చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!!

kkd1

ీవితం అంటే.. ఛాయిస్‌ల మయం
అందుకే సరైనదాన్ని ఎంచుకో
ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు..
నీ మనసే ఒక వేదం.. ఒక నిజం
అలా అనుకుంటేనే…
గెలుపు అవుతుంది శాశ్వతం

        *    *     *    *    *

నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను
అమాంతం మార్చేసే మాటలవైపుకి
హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు
జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో
గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో

        *    *     *    *    *

ఎవరి కోసమూ నువ్వు మారకు
అయితే, నీ కోసం నువ్వు మారాలి
శరీరంలోని ప్రతి అంగమూ
నీదైనప్పడు..
మనోదృష్టి, భావపరంపరలు
కూడా నీవే కదా…
వాటిల్లో పరుల జోక్యమెందుకు..?

        *    *     *    *    *

నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ
నీదైన ముద్ర ఉన్నప్పుడు
నిన్ను నిన్నుగా ప్రేమించేవారు
ఎప్పుడూ నీ వెంటే ఉంటారు
నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు

ఏం…? నమ్మకం కలగటంలేదా..?

అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! 

        *    *     *    *    *

5 Comments so far

  1. parimalam on June 3rd, 2009

    very nice!

  2. padmarpita on June 3rd, 2009

    Beautiful….

  3. ఉష on June 3rd, 2009

    ఇది మాత్రం నిజం, మనకోసమే మనం బ్రతకాలి, తుది శ్వాసలో కూడా మనకి మనమే న్యాయం చేసుకోవాలి. ఎవరికివారు అలా బ్రతికిన నడే పరాన్నబుక్కులమయ్యే అవసరం రాదు. బాగా చెప్పారు.

  4. kaarunya on June 4th, 2009

    @ పరిమళంగారూ,
    @ పద్మార్పితగారూ,
    @ ఉషగారూ… సో మెనీ థ్యాక్సండీ…!!

  5. wow gold on November 3rd, 2009

    Good post,This was exactly what I needed to read today! I am sure this has relevance to many of us out there.

Leave a reply

7468 pages viewed, 33 today
2891 visits, 20 today
FireStats icon Powered by FireStats