భావ కుసుమ పరిమళం

flower2

ఎప్పుడయినా ఇది విన్నారా
ఇలాంటి పువ్వుల్ని ఎక్కడైనా చూశారా
వీటికి నీరు, మట్టి, సూర్యరశ్మి
వేటితోనూ పనిలేదు

ఎండాకాలంలో అయినా
చలికాలంలో అయినా
కష్టాల్లోనూ, సుఖాల్లోనూ
సర్వకాల సర్వావస్థల్లోనూ
ఇవెప్పుడూ వికసిస్తూనే ఉంటాయి

చాలా అరుదుగా మాత్రమే
చిన్నవిగా ఉంటాయేగానీ
నిత్యం పెరుగుతూనే ఉంటాయి
రేకులు కొన్ని రాలిపోయినా
రూపం కాస్త మారినా…
మళ్లీ మళ్లీ పెరుగుతూ…
మరింత అందంగా వికసిస్తుంటాయి

అలాంటి పువ్వుల్లో నేనూ ఒకరినే
వాటి పేరే “ప్రేమ”…!!

4 Comments so far

 1. sai praveen on July 21st, 2009

  ప్రేమ గురించి చక్కని విషయం తెలిపారు. చాలా బాగుంది. ఈ‌ ప్రపంచమంతా ప్రేమమయం అవ్వాలని కోరుకుందాం.

 2. చివరిదాకా ఊరించి ఊరించి ..ఏపూవబ్బా అది అనుకొంటూ చదివాను. తుదకు ప్రేమపుష్పం అని తేల్చారు, బాగుంది కారుణ్య గారూ..

 3. parimalam on July 21st, 2009

  “భావ కుసుమ పరిమళo”
  పేరుకు తగ్గట్టుగా కవిత దానికి దీటుగా చిత్రమూ …బావున్నాయండీ !

 4. kaarunya on July 21st, 2009

  @ సాయి ప్రవీణ్‌గారూ
  @ భాస్కర రామిరెడ్డిగారూ
  @ పరిమళంగారూ ధన్యవాదాలండీ..!!

Leave a reply

css.php