హితుడా.. స్నేహితుడా.. స్వాప్నికుడా..!

sm3

నువ్వెప్పుడూ నా నేస్తానివే
అవును…
కొన్నిసార్లు నీతో పిచ్చిగా ప్రవర్తిస్తుంటా
నువ్వు కూడా అంతేలే…

                ***

ఎందుకలా అవుతోందో
కొన్నిసార్లు అర్థమైనట్లే ఉంటుంది
కానీ…
చాలాసార్లు అసలు అర్థమేకాదు

                ***

అయినా ఒకటి మాత్రం నిజం
ముందుగా నేనే నిన్ను క్షమించేస్తుంటా..
ఎందుకంటే….
నేనూ, నువ్వూ వేరు కాదు కదా..!
 

                ***

నువ్వు లేని రోజుల్లో…
పోనీలే పాపం అంటూ
ఒంటరితనంపై జాలిపడి
స్నేహం చేశాను గానీ
నీతో ఉన్నంత హాయి లేదు నేస్తం…!

                ***

మనవి రెండు శరీరాలేగానీ,
ప్రాణం మాత్రం ఒక్కటేనని
అన్నానే అనుకో…
అయితే మాత్రం,
నువ్వలా వెళ్తూ, వెళ్తూ
నా ఉనికిని కూడా తీసుకెళ్లటం
భావ్యమా చెప్పు…?!

                ***

నన్ను నేనే గుర్తుపట్టలేని స్థితిలో
ఎన్నాళ్లని ఉంటాను నేస్తం…?
అందుకే…
నేనూ నీ దగ్గరికే వచ్చేస్తున్నా….!!

                ***

6 Comments so far

  1. parimalam on June 14th, 2009

    చాలా అందంగా ఉంది మీ భావ వ్యక్తీకరణ !

  2. Sree on June 16th, 2009

    “నువ్వలా వెళ్తూ, వెళ్తూ నా ఉనికిని కూడా తీసుకెళ్లటం భావ్యమా చెప్పు…?!”
    “ఒంటరితనంపై జాలిపడి స్నేహం చేశాను”

    మీ కవితకు “బాగుంది, super, అద్భుతం” వంటి పదాలు సరిపోవు!
    ఎవరైనా మరో భేషైన పదం సూచిస్తారేమో… వేచి చూద్దాం :)

  3. kaarunya on June 16th, 2009

    పరిమళంగారూ, శ్రీగారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు. :)

  4. bolloju baba on June 17th, 2009

    బేషైన పదాలు నాకు తెలియదు .ఇది మాత్రం కేక

  5. kaarunya on June 18th, 2009

    :)

  6. wow gold on November 3rd, 2009

    Wonderful article. I been looking for one on a similar note. I guess you always have something up your sleeve.

Leave a reply

7420 pages viewed, 21 today
2858 visits, 18 today
FireStats icon Powered by FireStats