ఫీనిక్స్‌లా మళ్లీ తిరిగొస్తానేమో…?!

handheart

వెళ్లాలని లేకున్నా
వెళ్లక తప్పకున్నా
వెళ్ళలేక వెళ్తున్నా…

నా మనసుని నీ నీడలో వదిలేసి
నా కలలను నీ దారిలో పారేసి
నా కన్నీటితో నీ హృదయంలో బొమ్మేసి
నా ఆశలను నీ గుమ్మంలో తుంచేసి
వెళ్లలేక వెళ్తున్నా….

ఒకే పెదవితో మాటలు సాగవని
ఒకే పాదంతో పరుగు సాగదని
ఒకే చేతితో చప్పట్లు మోగవని
ఒకే మనసుతో ముచ్చట్లు తీరవని
నేనే రెండుగా విడిపోయి
వెళ్లలేక వెళ్తున్నా…

అయినా,
వెళ్ళలేక వెళ్తున్నానేగానీ…
నీ మది కడలిని కలిసేందుకు
నది లాగా…
నీలోన దాగున్న నాకోసం
ఫీనిక్స్‌లాగా…
మళ్లీ మళ్లీ తిరిగొస్తానేమో….?!

 

4 Comments so far

  1. parimalam on July 26th, 2009

    హృదయాన్ని చేతులమధ్య సృష్టించేశారే !
    కవిత ..పాటగా బావుంటుందేమో …మంచి ట్యూన్ ట్రై చేయకూడదూ !
    మొదటి పేరా పల్లవి , తరవాతవి చరణాలు .
    చిన్న సవరణ చేయగలరా ?
    నీమది కడలిని కలిసేందుకు
    నది లాగా
    అన్యదా భావిచకండెం..నది వద్దకు కడలి రాదుకదా ! నదే కడలిలో కలుస్తుంది కదా ?

  2. kaarunya on July 26th, 2009

    నిజమేనండోయ్.. నిజానికి నేను రాయాలనుకున్నది కూడా అదే.. అప్పటి ఫ్లోలో అలా రాసేసి పెట్టేశాను. తరువాత గమనించనే లేదు. చాలా బాగా గుర్తు చేశారు. తప్పకుండా మార్చేస్తాను. థ్యాంక్స్ మిత్రమా..!

  3. ప్రేమికుడు on August 1st, 2009

    మిమ్మల్ని మీరు వదిలేసి ఎంతదూరం వెళ్లగలరు? ఎంతదూరం వెళ్లినా మళ్లీ మీ (మీదనుకున్న) చోటికేగా రావలసిందీ. :)

  4. kaarunya on August 2nd, 2009

    అంతేగా మరి…! :)

Leave a reply

9220 pages viewed, 14 today
3582 visits, 4 today
FireStats icon Powered by FireStats