్యాఖ్యలో – “నిన్న ఇంపల్సివ్‍గా వేసేసిన కామెంటుకు..” అంటూ బ్లాగర్ ఫీలింగుని ఫీలవ్వలేకపోయాననే ఫీలింగులో మళ్లీ వెతుక్కుంటూ (కష్టపడి) వెనక్కి వచ్చి చింతిస్తున్నట్లు నటించినప్పటికీ, చివరలో – “ఇప్పటికీ నే చెప్పిన విషయం ఎక్కకపోతే, ఆ తప్పు మనిద్దరిదీ కాదు లెండి.” అంటూ మళ్లీ కించపరిచారు.

  మొత్తానికి నేను మిస్సయిన హూల్ పాయింట్ ఏమిటో నాకు తెలియడం లేదు.. 🙂

 5. anusri on February 16th, 2010

  hello న పెరు అను మీరు రాసిన కవిత చాల బాగుంది నెను ఒక ప్రొమూ తీస్థున్న ఆంధులొ మీ కవిత use చెధామని ఆనుకుంతున్న మీకు ఇస్తమయితె

 6. kaarunya on February 16th, 2010

  ధన్యవాదాలు.

  ఇక కవిత వాడుకోవాలన్నారు కదా… అయితే అది ఏ కవితో నాకు సరిగా అర్థం కావటం లేదు.

  ఎందుకంటే మీరు నాకు కామెంట్ పెట్టింది ఈ పాపం ఎవ్వరిది అనే ఆర్టికల్‌కి. మీరు ఏ కవితను వాడుకోవాలనుకున్నారో చెప్పండి, తప్పకుండా నేను అనుమతి ఇస్తాను.

Leave a reply

RTSMirror Powered by JalleDa