చిన్ని ఆశలే కానీ… తీరేదెలా…?!

women-dreams

నక్షత్రాలన్నింటినీ గుత్తులుగా చేసి
మా ఇంటి పై కప్పుకు వేలాడదీయాలని
ఆకాశంలోని చందమామను లాక్కొచ్చి
నా కొప్పులో చక్కగా తురుముకోవాలని

వెన్నెల చల్లదనాన్నంతా
పెద్ద పెద్ద డబ్బాలలో నింపేసి
మా ఇంటినిండా దాచేసుకోవాలని
జలపాతాల నీటినంతా
నా దోసిళ్లతో బంధించేయాలని

అభయారణ్యాల అందాన్నంతా
మా పెరట్లో తోటగా చేసేయాలని
అడవిమల్లెల సువాసనంతా
మా ఇంటిమల్లెలు దోచేసుకోవాలని
కోకిలమ్మ రాగాలన్నీ
మా పాప గొంతుతో వినాలని

ఎన్నె ఎన్నెన్నో…
చిన్ని చిన్ని ఆశలే…..!!
కానీ, తీరేదెలా……….?????

RTS Perm Link

3 Comments so far

 1. Sree on July 9th, 2009

  అంతరిక్షం నుండి అరణ్యం-అందులోని జీవాలు, మొక్కలు, పూల వరకు అన్నింటినీ మీ ఇంట్లోనే బంధించేయా(ఉంచుకోవా)లనుకోవడం చిన్ని ఆశా?? వామ్మో… ఇక పెద్ద పెద్ద ఆశలంటే ఎలా ఉంటాయో కదా…
  బాగుంది.. “ఖడ్గం”లో రవితేజ పాటలా ఉంది మీ కోరికల జాబితా.. 🙂

 2. parimalam on July 9th, 2009

  అబ్బ ఎంత ఆశో ….. 🙂

 3. kaarunya on July 9th, 2009

  మరి… ఎప్పుడూ లేని దాని గురించే ఆశ కదా….! అయినా ఆశకు అంతమేముంది చెప్పు మిత్రమా…? 🙂

Leave a reply

RTSMirror Powered by JalleDa