స్నేహితులు… అచ్చం నీలాగే…!!

friend10

అందరికీ స్నేహితులు ఉంటారు
అచ్చం నీలాగే…

నీతో ఉంటే కాలం ఉనికిని
నన్ను నేనే మర్చిపోతుంటా
ఎందుకంటే…
నన్ను నీలోనే కదా చూస్తున్నా

నీతో ఉంటే నవ్వుల పువ్వుల వికసిస్తాయి
మమతానురాగాలు పరిమళిస్తాయి
దయతో హృదయాన్ని స్పృశిస్తావు
ప్రేమతో మనసును జయిస్తావు
నువ్వో అద్భుత శక్తివి..
అంతకుమించిన ఆసరావి…

నీ సుతిమెత్తని మందలింపులు
నన్నెంతగా మార్చాయని
నిర్లిప్తపు రోజులెంత మారాయని
కాలమెలా పరుగులు తీస్తోందని
నీవులేనప్పటి నిండుదనం
నీ రాకతో పరిపూర్ణం….

స్వచ్ఛమైన స్నేహానికి
చిరునామాగా మిగిలిన నేస్తమా…
నేను నిజంగా నమ్ముతున్నా
అందరికీ నీలాంటి స్నేహితులుంటారని
మరి అచ్చం నీలాంటి స్నేహాన్ని చూడాలంటే…
నా స్నేహితుడిని చూపించాల్సిందే…!!


——– స్నేహితుల రోజు శుభాకాంక్షలతో…

RTS Perm Link

3 Comments so far

 1. ప్రేమికుడు on August 1st, 2009

  అవునండి అందరికీ మంచి స్నేహితులు ఉంటారు.
  వాళ్ల స్నేహాన్ని స్వీకరించ గలిగే మంచి హృదయం మనకీ ఉండాలి.

  కవిత బాగుంది. 🙂

 2. kaarunya on August 2nd, 2009

  ధన్యవాదాలు… 🙂

 3. parimalam on August 2nd, 2009

  “నీతో ఉంటే నవ్వుల పువ్వుల వికసిస్తాయి
  మమతానురాగాలు పరిమళిస్తాయి”
  బావుంది మిత్రమా !మీకూ స్నేహితుల రోజు శుభాకాంక్షలు

Leave a reply

RTSMirror Powered by JalleDa