ఉండాలోయ్ ఉండాలి..!

Bhanumathi2

ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి

అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి

స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి

యింటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకి బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి

తలుపుకి గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి

జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి

అరవలకు పొగాకు
ఆంధ్రులకు గోగాకు
మళయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి

(దివంగత పి.భానుమతీ రామకృష్ణ.. నవంబరు 1947 చందమామ పత్రికలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం… ఆ మహానటి జన్మదినం (సెప్టెంబర్ 7) సందర్భంగా మీ కోసం…)

RTS Perm Link

7 Comments so far

 1. subhadra on September 7th, 2009

  good.tEru amtE emitandi.

 2. kaarunya on September 7th, 2009

  ఉత్సవాలు జరిపేటప్పుడు రథం లాగుతారు కదండీ. రథాన్నే తేరు అని అంటారు. 🙂

 3. bagundi.

  గాంధీకి మేక endukandI…!?

 4. SRRao on September 7th, 2009

  మంచి పాట గుర్తు చేసారు. కృతజ్ఞతలు.

 5. kaarunya on September 7th, 2009

  SRRaoగారూ, ప్రేమికుడుగారూ ధన్యవాదాలండీ.. 🙂

  గాంధీజీ ఎప్పుడూ మేకపాలు తాగుతుంటారటండి. అందుకనే భానుమతిగారు అలా రాసారనుకుంటా…! 🙂

 6. parimalam on September 8th, 2009

  ఐతే మీరు భానుమతిగారి అభిమనులన్న మాట !

 7. kaarunya on September 8th, 2009

  అవునండి… 🙂

Leave a reply

RTSMirror Powered by JalleDa