కల కానిది… నిజమైనది…!!
నా కల
తిరిగిరాని బాల్యం కోసం
అమ్మమ్మ చెప్పే కథల కోసం
తాతయ్య తెచ్చే మిఠాయిల కోసం
పంట కాలువల్లో… యేటినీళ్ళలో
అమ్మ కొంగుతో చేపల్ని పట్టేందుకోసం
తమ్ముళ్లతో చేసిన అల్లరి కోసం
నాన్న చెంపపై ఇచ్చిన గుర్తుల కోసం
అదే చెంపపై ఇచ్చిన ముద్దుల కోసం
***** *****
నా కల
శాంతించిన సూర్యుడి కోసం
నాట్యం చేసే చినుకుల కోసం
రైతన్నల కళ్లల్లో వెలుగు కోసం
అమ్మ ముఖంలో నవ్వు కోసం
***** *****
నా కల
తుపాకులు లేని రాజ్యం కోసం
యాసిడ్ దాడుల్లేని రోజు కోసం
నిజమైన రాజకీయాల కోసం
ప్రశాంతంగా బ్రతికే జనాల కోసం
ఎళ్లవేళలా పరితపించే శాంతి కోసం
***** *****
నా కల
స్వార్థం లేని మనుషుల కోసం
కల్మషం లేని నవ్వుల కోసం
ఎల్లలు లేని సంతోషం కోసం
బతుకంతా పెనవేసే స్నేహం కోసం
చివరిదాకా అంటిపెట్టుకునే ప్రేమ కోసం
***** *****
నా కలలన్నీ…
వెచ్చనివే… కానీ తడిగా ఉంటాయి
ఊహలే… కానీ సృజనాత్మకమైనవి
జ్ఞాపకాలే… కానీ ఉల్లాసాన్నిస్తాయి
సాధారణమైనవే… కానీ ఆలోచింపజేస్తాయి
కలలు, జ్ఞాపకాలు అన్నీ నావే… కానీ
వాస్తవ ప్రపంచం మనందరిదీ….!!
మీ కల నిజమవుతుందా నేస్తం ?
ఇంత అందమైన కల కలలోనైనా క్షణ కాలమైనా
నిజమైన అనుభూతినిచ్చే ఉంటుంది కదూ !
అవును నేస్తం… ఆ క్షణకాలం అనుభూతికి రూపమే ఈ కవిత
AMMAGIVITANNIKI ARDAM AMMA PREMA NINGIAKASAM UDHAVINCHE SURIYANI VELUGU VEPATIKI VIKAVENNATIKI VADIPONI PARIMALA MALALA SAUDARYAM AMMA AMMA LENIVANAM VERDAM AMMA LENI XANAM MARANAM…….. KAKIMAHESH.